– తనకు, తన ప్రభుత్వానికి సంబంధంలేని కేసులో వేలుపెట్టి, జీఎస్టీ సెక్షన్-6ను ఉల్లంఘించి కేంద్రప్రభుత్వ సంస్థల విచారణలో తలదూర్చాడు
– కుటుంబసభ్యులు డైరెక్టర్లుగా ఉన్న నిర్మాణ సంస్థ అలెక్సా కార్పొరేషన్ రూ.8కోట్ల ట్యాక్స్ మినహాయింపులు కోరిన ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ DGGI విచారణ చేపట్టింది
– అలెక్సా కంపెనీ ఎండీ జోగేశ్వరరావు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.. కంపెనీ తరుపున జరిగిన వ్యవహారాలకు తానే బాధ్యుడినని ఒప్పుకున్నారు
– అలెక్సా సంస్థకు రాష్ట్ర సీఆర్డీఏతో ఎలాంటి సంబంధంలేదని సీఆర్డీఏ అధికారులే చెప్పారు
ఇవన్నీ తెలిసీ కావాలనే జగన్ రెడ్డి.. రాజేశ్వర్ రెడ్డి, సీతారామిరెడ్డి అనే ఇద్దరు అధికార్లను పట్టుకొని వారి ద్వారా ప్రత్తిపాటి శరత్ ను టార్గెట్ చేశాడు
– అలెక్సా సంస్థ ఎండీ జోగేశ్వరరావుని కాదని, 3 నెలల క్రితం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన శరత్ ను వేధించడం జగన్ సైకో పాలనలో భాగమే
– 10 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాగానే తాడేపల్లి ప్యాలెస్ కు జగన్ రెడ్డి బాధితులంతా క్యూకడతారు
– ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే జగన్ రెడ్డి బోడిగుండుగా మార్చిన రుషికొండకు వెళ్తాడు
– ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచి లండన్ కు పారిపోతాడు
– లండన్లో దాక్కోవడానికి ఇప్పటికే అక్కడ ఐలాండ్ కొన్నాడని, ఒక ప్రముఖ కంపెనీలో రూ.25వేలకోట్లతో షేర్లు కొన్నాడని మాకున్న సమాచారం
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
జగన్ రెడ్డి అరాచకాలు..దుర్మార్గాలకు ప్రత్తిపాటి శరత్ అక్రమ అరెస్ట్ నిదర్శన మని, తనకు లేని అధికారాన్ని ఆపాదించుకొని మరీ APSDRI అనే విభాగాన్ని ఏర్పాటు చేసి, తనకు ముఖ్యలైన రాజేశ్వర్ రెడ్డి.. సీతారామిరెడ్డి అనే ఇద్దరు అధికారుల్ని అడ్డుపెట్టుకొని మరీ ముఖ్యమంత్రి, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారా వు కుమారుడిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
“2020 నుంచి వ్యాపారుల్ని.. వివిధ కీలక సంస్థల్ని.. కాంట్రాక్ట్ ఏజెన్సీలను.. వాటి యాజమాన్యాల్ని బెదిరించే కార్యక్రమాలకు జగన్ సర్కార్ సిద్ధమైంది. జగన్ రెడ్డి, ధనుంజయరెడ్డికి తోడు..ఇంతకముందు రఘురామిరెడ్డి ఉంటే, ఇప్పుడు రాజేశ్వర్ రెడ్డి, సీతారామిరెడ్డి తోడయ్యారు. ఇలాంటి వీళ్లంతా కలిసి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చాలని చూస్తున్నారు.
