• ప్రకృతి విపత్తులకు ఎదురొడ్డి నిలిచిన ఏపీ రైతులు, జగన్ రెడ్డి అనే విపత్తు దెబ్బకు కుంగిపోయి, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు
• రూ.3వేలకోట్లతో ఏర్పాటుచేస్తానన్న ధరలస్థిరీకరణ నిధి, రూ.4వేలకోట్ల ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏమైంది జగన్ రెడ్డి?
• పంటనష్టపోయిన మిర్చిరైతులకు ఎకరాకు రూ.50వేలు, పత్తిరైతులకు ఎకరాకు రూ.40వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం : మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు
• ప్రకృతి విపత్తులకు ఎదురొడ్డి నిలిచిన ఏపీ రైతులు, జగన్ రెడ్డి అనే విపత్తు దెబ్బతో కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు : తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
• సొంతపార్టీనేతలే లక్ష్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం డిటెక్టివ్ ఏజెన్సీలా పనిచేస్తోంది. వైనాట్ 175 అంటున్న జగన్ రెడ్డికి వచ్చేఎన్నికల్లో 5 లేదా 7 స్థానాలు మాత్రమే దక్కుతాయి : మాజీఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్
తెగుళ్లు, పురుగులతో దెబ్బతిన్న పత్తి, మిర్చి రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జగన్ రెడ్డి రైతుసంక్షేమం అంతా ప్రకటనలకే పరిమితమైంది : పత్తిపాటి పుల్లారావు (మాజీమంత్రి)
“రాష్ట్రంలో పత్తి, మిరప రైతులు తీవ్రసంక్షోభంలో కూరుకుపోయారు. రూ.3వేలకోట్లతో ఏర్పాటుచేస్తానన్న ధరల స్థిరీకరణ నిధి, రూ.4వేలకోట్ల ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏమైందో జగన్ రెడ్డి చెప్పాలి. రైతులు పంటలుకోల్పోయి నష్టపోతున్నా ముఖ్యమం త్రికి పట్టడంలేదు. రైతుభరోసా కేంద్రాలు రైతుదగా కేంద్రాలుగా మారాయి.
ప్రభుత్వం తమను ఎప్పుడు ఆదుకుంటుందా అని పత్తి, మిరప రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు
2022లో భారీవర్షాలు, తుపాన్ల కారణంగా పత్తి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయా రు. గులాబిపురుగుతో పత్తి, నల్లితో మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. చంద్రబాబు నాయుడు గుంటూరుజిల్లాలో పర్యటించి, పత్తి మిరప రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఆ సమయంలో చిలకలూరిపేట మంత్రి పల్నాడు జిల్లా కలెక్టర్ తో హడావుడిచేసి, తరువాత రైతుల్నిగాలికి వదిలేశారు. ప్రభుత్వం ఎప్పుడు స్పంది స్తుందా, ఎప్పుడు తమను ఆదుకుంటుందా అని పత్తి, మిరప రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
తెగుళ్లు, పురుగులతో పత్తి, మిరపరైతులు అప్పులపాలై, ఆత్మహత్యలకు పాల్పడుతున్నా జగన్ రెడ్డిలో చలనం లేదు
