డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనత జగన్ రెడ్డిదే

– గూగుల్ లోకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని కొడితే బటన్ సీఎం, ఫేక్ సీఎం, క్రిమినల్ సీఎం అని వచ్చే పరిస్థితి
– డ్వాక్రా మహిళల్ని బిల్ క్లింటన్, బిల్ గేట్ లాంటి నాయకుల పక్కన కూర్చోబెట్టిన ఘనత చంద్రబాబునాయుడిది
– వైఎస్ ఆసరా నుండి రావాల్సిన డబ్బులు ఎక్కడికెళ్లాయి?
– జగన్ పాలనలో డ్వాక్రా మహిళలకు జరిగిన అన్యాయం గత ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు
– వైసీపీ నాలుగేళ్ల పాలనలో డ్వాకా మహిళలకు జరిగిన అన్యాయంపై టీడీపీ కార్యాలయంలో ఛార్జిషీట్ విడుదల చేసిన తెలుగునాడు అంగన్ వాడి, డ్వాక్రా సాధికార కమిటి సభ్యులు

తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ అధ్యక్షురాలు ఆచంట సునీత మాట్లాడుతూ…
నేడు గూగుల్ లోకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని కొడితే బటన్ సీఎం, ఫేక్ సీఎం, క్రిమినల్ సీఎం అని వచ్చే పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది. ఇంతగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతోంది. అధికారంలోకి రాక మునుపు జగన్ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో తెలపాలి. అక్కచెల్లెమ్మలకు, డ్వాక్రా మహిళలకు అధికారంలోకి వచ్చిన మొట్టమదటి సంతకం డ్వాక్రా రుణ మాఫీపై చేస్తానని చెప్పి మహిళలను వంచించారు.

అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో డ్వాక్రా మహిళల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేసిన మేలు ఏంటి? డ్వాక్రా మహిళల సంక్షేమానికి మీరు ఏం చేశారో తెలపాలి. రాష్ట్రంలో ఒకకోటి 14 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు వారి సంక్షేమానికి తూట్లు పొడిచారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలను తన మానసపుత్రికలుగా చూశారు. నిరంతరం వారి అభివృద్ధికి పనిచేశారు. ప్రతి సంక్షేమ పథకాలలో, ప్రతి ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగస్వాములు చేసిన ఘనత గత ప్రభుత్వానిది.

నేడు జగన్ అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలను ప్రభుత్వ సభలు, సమావేశాలకు జనాలను తరలించే సంఘాలుగా మార్చారు. ఈ విషయంపై ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో చూపారు. డ్వాక్రా మహిళల్ని బిల్ క్లింటన్, బిల్ గేట్ లాంటి నాయకుల పక్కన కూర్చోబెట్టిన ఘనత చంద్రబాబునాయుడిది. డ్వాక్రా మహిళల్ని చంద్రబాబు గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారుచేశారు. జగన్ డ్వాక్రా మహిళలను కేవలం వారి పల్లకీ మోసేందుకు మాత్రమే వాడుకుంటున్నారు.

ప్రభుత్వాలు నిర్వహించే సమావేశాలకు వచ్చే సభ్యులుగా మాత్రమే ఢ్వాక్రా మహిళల్ని చూశారు. జగన్ ఆసరా ద్వారా కోటి మందికి లబ్ది చేకూరుస్తానని మాయ మాటలు చెప్పి అధికారంలోక వచ్చాక ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు. ఇంతవరకు ఎంత రుణమాఫీ చేశారో తెలపాలి. మార్చి 25వ తేదిన 4వ విడత బటన్ నొక్కారు. ఇంతవరకు డబ్బులు పడలేదు. జగన్ ను బటన్ సీఎం, ఫేక్ సీఎం, క్రిమినల్ సీఎం అనొచ్చు. వైసీపీ డ్వాక్రా మహిళలకు అందించిన సంక్షేమమేమిటో తెలపాలి. 4 సంవత్సరాల కాలంలో మూడవ విడత ఇవ్వాల్సిన రుణ మాఫీ సమయంలో ఖాళీ చెక్కులిచ్చారు. డ్వాక్రా సభ్యులు ప్రభుత్వ సభలు, సమావేశాలకు రాకపోతే మీ సంక్షేమ పథకాలు కట్ చేస్తామని చెబుతున్నారు.