గత 58 నెలలుగా ఇదే జగన్ రెడ్డి ఎంతోమంది టీడీపీనేతలపై తప్పుడు కేసులు పెట్టించినా, తన చేతిలోని వ్యవస్థలతో వారిని ఇబ్బందులకుగురిచేసినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. న్యాయస్థానాల్లో పోరాడి విజయం సాధించారే తప్ప.. జగన్ లా ఏడవ లేదు. తాజాగా ప్రత్తిపాటి శరత్ పై జగన్ రెడ్డి ఇప్పించిన లుకౌట్ నోటీస్… ఆయన ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలన్నీ టీడీపీ సీనియర్ నాయకుడి కుటుంబంపై కక్షసాధించడంకోసం చేస్తున్నవే.
తనకు.. తన ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని కేసులోకి జగన్ రెడ్డి ఎందుకు దూరాడు?
రాష్ట్రంలో జరిగే దోపిడీ…అవినీతి.. దళితులు.. బీసీలు.. మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని వదిలేసి అలెక్సా కంపెనీ లావాదేవీలపై నీకు ఎందుకు అంత మోజు జగన్ రెడ్డి?
అలెక్సా అనే కంపెనీలో కొందరు కుటుంబసభ్యులు డైరెక్టర్లుగా ఉండి, ఎన్నో ఏళ్ల నుంచి వివిధ రాష్ట్రాల్లో నిర్మాణ రంగాన్ని కొనసాగిస్తున్నారు. 20 సంవత్సరాలకు పైగా నిర్మాణరంగంలో అలెక్సా సంస్థకు మంచి అనుభవముంది. 2023-24 లో దేశవ్యాప్తంగా ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ నమోదులో జరిగిన రూ.18వేలకోట్ల అవ కతవకలపై కేంద్రప్రభుత్వ సంస్థ DGGI (DIRECTORATE GENERAL OF GST INTELLIGENCE) దర్యాప్తు జరిపింది. దర్యాప్తులో భాగంగా జీఎస్టీ చెల్లింపుల్లో తేడాలుంటే సదరు సంస్థలు..వాటికి సంబంధించిన సిబ్బందిని DGGI విచారిస్తుంది.
దానికి సదరుసంస్థల యాజమాన్యాలు DGGIకి వివరణ ఇచ్చుకుంటాయి. తనకు.. తన ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని కేసులోకి జగన్ రెడ్డి ఎందుకు దూరాడు? రాష్ట్రంలో జరిగే దోపిడీ…అవినీతి.. దళితులు.. బీసీలు.. మైనారిటీలపై జరుగుతుతున్న దాడుల్ని వదిలేసి అలెక్సా కంపెనీ లావాదేవీలపై నీకు ఎందుకు అంత మోజు జగన్ రెడ్డి? సదరు కంపెనీ రూ.8కోట్ల ట్యాక్స్ మినహాయింపు కోరితే, సదరుసంస్థకు నోటీసులు అందితే దానిపై సంస్థ తరుపు న ఎండీగా ఉన్న జోగేశ్వరరావు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.
తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ DGGI నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ లోపే అలెక్సా కంపెనీ ఏదో తప్పు చేసినట్టు జగన్ రెడ్డి ఎఫ్.ఐ.ఆర్ లు విడుదల చేయడం..నోటీసులు ఇవ్వడం చేసేశాడు. రాజేశ్వర్ రెడ్డి, సీతారామి రెడ్డిలను అడ్డుపెట్టుకొని వ్యవహారం నడిపాడు. కేంద్రప్రభుత్వ ఇచ్చిన షోకాజ్ నోటీసులు జతపరిచి, అలెక్సా కంపెనీకి ప్రభుత్వం తరుపున నోటీసులు పంపారు. అంతకంటే ముందు అలెక్సా సంస్థ రూ.45 కోట్లకు అక్రమ బిల్లులు తీసుకుందని రాజేశ్వర్ రెడ్డి స్వయంగా APSDRIకి లేఖరాశాడు.