16లక్షల32వేల ఎకరాల్లో పత్తిసాగైతే, కర్నూలు జిల్లాలో 6.55లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. పల్నాడుజిల్లాలో 2.75లక్షల ఎకరాల్లో, అనంతపురం జిల్లాలో 1.70లక్ష ల ఎకరాల్లో, కడపజిల్లాలో 1.07లక్షల ఎకరాల్లో, ప్రకాశం జిల్లాలో 1.02లక్షలఎకరాల్లో, ఎన్టీఆర్ జిల్లాలో 92వేల ఎకరాల్లో, నంద్యాలజిల్లాలో 75వేలఎకరాల్లో, గుంటూరు జిల్లా లో 65వేలఎకరాల్లో పత్తిసాగుచేశారు. కల్తీ విత్తనాలు, కల్తీఎరువులు, గులాబిపురుగు, తెగుళ్లతో పత్తిరైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి కూడా సగానికి పైగా పడిపో యింది. పత్తిరైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తలెత్తినా జగన్ రెడ్డిలో చలనం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా 5.55లక్షల ఎకరాల్లో మిరప సాగుచేశారు. పల్నాడుజిల్లాలో 1,39,300 ఎకరాల్లో సాగుచేశారు. కర్నూల్లో 1,26,200ఎకరాల్లో, ప్రకాశం జిల్లాలో69,330 ఎకరాల్లో, అనంతపురం జిల్లాలో 67,990 ఎకరాల్లో, ఎన్టీఆర్ జిల్లాలో 45వేలఎకరాల్లో, నంద్యాల జిల్లాలో 45వేల ఎకరాల్లో, గుంటూరుజిల్లాలో 40వేలఎకరాల్లో మిరప వేశారు. గత ఏడాది 4.60లక్షల ఎకరాల్లో మిరపవేశారు. ఈ ఏడాది సాగువిస్తీర్ణం పెరిగింది. ప్రధాన వాణిజ్యపంట అయిన మిరపకు కూడా అంతుపట్టని తెగుళ్లు సోకాయి. మిరప పంటను తెగుళ్లు, పురుగులు నాశనంచేస్తున్నా, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏంచేస్తున్నా రో తెలియడంలేదు? ప్రభుత్వం రైతుల్ని ఆదుకునేదిశగా, తెగుళ్లు, పురుగుల నివారణ కు ఎలాంటిచర్యలు తీసుకోలేదు. పంట చేతికొచ్చేసమయానికి మిర్చిధర తగ్గిపోతోంది. వారం క్రితం క్వింటాల్ మిర్చి ధర రూ.18వేలనుంచి రూ.22వేలుంటే, ఇప్పుడు రూ.15వేలకు పడిపోయింది. ధరలు పడిపోతున్నా ప్రభుత్వం స్పందించే స్థితిలో లేదు. మిర్చి, పత్తిరైతులే కాదు, ఇతర వాణిజ్యపంటలు వేసిన రైతుల్ని కూడా జగన్ సర్కార్ గాలికి వదిలేసింది. జగన్ రెడ్డి మోసంతో ఒక్కరైతు ఏటా రూ.30వేల వరకు రైతుభరోసా సొమ్ము కోల్పోతున్నాడు.
64లక్షలమందికి రైతుభరోసా ఇస్తామన్న ప్రభుత్వం, కేవలం 46లక్షల మందికే ఇస్తూ, దగాచేస్తోంది. రైతుభరోసా కింద రూ.13,500 ఇస్తానన్న జగన్ రెడ్డి, రూ.7,500లతో సరిపెట్టాడు. ఒక్కో రైతు జగన్ రెడ్డి నిర్వాకంతో ఏటా రూ.30వేలవరకు నష్టపోతు న్నాడు. జగన్ రెడ్డి ప్రకటనల్లో చూపుతున్న ఆర్భాటం, రైతులకు అందించే సాయంలో చూపడంలేదు. జగన్ ప్రభుత్వంలో కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌలురైతులకు రైతుభరోసా సాయంలేదు.
పండించిన పంటఉత్పత్తులు అమ్ముకునే అవకాశంలేదు. టీడీపీప్రభుత్వంలో రైతులకు అన్నిరకాల వ్యవసాయ పనిముట్లు, యంత్రపరికరాలు, ట్రాక్టర్లు, మైక్రో ఇరిగేషన్ సామగ్రిని 70, 80శాతం సబ్సిడీపై అందించాము. జగన్ రెడ్డి వచ్చాక ఒక్కరైతుకి కూడా ఎలాంటి పరికరం అందించింది లేదు. ప్రకృతివ్యవసాయం చేసే రైతులకు చంద్రబాబు అన్నివిధాల అండగా నిలిచారు. జగన్ పాలన రైతాంగానికి శాపంగా మారింది. ఆఖరికి ఉచిత విద్యుత్ కి కూడా మంగళంపాడే పరిస్థితికి వచ్చారు.