ఏబీఎం ల ద్వారా ప్రభుత్వ సభలు, సమావేశాల్లో బలవంతంగా కూర్చోబెడుతున్నారు. ఢ్వాక్రా మహిళలకు ఖాళీ చెక్కులిచ్చి పెద్ద హంగామా, ఆర్బాటం చేశారు. సాక్షి పేపర్ లో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రకటనలు ఇచ్చుకున్నారు. గుండాలి భారతీరెడ్డికి మేలు చేసిన మహిళ తాడేపల్లి ప్యాలెస్ నుండి ఒకసారి బయటికొచ్చి చూడాలి. మేలు చేసిన మహిళకు సర్కార్ అభిమానం అని పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి భారతీరెడ్డికి సన్మానం చేశారు. ఆమె ఏం చేశారో తెలపాలి. ఒక కోటి 14 లక్షల మంది మహిళల జీవన విధానం వారి బతుకుతెరువును మీరు నిర్వీర్యం చేశారు.

వైఎస్ ఆసరా నుండి రావాల్సిన డబ్బులు ఎక్కడికెళ్లాయి? మీకున్న నాలుగు ప్యాలెస్ లలో ఏ ప్యాలెస్ కి వెళ్లాయో తెలపాలి. ప్రభుత్వ సభలకు డ్వాక్రా మహిళలు రాకపోతే వారిపై అసహనం ప్రదర్శిస్తారా? పనికిమాలిన మహిళలు అని మాట్లాడారు. సభ్యత, సంస్కారం, అభిమానం పురోగతి. టీడీపీ డ్వాక్రా మహిళల్ని 10 రూపాయల సంపాదించే దగ్గర నుంచి 10 వేలు సంపాదించుకునే స్థాయికి తెచ్చింది. వారి నిధులు రూ. 10 కోట్లను నవరత్నాలకు మళ్లించారు. రూపాయి రూపాయి దాచుకున్న అభయహస్తం నిధులు నవరత్నాలకు మళ్లించారు.

చంద్రన్న లక్ష కోట్లు డ్వాక్రా మహిళల అభివృద్ధికి ఖర్చు చేశారు. జగన్ లక్ష కోట్లు మహిళలనుంచి దోచుకున్నారు. ఇదేనా జగన్ కు మహిళలపై ఉన్న చిత్తశుద్ధి.. టీడీపీ హయాంలో చంద్రబాబు గోపాలమిత్ర, చంద్రన్న బీమా, కల్యాణమిత్ర ద్వారా ఎంతోమంది పేదలకు మేలు చేశారు. పేదవారు చనిపోతే బీమా మిత్ర పథకం ద్వారా టీడీపీ ప్రభుత్వం ఆదుకునేది. ప్రతి 30 కుటుంబాల చొప్పున ఒకరిని నియమించి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా అని పర్యవేక్షించేవారు. చంద్రబాబునాయుడు సున్నా వడ్డీ రుణాలు మూడు లక్షలే ఇస్తున్నాడు నేను పది లక్షలిస్తానన్న జగన్ ఇచ్చిన హామీ ఏమైంది?

చంద్రబాబు ఇచ్చే 5 లక్షలు రుణాన్ని జగన్ 3 లక్షలకు కుదించారు. జగన్ ధన దాహాం అధికమైంది. వైసీపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని డ్వాక్రా మహిళల్ని ఓట్లడగగలరు? కోటి 14 లక్షల మంది మహిళలుంటే కోతల పేరుతో మొదటి విడత 77 లక్షలన్నారు, ఇంకోసారి 75 లక్షలన్నారు. మరోసారి 76 లక్షలన్నారు. ఇలా పథకాలు అమలు చేయాల్సి వచ్చినప్పుడల్లా కోతలు విధించే పరిస్థితి తీసుకొచ్చారు. జగన్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఎవరికీ ఉపయోగపడలేదు. న్యాయబద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలందరూ ప్రతి నెల లోను కట్టుకోవాల్సి వస్తోంది.మొండి బాకీలున్న గ్రూపులకు తప్ప జగన్ ప్రభుత్వం చేసిన మేలు ఏమీ లేదు. పసుపు కుంకుమ పథకం కింద చంద్రబాబు ప్రతి మహిళకు 20 వేలు ఇచ్చేవారని ఆచంట సునీత వివరించారు.

