నరకకూపాల్లా మారిన రోడ్లపై తిరిగితే జగన్ రెడ్డికి ప్రజలకష్టాలు తెలుస్తాయి

• రాష్ట్రాభివృద్ధిలో రోడ్లపాత్ర కీలకమనే విషయం కూడా ముఖ్యమంత్రికి తెలియకపోతే ఎలా?
• బడ్జెట్ లో నిధులుకేటాయించకుండా, రోడ్లేసేవారికి డబ్బులివ్వకుండా ఉత్తుత్తి సమీక్షలుచేస్తే రోడ్లుఎలా బాగుపడతాయో జగన్ సమాధానం చెప్పాలి
• తనహాయాంలో రోడ్లనిర్మాణానికి కేటాయించిన నిధులు, కొత్తరోడ్ల నిర్మాణం, రోడ్లస్థితిగతులపై జగన్ రెడ్డి తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలన్నది టీడీపీ డిమాండ్
– టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ

తాను అధికారంలోకి వచ్చిందిమొదలు రోడ్లనిర్మాణంపై ఉత్తుత్తిసమీక్షలుచేయడం తప్ప, జగన్ రెడ్డి ఈ మూడున్నరేళ్లలో ఎక్కడా రోడ్లపై ఉన్న ఒకచిన్నగుంతకూడా పూడ్చలేదని, రాష్ట్ర రహదారులు, జిల్లాలను కలిపేరోడ్లు గజానికోగుంతతో దర్శనమిస్తున్నా, ప్రభుత్వంలో చలనం లేదని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారంఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు, ఆయనమాటల్లోనే …

“ముఖ్యమంత్రి పీఠం ఎక్కినపప్పటినుంచీ రోడ్లవేస్తున్నామంటూ జగన్ రెడ్డి తేదీలు మార్చాడు తప్ప, ఎక్కడా చిన్నగుంతకూడా పూడ్చలేదు. రాష్ట్రంలోని రోడ్లునరకకూపాల్లా మారి వేలాదిమందిని బలితీసుకుంటున్నాయి. ప్రభుత్వలెక్కలోకి రాకుండా నిత్యంజరిగే రోడ్డుప్రమాదాలు, మరణాలు కోకొల్లలుగా ఉన్నాయి. రహదారులపై చేపలుపెంచే దుస్థితిఉన్నా, ప్రజలు ఆగ్రహంతో రోడ్లపైవరినాట్లువేస్తున్నా ప్రభుత్వంలో చలనంలేదు. గర్భిణులకు మార్గమధ్యంలోనే ప్రసవాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంతదారుణంగా ఉందో చెప్పాల్సిపనిలేదు.

జగన్ రెడ్డి ఒక్కసారి రాష్ట్రరహదారులు, జిల్లారోడ్లపై ప్రయాణిస్తే జనం బాధలు తెలుస్తాయి. బడ్జెట్ లో నిధులుకేటాయించకుండా, ఉత్తుత్తి సమీక్షలుచేస్తే రోడ్లుఎలా బాగుపడతాయో జగన్ సమాధానం చెప్పాలి. భార్యల మెడల్లోని పుస్తెలు తాకట్టుపెట్టే దీనస్థితిలో కాంట్రాక్టర్లుంటే రోడ్లు బాగుపడతాయా? పక్కరాష్ట్రాలనుంచి ప్రశాతంగా ప్రయాణంచేసిన వారు, ఏపీరాగానే ఎగిరెగిరిపడి, రక్తం కళ్లచూస్తున్నారు.

జగన్ ప్రభుత్వం పోతేనే రోడ్లు బాగుపడతాయని ప్రజలనుకుంటున్నారు…
తాను, తనపార్టీవారంతా ఇకపై రోడ్లమీదే ఉంటారన్న జగన్ రెడ్డి, ఆపని ఎప్పుడుచేస్తాడా …. తమబాధలు ఎప్పుడు తెలుసుకుంటాడా అని జనం అనుకుంటున్నారు. రోడ్లపక్కన బారికేడ్లు ఏర్పాటుచేయడంలో చూపుతున్నశ్రద్ధలో సగమైనా ముఖ్యమంత్రి రోడ్లువేయడంలో చూపాలి. జగన్ ప్రభుత్వం దిగిపోతేనే రాష్ట్రంలోని రోడ్లరూపురేఖలు మారతాయన్న విశ్వాసంతో ప్రజలున్నారు. చంద్రబాబు హయాంలో రూ.4,500కోట్లు రోడ్లనిర్మాణానికి మంజూరైతే, జగన్ రెడ్డి వచ్చాక రూ.2,700కోట్లతో జరుగుతుతన్న రోడ్లనిర్మాణపనుల్ని నిలిపివేయించాడు. న్యూడెవలప్ మెంట్ బ్యాంక్ రోడ్లకోసం ఇచ్చిననిధుల్ని కూడా దారిమళ్లించాడు. గ్రామాలరోడ్లను ఎక్కడికక్కడ స్థానికులే బాగుచేసుకుంటున్నాకూడా జగన్ రెడ్డిలో చలనంలేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో తనడబ్బుతో రోడ్లు వేయించారు. ప్రతిపక్షనేతలుసరే, సొంతపార్టీనేతలు, ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నాకూడా జగన్ రెడ్డి రోడ్లగురించి పట్టించుకోవడంలేదు. రోడ్లనిర్మాణ నిధుల్నికూడా జగన్ తనకు కమీషన్లువచ్చే పనులకోసం దారిమళ్లించాడు. రాష్ట్రఅభివృద్ధికి అత్యంతకీలకమైన రవాణావ్యవస్థలో ప్రధానభూమిక పోషించే రోడ్లు అధ్వానంగా ఉండటంతో పారిశ్రామికరంగం కుదేలైంది. ఆర్టీసీ బస్సులుకూడా గుంతలదెబ్బకు అదుపుతప్పి ప్రజలప్రాణాలు పోయేపరిస్థితి.