రైతులు వ్యవసాయంమానేస్తే తీవ్రమైన సంక్షోభం తలెత్తుతుందనే వాస్తవాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలి. ఇప్పటికైనా జగన్ రెడ్డి మొద్దునిద్ర వీడి, తాడేపల్లి ప్యాలెస్ వీడి రైతుల వద్దకు వెళ్లాలి. పంటనష్టపోయిన మిర్చిరైతులకు ఎకరాకు రూ.50వేలు, పత్తిరైతులకు ఎకరాకు రూ.40వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.”
ప్రకృతి విపత్తులకు ఎదురొడ్డి నిలిచిన ఏపీ రైతులు, జగన్ రెడ్డి అనే విపత్తు దెబ్బతో కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు : తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
“2019లో అధికారంలోకి వచ్చింది మొదలు జగన్ రెడ్డి ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యాడు. రైతులకు తానిచ్చిన హామీల్ని జగన్ రెడ్డి పూర్తిగా విస్మరించాడు. రాష్ట్రంలో వ్యవసాయశాఖ ఉందని రైతులు మరిచిపోయారు. సాగుకి వాతావరణం అనుకూలించినా, జగన్మోహన్ రెడ్డి బాధ్యతారాహిత్యం రాష్ట్ర రైతాంగాన్ని నాశనం చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అనేకసర్వేలు రాష్ట్ర రైతుల దీనస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఏపీలో నూటికి 93.5శాతం మంది రైతులు అప్పులఊబిలో కూరుకు పోయారని సర్వేలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగాఉన్న రైతుల సగటుఅప్పు రూ.74,500లు అయితే, ఏపీ రైతుల సగటు అప్పు మాత్రం రూ.2,45,500లు ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతు ఆత్మహత్యల్లో 3వస్థానంలో ఉంది. కానీ జనాభాపరంగా చూస్తే రైతుఆత్మహత్యల్లో ఏపీ తొలిస్థానాన్నే మించిపోతుంది. వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర రైతాంగానికే ఎందుకిన్ని సమస్యలు, అవస్థలు?
నల్లితామర, గులాబిపురుగుతో దెబ్బతిన్న పత్తి, మిరప రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?
వ్యవసాయంలో నైపుణ్యం చూపి, మేలైన పంటలుపండించే ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ రెడ్డి రూపంలో పెద్దవిపత్తు వచ్చిపడింది. ప్రకృతి విపత్తులను తట్టుకుని పంటలు పండించే రాష్ట్రరైతులు, పాలకులు నిర్లక్ష్యానికి బలవుతున్నారు. రైతులకు సమస్యలు వచ్చినప్పుడు, పంటలు నాశనమైనప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? పల్నాడుజిల్లాలో అత్యధికంగా మిరప సాగుచేస్తారు. తర్వాత కర్నూల్లో ఎక్కువ గా సాగుచేస్తారు. ఈ ఏడాది 4.38లక్షలఎకరాల్లో మాత్రమే మిరప సాగుచేశారని ప్రభుత్వలెక్కలు చెబుతున్నా, వాస్తవంలో 5లక్షల ఎకరాలకు పైనే సాగుచేశారు. నల్లి, తామరతో మిర్చిపంట దారుణంగా దెబ్బతింటోంది. ఒక్కో మిరపపువ్వులో 50 నుంచి 100వరకు సూక్ష్మమైన నల్లిపురుగులు ఉంటున్నాయి. ఆకుకి అడుగుభాగాన ఎర్రతామర అనే క్రిమిచేరి రసాన్ని పీల్చేసి, మొత్తం మొక్కే నిర్జీవమయ్యేలా చేస్తోంది.
