– 42.62లక్షలమంది తల్లులఖాతాల్లో డబ్బులేస్తూ, 83.15లక్షలవిద్యార్థులకు న్యాయంచేశాననడం తప్పుడు లెక్కకాదా జగన్ రెడ్డి?
• అమ్మఒడి, మద్యపాననిషేధం పేరుతో జగన్ చేసిన మోసాన్ని ప్రతిఆడబిడ్డ నిలదీయాలి.
• ఓట్లకోసం జగన్, అతనిపార్టీవాళ్లు వచ్చినప్పుడు కాలర్ పట్టుకొని అడగాలి.
– టీడీపీ అధికారప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు
తల్లులకు మేలుచేస్తున్నాను అంటూ జగన్ ఇటీవలనొక్కిన అమ్మఒడి బటన్ తాలూకా సొమ్ముఇంకా తల్లులకు చేరలేదని, అమ్మఒడిపథకాన్ని ఆంక్షలసుడిగుండంలోకి నెట్టిన జగన్, నాన్నబుడ్డితో ఇచ్చేదానికంటే పదిరెట్లుఎక్కువ పేదలనుంచి కొట్టేస్తున్నాడని టీడీపీ అధికారప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ రాష్ట్రంలో అమలవుతున్నపథకాలు, ప్రభుత్వం పెడుతున్నఖర్చుసహా అప్పులలెక్క ల్లో బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి ఎలాగైతే ప్రజల్ని మభ్యపెడుతున్నాడో, అదేవిధంగా అమ్మఒడి పథకంలో కూడా తప్పుడులెక్కలతో తల్లుల్ని వంచిస్తున్నాడు.
జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి జూలై8 2017న గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరిలో అమ్మఒడి గురించి ప్రస్తావిం చాడు. ఇంటర్ వరకు చదివే ప్రతివిద్యార్థికి నెలకు రూ.1000చొప్పున ఇస్తానని, సంవత్సరానికి ఇద్దరుపిల్లలకు రూ.24వేలు ఇస్తానన్న జగన్ రెడ్డిఇప్పుడు ఇస్తున్నదిఎంత? ఒక్కపిల్లాడికి సంవత్సరానికి రూ.15వేలు ఇస్తున్నాడు.
అధికారంలోకివచ్చాక ప్రతిఏటా ఆ 15వేలల్లో కోతపెట్టి, చివరకు 13వేలు చేశా డు. పాఠశాలల్లోని టాయ్ లెట్లను శుభ్రపరచడానికే అమ్మఒడిలో కోతపెట్టామని నమ్మ బలికాడు. పిల్లలకు తొలుత ఇచ్చిన15వేలరూపాయల్లో ఒక్కొక్కరినుంచి 1000రూపాయలు వెనక్కుతీసుకుంటే, ఆ మొత్తం రూ.550కోట్లు అయ్యింది. తరువా త15వేలను 13వేలుచేసి అక్షరాలా 2,200కోట్లు ఈ పొట్టిరెడ్డి అప్పనంగా దొబ్బేశాడు.
నాలుగేళ్లలో అమ్మఒడిపథకం కింద జగన్ తల్లులకు ఎగ్గొట్టిన సొమ్ము 9,300కోట్లు
ఏటా జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడిని పాఠశాలలు తెరిచేసమయానికి ఇస్తూ మధ్య లో ఒకసంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టాడు. ఆ ఎగ్గొట్టిన మొత్తం రూ.6,600కోట్లు. మొత్తంగా జగన్ అమ్మఒడిపథకం ముసుగులో ఈనాలుగేళ్లలో తల్లులకు, పిల్లలకు ఎగ్గొట్టిన సొమ్ము రూ.9,300కోట్లు. పిల్లల్ని,తల్లుల్నిమోసగించిన జగన్ విద్యార్థులకు మేనమామ… కంసమామ? జగన్ పైకిఒకటిచెబుతూ, ఈ విధంగా ప్రతిపథకంలో ప్రజ ల్ని వంచిస్తూ, వారికిదక్కాల్సిన సొమ్ముని దిగమింగుతున్నాడు.
మీపిల్లల చదువులకు జగన్ అన్న నెలానెలా డబ్బులిస్తాడని ఎన్నికలకు ముందు ప్రచారంచేసిన శ్రీమతిభారతిరెడ్డి, తనభర్త ఈనాలుగేళ్లలో తల్లులు, పిల్లలకు చేసిన అన్యాయంపై ఎందుకునోరెత్తదు? అందరుతల్లులు తనలాంటివారేనని ఆమె ఎందుకు అర్థంచేసుకోవడంలేదు? నేరస్తుడుచేసిన నేరాన్ని దాచడం, నేరస్తుడిని వెనకేసుకురా వడం ఎంతపెద్దనేరమో భారతిరెడ్డికి తెలియదా?
పత్రికాప్రకటనల్లో, బహిరంగసభల్లో 42.62లక్షలమంది తల్లులకు అమ్మఒడి ఇచ్చానని చెబుతూ, 83.15లక్షల విద్యార్థులకు న్యాయం చేశాననడం తప్పుడు లెక్కకాదా?
