Suryaa.co.in

Andhra Pradesh

జగన్.. ఇక బాబాయ్ ను చంపిన వారిని కాపాడే ప్రయత్నాలు మానుకో

• ఇంటగెలిచి..రచ్చగెలవాలనే నానుడికి భిన్నంగా ముఖ్యమంత్రి ఇంటాబయటా అభాసుపాలయ్యాడు
• వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న జగన్ రెడ్డి.. తర్వాత హైకోర్టులో వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు?
• సీబీఐ అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులతో అవినాశ్ రెడ్డికి ఎందుకు రక్షణ కల్పించాడు?
• సీబీఐ అధికారులపై పోలీసులతో తప్పుడు కేసులు ఎందుకు పెట్టించాడు?
• వివేకా హత్యలో అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ తేల్చినా జగన్ తన తమ్ముడిని కాపాడుకోవడానికి ఢిల్లీలో తిరిగింది నిజం కాదా?
• బాబాయ్ ను చంపిన వారిని జగనే కాపాడుతున్నాడని ప్రజలే అంటున్నారు
• జగన్ దేనికి సిద్ధమో తెలియదుగానీ.. ఆయన్ని, ఆయన పార్టీని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి సిద్ధమయ్యారు : రామ్మోహన్ రావు
– నాగుల్ మీరా (టీడీపీ అధికార ప్రతినిధి), అంగర రామ్మోహన్ రావు (మాజీ ఎమ్మెల్సీ)

బాబాయ్ హత్యకేసుని చేధించి అసలు నిందితుల్ని శిక్షించలేని అసమర్ధుడిగా జగన్ ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడని, ఇంటగెలిచి రచ్చ గెలవాలనే నానుడి కి విరుద్ధంగా ముఖ్యమంత్రి ఇంటా..బయటా అభాసుపాలయ్యాడని, తన తండ్రిని చంపిన వారిని శిక్షించడం కోసం న్యాయపోరాటం చేస్తున్న డాక్టర్ సునీత, ఆమె కుటుంబంపై తన సోషల్ మీడియా బ్యాచ్ తో నీతిమాలిన ప్రచారం చేయించడం జగన్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని టీడీపీ అధికారప్రతినిధి నాగుల్ మీరా తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

“ జగన్ సొంత బాబాయ్ అయిన వై.ఎస్.వివేకానందరెడ్డి దారుణంగా చంపబడి నప్పుడు ఆ వార్త తెలిసిన వెంటనే మృతుడి ఇంటికి చేరుకుంది ఎంపీ విజయ సాయిరెడ్డి.. మరో ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డే. ఘటనా స్థలానికి వారు చేరుకున్నాకే మృతదేహానికి కట్లు కట్టించి రక్తపు మరకలు శుభ్రం చేయించి, హత్యను ఆత్మహత్యగా చిత్రీకిరించే ప్రయత్నం చేశారు. గొడ్డలిపోట్లను కప్పిపుచ్చి గుండెపోటుతో చనిపోయాడని నమ్మించే యత్నంచేశారు.

ఆనాడు వారలా ఎందుకు చేశారో..ఎవరి ఆదేశాలతో చేశారో ప్రజలకు సమాధానం చెప్పా లి. వివేకా మరణవార్త తెలుసుకొని హైదరాబాద్ నుంచి నింపాదిగా కడపకు చేరు కున్న జగన్ రెడ్డి అప్పుడు మీడియా ముందుకొచ్చి తన బాబాయ్ ను నాడు అధికారంలో ఉన్న చంద్రబాబే చంపించాడని పచ్చి అబద్ధాలాడాడు. మీడియా వారి ఎదుట మొసలి కన్నీరు కార్చి నటించాడు. వివేకా హత్యోదంతంపై ఆనాడు సీబీఐ విచారణ డిమాండ్ చేసిన జగన్ రెడ్డి..తీరా ముఖ్యమంత్రి అయ్యాక కేసు విచారణకు అడ్డుతగిలి, నిందితులకు అండగా నిలిచాడు.