అంగన్ వాడీ, ఢ్వాక్రా రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి ప్రవీణ మాట్లాడుతూ…
మహిళలపై అత్యాచారాలు, హత్యలు అధికమయ్యాయి. డ్రగ్ కేసులు ఎక్కువయ్యాయి. హోంమంత్రి రాష్ట్రంలో కనపడడంలేదని యాడ్ ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర సీఎం ఇంతటి దౌర్భాగ్య స్థితిని కల్పించారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే వారికి న్యాయం జరుగుతుందని ప్రతి ఒక మహిళ నమ్ముతోంది. మళ్లీ చంద్రబాబునాయుడును అధికారంలోకి రావడానికి ప్రతి ఒక మహిళ కృషి చేయాలి. మహిళల సంక్షేమం, సాధికారత తెలుగుదేశంతోనే సాధ్యం. వైసీపీ పాలనలో అడుగడుగునా మహిళలు అన్యాయాలకు గురవుతున్నారు. గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని అంగన్ వాడీ, ఢ్వాక్రా రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి ప్రవీణ తెలిపారు.

అంగన్ వాడీ, డ్వా్క్రా గుంటూరు విభాగం అధ్యక్షురాలు జానీ బేగం మాట్లాడుతూ..
డ్వాక్రా మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి దుల్హన్ పథకాన్ని తీసుకొచ్చారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం రిజిస్ట్రేషన్ ద్వారా మహిళలకు అండగా ఉన్నారు. ఇలాంటి ఎన్నో 50 వేలు ఉన్న దుల్హన్ పథకానికి లక్ష రూపాయలు ఇస్తానని మహిళలు అందించారు. కోటి మంది సభ్యులు ఏటా రూ.9 వేల కోట్లకు పైగా పొదుపు.. రూ. 21 వేల కోట్లకు పైగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని రాష్ట్ర ప్రగతికి బాటలు వేసేందుకు డ్వాక్రా సంఘాలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. అభయహస్తం కింద ఎల్ ఐసీలో దాచుకున్న రూ. 2,000 కోట్లకు పైగా నిధులను స్వాహా చేసి, స్త్రీ నిధి రుణాలను నిలిపేసి మహిళల ఆర్థిక మూలాలపై జగన్ రెడ్డి దెబ్బకొట్టారు.

జగనన్నసంపూర్ణ గృహహక్కు ఒటిఎస్‌ పథకానికి డబ్బులు చెల్లించేందుకు డ్వాక్రా గ్రూపుల పొదువులో నుంచి రుణాలు బలవంతంగా ఇప్పించాలని అక్క, చెల్లెమ్మల పొదుపు ఖాతాలు ఖాళీ చేయించారు. సంఘాల్లో సభ్యత్వం లేకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారులతో అధికారులే అధికవడ్డీకిరుణం ఇప్పించి. ‘కాల్‌ మనీ’ తరహా దందాకు తెరలేపారని అంగన్ వాడీ, డ్వా్క్రా గుంటూరు విభాగం అధ్యక్షురాలు జానీ బేగం తెలిపారు.

అంగన్ వాడీ, డ్వాక్రా విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షురాలు పొదిలి లలిత మాట్లాడుతూ…
ఏప్రిల్ 11, 2019 నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలన్నింటినీ ఆసరా పేరుతో మాఫీ చేస్తానని జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రూ.27,451 కోట్లు మాఫీ చేయాలి.కానీ రూ.25,517 కోట్లుగా పేర్కొన్నారు. తర్వాత సుమారు రూ.2 వేల కోట్లు కోత పెట్టి.. రూ.25 వేల కోట్లే అన్నారు. ఇలా మోసాలకు పాల్పడ్డారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్ని అధిగమించి వాయిదాల్లో రుణమాఫీ చేస్తే విమర్శలు చేసిన జగన్ రెడ్డి.. ఆర్ధిక స్థితి బాగుందని చెబుతూనే నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని,ఆచరణలో లబ్ధిదారుల్లో భారీగా కోత పెడుతూ చాలా ద్రోహానికి పాల్పడ్దారు. డ్వాక్రా సంఘాలు రుణ భారంలోకి కూరుకుపోయాయి.

పొదుపు మహిళలు బ్యాంకులో లోన్‌ తీసుకున్నప్పుడు బ్యాంక్‌ అధికారులు కచ్చితంగా డిపాజిట్‌ చేయాలని ఒత్తిడి తెస్తున్నా , పొదుపు లోన్లు తీసుకోకుండా అడ్డుపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అభయ హస్తం పథకం కలిగిన పొదుపు మహిళలకు పెన్షన్‌ పొందడానికి అర్హత ఉన్నా పెన్షన్లు ఇవ్వడంలేదని అంగన్ వాడీ, డ్వాక్రా విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షురాలు పొదిలి లలిత తెలిపారు.

Leave a Reply