-2024 తర్వాత రాష్ట్రంలో వైసీపీ ఉండదు, ఈ దేశంలో జగన్ ఉండరు
– బొత్స సత్యనారాయణకు భవిష్యత్తు ఏంటో అర్దం కాక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు
– టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు
రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబుది చెదిరిన చరిత్ర అని మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడటం హాస్యాస్పదం. ముందు రోజుల్లో తన భవిష్యత్తు, వైసీపీ భవిష్యత్ ఏంటో అర్ధం కాక బొత్స సత్యనారాయణ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి అవినీతి, అరాచకాలు, అబద్దాలతో పాలన సాగిస్తున్నారు. రెండున్నరేళ్లలో పాలనలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా..అబద్దాలు, వంచనతో ప్రజలు మోసం చేస్తున్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం బ్రిటిష్ హయాంలో కూడా జరగలేదు. ప్రజలు వైసీపీ అరాచక పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాలో తప్ప ప్రజల్లో కనిపించటం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ రాక్షస పాలనను తరమికొట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. 2024 తర్వాత రాష్ట్రంలో వైసీపీ ఉండదు, ఈ దేశంలో జగన్ రెడ్డి ఉండడు. జగన్ రెడ్డి సింగిల్ టైం సీయంగా చరిత్రలో మిగిలిపోవటం ఖాయం. ఈ విషయాలన్నీ బొత్స సత్యనారాయణకు తెలుసు. అందుకే ఆయనకు ముందు ప్యూఛర్ ఏంటో అర్ధం కాక ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.
ఓటీఎస్ కు ప్రజల నుంచి మద్దతు ఉందని బొత్స మాట్లాడటం సిగ్గుచేటు. బొత్స చెప్పేది నిజమే అయితే మంత్రులే స్వయంగా ఓటీఎస్ వసూళ్లకు వెళ్లాలి. ప్రజలు వారిపై తిరగకబడకుండా ఓటీఎస్ కడితే బొత్స చెప్పింది నిజమే అని మేం కూడా నమ్ముతాం. బొత్స సత్యనారాయణ తనను తాను మోసం చేసుకోవడంతో పాటు జగన్ రెడ్డిని కూడా మోసం చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ, జగన్ రెడ్డి ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలి.