(1) టీడీపీ ప్రభుత్వం 72% కట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసావా?
(2) హైదరాబాద్ ని మించిన రాజధాని కడతానని చెప్పావు కట్టావా?
(3) సంపూర్ణ మద్యపాన నిషేధం చేసాకే ఓట్లు అడుగుతానని చెప్పావు చేసావా?
(4) నిరుద్యోగులకు మెగా డీఎస్సీ ఇచ్చావా?
(5) ₹3వేల కోట్లతో పంటలకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసావా?
(6) ₹4వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల ఫండ్ పెట్టావా?
(7) మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టావా?
(8) మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టావా?
(9) ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నావు, ఒక్కటైనా విడుదల చేసావా?
(10) కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పావు తెచ్చావా?
(11) కడప స్టీల్ ఫ్యాక్టరీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో కడతానని చెప్పావు కట్టావా?
(12) గోదావరి జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తెస్తానని చెప్పావు తెచ్చావా?
(13) విశాఖ రైల్వే జోన్ అన్నారు తెచ్చావా ?
(14) వైజాగ్ స్టీల్ పై పోరాడావా ?
(15) ఆంధ్రా-తెలంగాణ నీటి వివాదం, ఆస్తుల పంచాయితీ తీర్చేస్తా అన్నావు.. కనీసం ఏం చేశావ్ ?
చివరాకరికి, నువ్వు అట్టహాసంగా ప్రారంభించిన ఫిష్ చేపల షాపులు ఉన్నాయా? ఫినిష్ చేసేసావా?
ఇంకా ఇలా చాలా ఉన్నాయ్ అన్నాయ్…
అడుగుతున్నా..
నీకు ఓటు ఎందుకు వెయ్యాలి?
– ముడిదాన ఆనంద్ కుమార్ వడ్డెర