ఈ విధంగా కొత్తరకం తెగుళ్లతో మిర్చిపంట దెబ్బతింటుంటే, వ్యవసాయశాస్త్రవేత్తలు, వ్వవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయశాఖ ఏంచేస్తున్నాయి? నల్లి, తామర, ఇతరపురుగుల నివారణకు అవసరమైన పురుగుమందుల్ని, ఎరువుల్ని ప్రభుత్వం ఎందుకు ఉత్పత్తిచేయలేకపోయింది? ల్యాండ్, శాండ్, మైన్, వైన్ లాంటి వాటిని దోచుకోవడంతోనే ప్రభుత్వానికి సరిపోతోంది తప్ప, రైతులగురించి ఆలోచించే తీరిక లేదు. వ్యవసాయశాస్త్రవేత్తల బృందం వచ్చి తమపొలాలు పరిశీలించి, పంటఉత్పత్తికి పొలంపనికొస్తుందా లేదా అనిచెప్పే స్థితిలోలేరని రైతులు వాపోతున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి, మిర్చిరైతులు తీవ్రంగా నష్టపోయారు.
రూ.1600లకు అమ్మే లీటర్ పురుగుమందుని రూ.3వేలకుకొని రైతులు దెబ్బతింటున్నారు. మిరప పంటకు పూత, పిందె రావాల్సిన దశలో రాకపోతే, ప్రభుత్వం ఏడీస్థాయి అధికారుల్ని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపి చేతులు దులుపుకుంది. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్న నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి విత్తనతయారీ కంపెనీ విత్తనాలు వేసి పత్తి రైతులు దెబ్బతిన్నారు. దానిపై వ్యవసాయశాఖతో పరిశోధన చేయించి, పత్తిరైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టు ఊరుకుంది. రైతులకు అండగా ఉండి, వారికి ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వమే వ్యవసాయాన్ని గాలికి వదిలేయడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ రైతులకు అండగా నిలిచి, వారికి ధైర్యం చెప్పేందుకు కృషిచేస్తున్నాం. కొద్దిరోజుల్లో టీడీపీప్రభుత్వం వస్తుందని, రైతుల్ని ఆదుకుంటుందని భరోసా కల్పిస్తున్నాం. గతవారం పల్నాడు జిల్లాలో టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ పర్యటించింది. ఈనెల రెండోవారంలో ఉత్తరాంధ్రలో పర్యటించబోతోంది. టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి, రైతులకున్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.”
ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉన్నవారెవరూ వైసీపీ జెండా మోయరు. సొంతపార్టీనేతలే లక్ష్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం డిటెక్టివ్ ఏజెన్సీలా పనిచేస్తోంది. : మాజీఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్
“జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి మునిగిపోయే నావను తలపిస్తోంది. సొంతపార్టీ నేతలే లక్ష్యంగా ప్రభుత్వం డిటెక్టివ్ ఏజెన్సీలా పనిచేస్తోంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జగన్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ప్రధానికి లేఖరాశారు. దానిపై అధికారపార్టీ ఎదురుదాడి చేసి, అడ్డగోలుగా బుకాయించింది. టీడీపీనేత పయ్యావుల కేశవ్ కూడా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. గతంలో టీడీపీ చెప్పింది నిజమేనని ఇప్పుడు వైసీపీఎమ్మెల్యేలు బహిరంగపరిచారు. దొంగచాటుగా ప్రభుత్వం సొంతపార్టీనేతలతో పాటు, ప్రతిపక్షనేతల జీవితాలపై నిఘాపెట్టింది. నెల్లూరుజిల్లాతో పాటు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని వైసీపీనేతలు ఫోన్ ట్యాపింగ్ పై నోరువిప్పారు.
వైసీపీని వీడటానికి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రభుత్వాన్ని సమర్థించిన మాజీమంత్రి పేర్నినాని వచ్చే ఎన్నికల్లో ధైర్యం గా తానే పోటీచేయగలడా? ధర్మానప్రసాదరావు, బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్లు కూడా పార్టీని వీడి సొంతంగా గ్రూపులుకట్టే స్థితికి వచ్చారు. మరోమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇప్పటికే తనకు అనుకూలమైన ఎమ్మెల్యేలతో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉన్నవారెవరూ వైసీపీ జెండా మోయడానికి సిద్ధంగా లేరు. వైనాట్ 175 అంటున్న జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో 5 లేదా 7 స్థానాలు మాత్రమే వస్తాయి.”