రాజధాని కేసు సుప్రీం కోర్టులో ఉండగా విశాఖ రాజధాని అని జగన్ అనడం.. సైకో సీఎం అనడానికి నిదర్శనం

-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

రాజధాని కేసు సుప్రీం కోర్టులో ఉండగా విశాఖ రాజధాని అని జగన్ అనడం.. సైకో సీఎం అనడానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సైకో అని మేం ముందునుంచి చెబుతూ వస్తున్నాం. నేడు అది నూటికి నూరు పాళ్లు నిజమైంది. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని.. తాను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను.. ఎట్టి పరిస్థితుల్లోను అమరావతిని మార్చనని స్పష్టం చేశారు. ఇలా చెప్పి ఎన్నికలకు వెళ్లి గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలయ్యాక ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తు్న్నారు.

రాష్ట్రాన్ని మళ్లీ విభజన చేయాలని ప్రయత్నిస్తున్నారు. మూడు ముక్కల పేరుతో మూడు రాజధానుల డ్రామా అడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వంపైగానీ, వారి కుటుంబంపైగానీ, ఆయనపైగానీ సమస్య వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి, పక్కదారి పట్టించడానికి రాజధాని ఇష్యూని తెరపైకి తెస్తుంటారు. రాష్ట్ర రాజధాని విషయంలో చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి లేదు అని స్వయంగా హైకోర్టు చెప్పింది. దీనిని మేం కొట్టేస్తున్నాం అని హైకోర్టు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి అని శాసనసభకి రాజధానిని మార్చే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రజలు గమనించాలి. వెంటనే వైసీపీ నాయకులు మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లడం జరిగింది. సుప్రీం కోర్టును స్టే అడిగారు. తాము స్టే ఇవ్వమని సుప్రీం కోర్టు చెప్పింది. కేసు స్వీకరించి సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ప్రస్తుతం ఈ సైకో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ఢిల్లీలోని ఓ సమ్మిట్లో మాట మార్చారు. ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని విశాఖపట్నం అని చెప్పారు. నేను కూడా త్వరలో షిఫ్ట్ అవుతున్నానని ప్రకటన చేశాడు. దీన్ని బట్టి ఈ ముఖ్యమంత్రిని సైకో కాకపోతే ఏమనాలి? ముఖ్యమంత్రి బాబాయి హత్య కేసు గురించి దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సీబీఐ కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది.

జగన్ సోదరుడు ఎంపి అవినాష్ రెడ్డిని ఏ సమయంలోనైనా అరెస్టు చేసే పరిస్థితులు ఉన్నాయి. జగన్ కుటుంబ సభ్యుల ఆడియో రికార్డులు లీక్ అవుతున్న సందర్భంలో.. దీనిమీద ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న తరుణంలో ఈ ఇష్యూని దారి మళ్లించాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశంతోనే విశాఖపట్నం రాజధాని అని చెబుతున్నారు. కొత్త డ్రామా మొదలుపెట్టాడు. విశాఖపట్నం రాజధాని కావాలని ఎవరూ అడగలేదు. దోపిడీ చేసుకోవడానికే విశాఖను రాజధాని అంటున్నారు.

ఇప్పటికే 40 వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను దోచుకున్నారు. విశాఖవాసులు వారి స్థలాలను కాపాడుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారి ఆస్తులను దోచుకోవడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తు్న్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టుకోవడానికి, అమ్ముకోవడానికి విశాఖపట్నం రాజధానిని మార్చాలని చూస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగంపై ముఖ్యమంత్రికి ఏమాత్రం విశ్వాసం ఉన్నా చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. మూడు రాజధానుల ఇష్యూ సుప్రీం కోర్టులో ఉంటే విశాఖ రాజధాని అనడం సైకో విధానానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వివరించారు.

Leave a Reply