సాక్షిపత్రికల్లో ఇచ్చిన తప్పుడుప్రకటనలు, ముఖ్యమంత్రిబహిరంగసభల్లో చెప్పిన ప్రకారం ఈసంవత్సరం అమ్మఒడికింద 42.62లక్షలతల్లులకు ఇచ్చినమొత్తం రూ.6,392.92కోట్లు. దీనిలో భాగంగా 83.15లక్షలవిద్యార్థులకు లబ్ధి అని ప్రకటనల్లో చెప్పారు. ఇదేమి లెక్కో ముఖ్యమంత్రి, అతని భజనబృందమే సమాధానంచెప్పాలి. తల్లులఖాతాలో అమ్మఒడి డబ్బువేస్తున్నానని చెప్పిన జగన్ లెక్కప్రకారమే 42.62ల క్షలమంది ఉంటే, 83.15లక్షలమంది విద్యార్థులకు లబ్ధిఎలా కలిగింది? జగన్ అమ్మఒడి ఇస్తున్నది విద్యార్థులకుకాదు కదా? ఇలాతప్పుడులెక్కలతో ప్రజల్ని మరీ ముఖ్యంగా తల్లుల్ని ఎంతకాలంవంచిస్తారు? ఇష్టమొచ్చినట్టు అబద్ధాలుచెబుతూ, వాటిని నమ్మించడానికి సొంతపత్రికకు వందలకోట్లతో ప్రకటనలు గుప్పిస్తారా?
మద్యపాన నిషేధమంటే వీధికో మద్యం దుకాణం పెట్టి లక్షన్నరకోట్ల కల్తీమద్యం విక్రయించడమా జగన్ రెడ్డి?
జగన్ చేస్తున్నమోసాన్ని ప్రతితల్లి, విద్యార్థి గమనించాలి. ఈ తప్పుడుమనిషి మీ ముందుకువచ్చినప్పుడు చొక్కాపట్టుకొని నిలదీయండి. కసాయిరెడ్డి జగన్ ను ప్రజలు ఇకనమ్మే పరిస్థితిలేదు. ఎవరు ఎన్నిపెళ్లిళ్లు చేసుకుంటే ఈజగన్ రెడ్డికి ఎందుకు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల్ని, ప్రజల్ని గౌరవించకుండా వ్యక్తిగతదూషణలు చేసే అధి కారం జగన్ కు ఎవరిచ్చారు? ప్రజల్ని మోసగిస్తూసిగ్గులేకుండా ఇంకా 98.5శాతం హామీలు అమలుచేశానని ఎలాచెప్పుకుంటావు జగన్ రెడ్డి? మద్యపాననిషేధం అంటే వీధికో మద్యందుకాణం పెట్టి, ధరలుపెంచి కల్తీమద్యం అమ్మి, ప్రజలప్రాణాలు తీయడమా? మద్యపాననిషేధం అనిచెప్పి లక్షన్నరకోట్ల కల్తీమద్యాన్ని విక్రయిస్తున్న జగన్ రెడ్డి కి మహిళలంతా తగినవిధంగా బుద్దిచెప్పాలి.
సంక్షేమపథకాలకు కోతపెట్టడానికే జగన్ విద్యుత్ బిల్లులు పెంచాడు
చంద్రబాబునాయుడు గతంలో ప్రజలకోసం అమలుచేసిన అనేకసంక్షేమపథకాల్ని రద్దుచేసిన జగన్, జనాన్ని ఉద్ధరించాననిచెప్పడం పచ్చిఅబద్ధంకాదా? ప్రజలకు జగన్ అందిస్తున్న సంక్షేమపథకాల్లోని లెక్కలన్నీ అవాస్తవాలే. 2019-20 సంవత్సరంలో అమ్మఒడి ఆర్థికసాయాన్ని 42.80లక్షలమంది తల్లులకిస్తే, 2022-23నాటికి లక్షా 34 వేలమందికి అన్యాయంచేశాడు. ఏలూరుజిల్లాలోనే 11842మంది తల్లులు అమ్మఒడి పథకానికి అనర్హులుఅయ్యారు. జగన్ పెంచిన కరెంట్ బిల్లులవల్లే వారికి అమ్మఒడి పథకంసొమ్ము అందలేదు.
సంక్షేమ పథకాలకు కోతపెట్టడానికి జగన్ ప్రజలపై ప్రయో గించిన అస్త్రమే విద్యుత్ ఛార్జీలపెంపు. ఆ వంకతో అమ్మఒడికి, పింఛన్లకు, ఇంటిపట్టాలకు అన్నింటికీ కోతపెట్టాడు. తనపనికిమాలిన పాలనతో రాజ్యాంగంద్వారా పౌరులకు ముఖ్యంగా దళిత, బలహీనవర్గాలకు జగన్ తీరనిద్రోహంచేస్తున్నాడు. దళిత, బీసీ విద్యార్థులు చదువకోవడం జగన్ కు సుతరాము ఇష్టంలేదు. జగన్ తప్పిదాలకు త్వర లోనే తగినమూల్యం చెల్లించుకుంటాడు.” అని శ్యామ్ చంద్రశేషు హెచ్చరించారు.