ఆ లేఖను అడ్డం పెట్టుకొని వెంటనే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సహా కుటుంబం మొత్తాన్ని టార్గెట్ చేశాడు. మరోపక్క అలెక్సా నిర్మాణ సంస్థతో సీఆర్డీఏతో ఎలాంటి ఒప్పందం లేదని సీఆర్డీఏ అధికారులే తేల్చారు. ఫిబ్రవరి 22న ముగ్గురు చీఫ్ ఇంజనీర్లు ప్రభుత్వం అలెక్సా కంపెనీపై చేసిన అరోపణలు నిరాధారమని తాము ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నారు.
చీఫ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టులో APSDRI ప్రస్తావించిన నివేదికలో సీఆర్డీఏ పనులు చేపట్టిన మెగా ఇంజనీరింగ్ సంస్థకు, అలెక్సా సంస్థకు సంబంధం లేదని, బీ.ఎస్.ఆర్ కంపెనీ రూ.240కోట్ల కాంట్రాక్ట్ పొందితే, రూ114 కోట్ల మేర పనులు జరిగాయని, అందులోకేవలం రూ.5 కోట్ల జీఎస్టీ చెల్లింపులు ఉన్నాయని, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ సంస్థతో మదింపు చేసుకున్నాకే చెల్లింపులు జరిపామని చెప్పారు.
ఇంత స్పష్టంగా ఎక్కడా అలెక్సా సంస్థ ప్రమేయం లేదని తేలినా, జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అతనికి సహకరిస్తున్న రాజేశ్వర్ రెడ్డి, సీతారామిరెడ్డి లాంటి వారు ఓటర్ల జాబితాలో తప్పులుచేసిన అధికారుల మాదిరే శిక్షింపబడతారు. జీఎస్టీ యాక్ట్ సెక్షన్ -6 ప్రకారం కేంద్రదర్యాప్తు సంస్థ DGGI విచారిస్తున్న కేసులో ఏపీ DRI జోక్యం చేసుకోకూడదు.
దేశంలో రూ.18 వేలకోట్లకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో DGGI విచారణ జరుపుతుంటే, కావాలని పనిగట్టుకొని మరీ తన జేబుసంస్థల్ని రంగంలోకి దింపాడు. ఫిబ్రవరి 22న APSDRI అధికారి సీతారామిరెడ్డి ఫిర్యాదు చేయడం.. 25న శరత్ ను అరెస్ట్ చేయడం జరిగింది. కొడుకును జైల్లో పెడితే తండ్రి బాధపడతాడనే సైకో లక్షణం… అదే జగన్ రెడ్డి నైజం. స్పైడర్ సినిమాలో విలన్ పాత్రధారి భైరవను మించిన సైకో లక్షణాలు జగన్ లో ఉన్నాయి.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని తప్పుడు కేసులతో హింసించడం.. తల్లిదం డ్రుల్ని చూడటానికి వచ్చే ఎన్.ఆర్.ఐలను అరెస్ట్ చేయించడం.. అమరావతి మహిళలపై పాల్పడిన దుర్మార్గాలు ఇవన్నీ జగన్ సైకోలక్షణాలే. డిసెంబర్ 2019లో శరత్ అలెక్సా సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితుడ య్యాడు. కేవలం మూడు నెలలే ఆ స్థానంలో ఉన్నాడు.
వాస్తవానికి అలెక్సా సంస్థ ఎండీ జోగేశ్వరరావు జీఎస్టీ చెల్లింపుల వ్యవహారాలు సహా తమ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలకు తానే బాధ్యుడినని DGGIకి చెప్పాడు. కానీ ఆయన వాదనను ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
నారాయణ, పుల్లారావు మాదిరే మరో 20 మంది టీడీపీ ప్రధాన నాయకుల్ని తప్పుడు కేసులతో వేధించే ఆలోచనలో జగన్ రెడ్డి ఉన్నాడు
దీనికంటే ముందు నెల్లూరులో మాజీమంత్రి నారాయణ విద్యాసంస్థలు.. కార్యాలయాలపై కూడా జగన్ రెడ్డి దాడులు చేయించాడు. వాటిలో పనిచేసే సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. నారాయణ టీడీపీలో ఉన్నాడని, ఈ విధంగా జగన్ రెడ్డి ఆయనపై.. ఆయన కుటుంబసభ్యులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు.
