అనంతబాబుని రక్షించడానికి ప్రయత్నించిన జగన్ రెడ్డి ముమ్మాటికీ దళితద్రోహే

30

• సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా చంపిన అనంతబాబుని రక్షించడానికి ప్రయత్నించిన జగన్ రెడ్డి ముమ్మాటికీ దళితద్రోహే
• దళితయువకుడు సుబ్రహ్మణ్యాన్ని అతికిరాతకంగా చంపేసి, మృతదేహాన్ని అతనింటికే పంపిన అనంతబాబుకోసం, పోలీస్ శాఖ, వైసీపీ ప్రభుత్వం పనిచేయడం అత్యంత బాధాకరం
• టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు 

తనవద్ద డ్రైవర్ గా పనిచేసే దళితయువకుడిని అత్యంతదారుణంగా చంపేసి, అతని మృతదేహాన్ని అతనింట్లోనే పడేసి, నన్నెవరూ ఏమీచేయలేరని కండకావరంతో విర్రవీగిన వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పై బయటకురావడానికి జగన్ రెడ్డి, అతనిప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్తంగా పనిచేశాయని టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే మీకోసం…!

“వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తనవద్ద డ్రైవర్ గా పనిచేసే దళితయువకుడు సుబ్రహ్మణ్యా న్ని దారుణంగా హత్యచేయడం, మృతదేహాన్ని మృతుడి ఇంటికే డోర్ డెలివరీ చేయడం సామాన్యమైన విషయంకాదు. అటువంటి ఘటనలో నిందితుడు, క్రిమినల్ అయిన అనంత బాబుని కాపాడటానికి జగన్ రెడ్డి, ఆయనపరివారం, ప్రభుత్వం చేయాల్సినంత సాయం చేశాయి.
90 రోజుల్లో పోలీసులు ఛార్జ్ షీట్ వేయనందునే అనంతబాబుకి బెయిల్…
అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏంచెప్పిందో, ఏమని తీర్పు ఇచ్చిందో సదరు తీర్పుకాపీని కూడా అందరూ పరిశీలించాలి. సుబ్రహ్మణ్యాన్ని హత్యచేసిన అనంత బాబు కేసులో ఏపీ పోలీస్ శాఖ 90 రోజులైనా ఛార్జ్ షీట్ వేయలేదు. ఎందుకంటే అనంతబాబుకి బెయిల్ రావడంకోసమే ఏపీ పోలీస్ ఆ పనిచేసింది. సుప్రీంకోర్టు తీర్పుని పరిశీలిస్తే, 90రోజులైనా ఛార్జ్ షీట్ వేయనందునే నిందితుడికి బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. పోలీసులు ఛార్జ్ షీట్ వేయకపోవడం, కాకినాడపోలీసులు వేసిన ఛార్జ్ షీట్ ను తిరస్కరిస్తే, దాన్నే తిరిగివేయడం, దానిలో ఎక్కడా సాక్షులను ప్రస్తావించకపోవడం జరిగింది. దళితయువకుడు వైసీపీఎమ్మెల్సీ చేతితో అత్యంత దారుణంగా, కిరాతకంగా చంపబడితే, అలాంటి కేసులో 90 రోజులైనా ఛార్జ్ షీట్ వేయకపోవడం పోలీసుల అసమర్థతా..లేక ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ రెడ్డి అసమర్థతా?

దళిత, గిరిజనుల్ని భయపెట్టి, ఏజెన్సీప్రాంతాలను తనకు అప్పగిస్తాడనే జగన్ రెడ్డి అనంతబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు..
అనంతబాబు నేరచరిత్ర తెలిసే ఈ ప్రభుత్వం అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అతన్ని, అతని నేరచరిత్రను అడ్డుపెట్టుకొని ఏజెన్సీ ప్రాంతాల్లోని దళిత, గిరిజనుల్ని తమదారికి తెచ్చుకొని, ఆప్రాంతంలో తాము అనుకున్నది చేయాలన్న దురాలోచన జగన్ రెడ్డికి ఉండబట్టే, అతనికి పదవిచ్చాడు. నేరంచేసినా అతనికి అండగా నిలిచాడు. అనంతబాబుని కాపాడటానికి ప్రభుత్వపెద్దలు కూడా విశ్వప్రయత్నాలు చేశారు. పోలీస్ శాఖ ఛార్జ్ షీట్ వేయకపోవడం ఒకతప్పయితే, జైలుకు వెళ్లిన వెంటనే తోటిఖైదీలపై అనంతబాబు దాడిచేస్తే, దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ లో కూడా అనంతబాబు పేరులేదు. అనంతబాబు బెయిల్ కోసం అతనితరుపున సుప్రీంకోర్టులో కేసు వాదించింది కూడా అభిషేక్ మనుసింఘ్వీ. అదే అభిషేక్ మనుసింఘ్వీ వివేకాహత్యకేసులో నిందితుడుగా ఉన్న ఏ5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తరుపున వాదనలు వినిపించాడు. కోట్లాదిరూపాయలు చెల్లించి మరీ అనంతబాబు సుప్రీంకోర్టులో తనతరుపున వాదించడానికి సింఘ్వీని నియమించుకున్నాడు.

అనంతబాబుని కాపాడటంలో రాజకీయపెద్దల హస్తముందని సుబ్రహ్మణ్యం తల్లి హైకోర్ట్ లో వేసిన పిటిషన్లో చెప్పింది…
సుబ్రహ్మణ్యం హత్యపై అతడి తల్లి హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. దానిలో ఆమె తనకుమారుడి హత్యలో, నిందితుడిని కాపాడటంలో రాజకీయపెద్దల హస్తముందని చెప్పింది. సామాన్యదళితుడు ఘోరాతిఘోరంగా తనపార్టీ ఎమ్మెల్సీ చేత చంపబడితే, ముఖ్యమంత్రి అతన్ని కాపాడటానికి ప్రయత్నించడం ఎంతటి అమానవీయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
జాతీయ నేరగణాంక నివేదిక ప్రకారం చిన్నారులు, మహిళలపై జరిగే అత్యాచారాలు, హత్యలు, అపహరణల్లో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి 8వస్థానంలో నిలిపాడు. సదరు నివేదిక చూసి నా, అనంతబాబు వ్యవహారంలో ప్రభుత్వవైఖరి పరిశీలించినా, దళితులు, బడుగు బలహీన వర్గాల రక్షణ విషయంలో జగన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి దళితద్రోహి అనడానికి అనంతబాబు కేసే పెద్దఉదాహరణ” అని నాయుడు తెలిపారు.