దుమ్ముగూడెం అడవిలో టెన్షన్ టెన్షన్

-సీఎల్పీ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
-దుమ్ముగూడెం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై సీఎల్పీ ఆగ్రహం
-సుమారు మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యేలు
-పోలీసులకు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వివాదం
-హోరెత్తిన కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు, ఏర్పడిన ఉత్రిక్తత

దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. భద్రాచలం కేకే ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరిన సీఎల్పీ బృందాన్ని నిలువరించే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ శాసనసభక్ష నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దుమ్ముగూడెం వెళ్లడం లేదని చెప్పి పోలీసుల కళ్ళు కప్పి దారిలో అడవి మార్గాన ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డగించారు. దారికి అడ్డంగా ట్రాక్టర్లు, పోలీస్ డిసిఎం వ్యాను, పోలీస్ వాహనాలను నిలిపి ఎక్కడికి అక్కడ సీఎల్పీ బృందం వాహనాలను అడ్డుకున్నారు.

పోలీసుల నిర్బంధ వైఖరిని నిరసిస్తూ సీఎల్పీ బృందం దుమ్ముగూడెం మండలం భోజి గూడెం వద్ద రోడ్డు పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్ళనీయడంimage లేదని ఎమ్మెల్యేలు పోలీసులను నిలదీశారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు పోలీసులపై తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు దుమ్ముగూడెం పరిసర గ్రామాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఉన్నందున భద్రత కారణాల రీత్యా అక్కడికి అనుమతించడం లేదని ఏఎస్పీ రోహిత్ ఎమ్మెల్యేల వద్దకు వచ్చి చెప్పడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం సామాన్యులకు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ తెలంగాణలో ఇంత బలహీనంగా ఉందా అని ప్రశ్నించారు. సీఎల్పీ బృందం పర్యటన ఉంటుందని వారం రోజులు ముందుగా పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినప్పుడు ఎందుకుimage-1 తమకు రక్షణ ఏర్పాటు చేయలేదని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మావోయిస్టుల సాకుతో దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రభుత్వ నియంతృత్వమే అని సీఎల్పీ నేత భట్టి

మండిపడ్డారు. సీఎల్పీ బృందం దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శించడం వల్ల అక్కడ లోపాలు బయటపడతాయన్న భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో తమను అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.

పోలీసుల రక్షణ తమకేమీ అవసరం లేదని మా కార్యకర్తల రక్షణతోనే దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శిస్తామని చెప్పినప్పటికీ పోలీసులు ససేమిరా అంగీకరించలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నది.

దుమ్ముగూడెం సందర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఎసిపి రోహిత్ ఎమ్మెల్యేలకు చెప్పడంతో ప్రభుత్వ వైఖరి తీరును ఎండగడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దుమ్ముగూడెం ఎందుకుimage-2 వెళ్ళనివ్వరని ప్రశ్నించారు. అక్కడ జరుగుతున్న రహస్యం ఏందని నిలదీశారు. కచ్చితంగా దుమ్ముగూడెం వెళ్తామని భీష్మించడంతో పోలీసులు భారీగా మోహరించి అటువైపుగా వెళ్లకుండా కట్టడి చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు ప్రభుత్వానికి కేసీఆర్ కు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉద్రిక్తత వాతావరణ పరిస్థితి తలెత్తింది.

ఆ తర్వాత పోలీసులు గుర్రాల బేలు గ్రామం మీదుగా దుమ్ముగూడెం తీసుకెళ్తామని చెప్పడంతో రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యేలు వాహనాలు ఎక్కి ఆ గ్రామానికి రాగా అప్పటికే 500 మందికి పైగా పోలీసులు మోహరించి ఆ దారి గుండా వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రాజెక్టుల సందర్శన ముంపు గ్రామాల పరిశీలనకు పోలీసులు ససేమిరా అంగీకరించకపోవడంతో సిఎల్పీ బృందం తిరిగి భద్రాచలానికి చేరుకున్నది ఆ తర్వాత సారపాక గ్రామపంచాయతీ లోని సుందరయ్య కాలనీ సందర్శించారు.

Leave a Reply