ఎదురుదాడి చేయడం ఆపి, సునీత.. దస్తగిరి లాంటి వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు జగన్ రెడ్డి
వివేకా హత్యకేసు గురించి మాట్లాడే సునీత.. ప్రతిపక్షనేతలపై… కేసులో ప్రమేయముందంటున్న దస్తగిరి లాంటి వాళ్లపై ఎదురుదాడి చేయడం కాదు జగన్ రెడ్డి.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. వివేకాను చంపడం కోసం సుపారీగా రూ.40కోట్లు ఎవరిచ్చారు, ఆ సొమ్ము ఎక్కడినుంచి వచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలి. వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న జగన్ రెడ్డి.. తర్వాత కోర్టులో వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు?

సీబీఐవాళ్లు అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులతో అవినాశ్ రెడ్డికి రక్షణ కల్పించింది నువ్వు కాదా జగన్? సీబీఐ అధికారులపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించింది నిజం కాదా? వివేకా హత్యలో అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ తేల్చినా జగన్ తన తమ్ముడిని కాపాడుకోవడానికి ఢిల్లీలో తిరిగింది నిజంకాదా? బాబాయ్ ను చంపిన వారిని జగన్ రెడ్డే కాపాడుతున్నాడని సామాన్య ప్రజలే అంటున్నారు. జగన్ రెడ్డికి ఏమాత్రం మంచి..మానవత్వం ఉంటే బాబాయ్ ని చంపిన దోషుల్ని కాపాడే ప్రయత్నాలు ఇకనైనా విరమించుకోవాలి.

ఫ్యాక్షన్ భావజాలమున్న వ్యక్తికి మరలా ఓటేస్తే ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలు అవుతాయి
రాష్ట్రాన్ని నేరాలు..ఘోరాలకు కేంద్రంగా మార్చిన జగన్ రెడ్డికి మరలా ఓటేస్తే ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలవుతాయి. రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదు. ఫ్యాక్షన్ భావజాలమున్న వ్యక్తికి మరలా ఓటేస్తే ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినట్టే. జగన్ తన పార్టీ అభ్యర్థుల్ని మార్చే పనిలో ఉంటే… జనం ఆయన్ని మార్చే పనిలో ఉన్నారు. రాష్ట్రఅభివృద్ధిని పూర్తిగా విస్మరించిన జగన్ రెడ్డి.. రాష్ట్ర ఖజానా ను, ప్రకృతి వనరుల్ని కొల్లగొట్లి తన కుటుంబానికి.. బినామీలకు దోచిపెట్టాడు.” అని నాగుల్ మీరా స్పష్టం చేశారు.

జగన్ రెడ్డి దేనికి సిద్ధమో తెలియదు గానీ ప్రజలు మాత్రం ఆయన్ని… ఆయన పార్టీని రాష్ట్రంనుంచి తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు : అంగర రామ్మోహన్ రావు
“ జగన్ రెడ్డి దేనికి సిద్ధమో…సమాధానంచెప్పాలి. బంధువుల్ని హత్యచేయడాని కా … రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడానికా… తల్లిని, చెల్లిని అవసరానికి వాడుకొని దూరంపెట్టడానికా… కల్తీ మద్యం అమ్మకాలతో వేలకోట్లు దోచుకోవ డానికా… ఇసుకదోపిడీకి పాల్పడటానికా… రాష్ట్రాన్ని గంజాయిప్రదేశ్ గా మార్చ డానికా.. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని తొలిస్థానంలోకి తీసుకురావడానికా … బీసీలను అణగదొక్కడానికా… ఎస్సీలపై అమానుషాలకు పాల్పడటానికా…. హత్యలు, దోపిడీలకు పాల్పడే వైసీపీనేతల్ని కాపాడటానికా… జనసేన – టీడీపీ ని విడగొట్టడానికా…దేనికి సిద్ధం జగన్ రెడ్డి?

ప్రజలు మాత్రం నిన్ను, నీ పార్టీని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకో జగన్ రెడ్డి. నువ్వు కాదు సిద్ధం.. ప్రజలు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు.” అని రామ్మోహన్ రావు తెలిపారు.

LEAVE A RESPONSE