నెల్లూరులో టీడీపీనేతలే లక్ష్యంగా జగన్ చేయిస్తున్న దాడులు… చేతిలోని వ్యవస్థలతో పెట్టిస్తున్న తప్పుడు కేసులతో నెల్లూరుజిల్లాలో వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా పోతాయి. నారాయణ… పుల్లారావుల మాదిరే ఇంకా 20మంది టీడీపీ ప్రధాననాయకుల్ని తప్పుడు కేసులతో వేధించాలనే ఆలోచనలో జగన్ రెడ్డి ఉన్నాడు.
జగన్ పెత్తనం ఇంకా 10 రోజులే… ఎన్నికల తర్వాత జగన్ లండన్ కు పారిపోతాడు. ఇప్పటికే తన ఆస్తులు అక్కడికి తరలించేశాడని.. అక్కడున్న ప్రధాన కంపెనీలో రూ.25వేలకోట్ల షేర్లు కొన్నాడని సమాచారం
ఎన్నికల నోటిఫికేషన్ రాగానే జగన్ రెడ్డి బాధితులు.. పీడితులంతా తాడేపల్లి ప్యాలెస్ కు క్యూ కట్టడం ఖాయం. జగన్ పెత్తనం ఇంకా 10 రోజులే. నోటిఫికేషన్ వచ్చాక ఒక్క పోలీస్ కూడా జగన్ ఇంటి వద్ద కాపలా కాయడు. విశాఖలో గతంలో జరిగిన సదస్సులో రూ.13లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నట్టు జగన్ రెడ్డి డబ్బాలు కొట్టుకున్నాడు. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.
ఈ రోజు మరలా విశాఖపట్నంలో పారిశ్రామికరంగ ప్రగతిపై సమీక్ష పేరుతో హడావుడి చేస్తున్నా డు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు తాడేపల్లి నుంచి జగన్ రెడ్డి తన మకాం విశాఖ రుషికొండపై నిర్మించిన భవనానికి మారుస్తాడు. ఎన్నికల తర్వాత అక్కడనుంచి లండన్ కు పారిపోవడానికి ఇప్ప టికే ఏర్పాట్లు చేసుకున్నాడు. లండన్లో ఐల్యాండ్ లు కొని, లక్షలకోట్ల తనదోపిడీ సొమ్ముని అక్కడికి చేర్చేశాడు.
అక్కడున్న ఒక ప్రధాన కంపెనీలో జగన్ రెడ్డికి 25వేలకోట్ల విలువైన షేర్లు ఉన్నాయని మాకు సమాచారం. ఇప్పటికైనా జగన్ రెడ్డిని నమ్ముకొని ఎన్నికలబరిలో దిగే వైసీపీనేతలు.. తప్పుడు కేసులు, కక్షసాధింపుల్లో భాగస్వా ములు అవుతున్న అధికారులు ఆలోచించుకోవాలి. నిన్న..నేడు ఉన్నట్టే రేపు..ఎల్లుండి ఉంటుందని గుర్తుంచు కోవాలి. జగన్ 151 సీట్ల అధికారమదంతో తప్పుల మీద తప్పులుచేశాడు.
జగన్ కు సహకరించి, తప్పుచేసిన అధికారులు చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు. న్యాయస్థానాల్లో శరత్ కు న్యాయం జరుగుతుంది. అమరావతి రైతుల్ని… 5కోట్ల ప్రజల్ని జగన్ బారి నుంచి కాపాడింది ఆ న్యాయస్థానాలే. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని 160 అడుగుల గోతిలో పాతిపెడతారు” అని దేవినేని ఉమా తెలిపారు.