చంద్రబాబు హయాంలో రోడ్లపై పడిన చిన్నగుంతలు పెద్దవి అయ్యాయంటున్న జగన్ రెడ్డి, మంత్రిధర్మాన మూడున్నరేళ్లనుంచి ఏంచేస్తున్నారు?
చంద్రబాబు హయాంలో రోడ్లపై చిన్నచిన్న గుంతలు పడితే, జగన్ రెడ్డి, రోడ్లు, మంత్రి ధర్మాన మూడున్నరేళ్లనుంచి గుడ్డిగుర్రంపళ్లుతోమారా? రాష్ట్రంలోని రహదారులపై కిలోమీటర్ కు 24 గుంతలున్నాయంటే వాటిపరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. గడపగడపకు వెళ్లిన వైసీపీప్రజాప్రతినిధులకు ప్రజలనుంచి ఎక్కువగా రోడ్లకు సంబంధించిన సమస్యలే ఎదురవుతున్నాయి. జనానికి సమాధానంచెప్పలేక అధికారపార్టీనేతలు ఎక్కడికక్కడ జారకుంటున్నా జగన్ రెడ్డి స్పందించకపోతే ఎలా? పల్లెల్లోని రోడ్లపై నడుము లోతు గుంతలు కనిపిస్తున్నా ప్రజాప్రతినిధులు ఏంచేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు.

రోడ్లు వేయడం చేతగాని ముఖ్యమంత్రి రోడ్ల సెస్సు పేరుతో ప్రజల్ని దోచేస్తున్నాడు
లీటర్ పెట్రోల్ డీజిల్ పై రోడ్లసెస్సు పేరుతో మూడున్నరేళ్లలో జగన్ రెడ్డి రూ.2వేలకోట్లు జనం ముక్కు పిండి వసూలుచేశాడు. రోడ్లు వేయడం చేతగాని ముఖ్యమంత్రి వాహనదారులనుంచి రోడ్ సెస్ ఎందుకు వసూలుచేస్తున్నాడు? ప్రజలనుంచి వచ్చేప్రతిపైసా ఓట్లకొనుగోలుకోసమే జగన్ దాచేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో కేంద్రం ఆమోదంతో 5,486కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని పంచాయతీ రాజ్ శాఖ చేపట్టింది. టీడీపీహయాంలో చురుగ్గాసాగిన అమరావతి-అనంతపురం 6లైన్ల ఎక్స్ ప్రెస్ వే పనుల్ని జగన్ రెడ్డి పడుకోబెట్టాడు.

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కి విజయవాడనుంచి భీమిలి భోగాపురానికి వేయాలనుకున్న రోడ్డునిర్మాణం కూడా జగన్ హాయాంలో నిలిచిపోయింది. జగన్ రెడ్డి కక్షసాధింపులకు అంతిమంగా ప్రజలే బలవుతున్నారు. రోడ్లుభవనాల శాఖకు మంత్రిఉన్నాడా.. ఉంటే ఆయనెక్కడున్నాడో, ఏంచేస్తున్నాడని ప్రశ్నిస్తున్నాం. ప్రజలుమెచ్చేలా పరిపాలనచేయడం చేతగాని వ్యక్తిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని చెప్పడం అతిశయోక్తికాదు.

ఒక్కఏపీలో తప్ప, దేశంలో ఎక్కడాలేని అధ్వాన్నపు రోడ్లనిర్మాణంపై, వైసీపీప్రభుత్వం కేటాయించిన నిధులెన్ని, మూడేళ్లలో ఎన్ని రోడ్లు వేశారనే వివరాలతో వాస్తవాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని జగన్ రెడ్డిని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రికి చేతనైతే టీడీపీ ప్రభుత్వం వచ్చేలోగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై ఉన్న గుంతలైనా పూడ్చి తన పనితీరునిరూపించుకోవాలి” అని రఫీ హితవుపలికారు.