– “క్లాప్” పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం.. కేంద్రం నిధులు ఇందులో లేవుః మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ
– 100 రోజులపాటు “క్లాప్” కార్యక్రమం
– రేపు విజయవాడలో “క్లాప్” కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
– దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా “క్లీన్ ఆంధ్రప్రదేశ్” కార్యక్రమంః మంత్రి బొత్స సత్యనారాయణ
1- దేశంలోని ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచేలా ఏపీలో “క్లాప్” కార్యక్రమం నిర్వహిస్తున్నాం. “జగనన్న స్వచ్ఛ సంకల్పం-క్లీన్ ఆంధ్రప్రదేశ్” కార్యక్రమాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అమలు చేస్తున్నాం. ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులు లేవు. నూటికి నూటి శాతం రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఒక యజ్ఞంలా ఆంధ్రప్రదేశ్ లో “జగనన్న స్వచ్ఛ సంకల్పం-క్లీన్ ఆంధ్రప్రదేశ్” కార్యక్రమం అమలు చేయబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా రేపు(అక్టోబరు 2న) విజయవాడలోని బెంజి సర్కిల్ లో ఉదయం 10. 30 గంటలకు చెత్త సేకరణ వాహనాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు.
2- ఇక పట్టణ ప్రాంతాలకు సంబంధించి కార్పొరేషన్లు, మున్సిపాల్టీలలోనూ 3097 హైడ్రాలిక్ గార్బేజ్ ఆటోలు, అలాగే వాటితో పాటు నగర పంచాయతీలు, థర్డ్‌గ్రేడ్ మున్సిపాల్టీల్లో ఇంకో 1771 ఈ-ఆటోలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో దాదాపు 38వేలమంది శానిటరీ వర్కర్లు.. ఇప్పుడు ఉన్నవారితో కలిపి నిరంతరం భాగస్వాములు కానున్నారు.
3- పట్టణ ప్రాంతాల్లో దాదాపు 40 లక్షల గృహాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా మూడు ప్లాస్టిక్ డస్ట్‌బిన్‌లను(రెడ్, బ్లూ, గ్రీన్ చెత్త బుట్టలు) ఇస్తున్నాం. అందులో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడానికి ఉదయం ఆరు గంటల నుంచే ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాపితంగా ప్రారంభం అవుతుంది. వీటన్నింటిని 231 గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ లు ఏర్పాటు చేసి, తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నాం.
4- క్లీన్ ఏపీలో భాగంగా రేపటి నుంచి పెద్ద ఎత్తున ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మీడియా కూడా సహకరించాలి. ప్రజలలో ఒక అవగాహన తీసుకు వచ్చి, ఒక సానుకూల దృక్పధంతో ముందుకు వెళుతున్నాం. రాష్ట్రం అంతా పరిశుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలంతా పూర్తి భాగస్వామ్యులై విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి ఏ సంకల్పంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో అది నూటికి నూరుశాతం సక్సెస్ కావాలనుకుంటున్నాం.
5- వాటర్ ప్లస్ సిటీలుగా దేశంలో తొమ్మిది ఎంపికైతే….వాటిలో మూడు నగరాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. మురుగు నీటి శుద్ధి, పునర్వినియోగంలో తిరుపతి, విజయవాడ, విశాఖ నగరాలు ఎంపిక అయ్యాయని గర్వంగా చెబుతున్నాం. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
6- మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ముఖ్యమంత్రి ప్రజలకు సేవ చేయడమే కానీ, ఫోటోలకు, పబ్లిసిటీలకు ప్రాధాన్యత ఇవ్వరు. సోము వీర్రాజు మాటలు నేను చూశాను. సోము వీర్రాజు , ఆ పార్టీ ఎవరితోనైతే పొత్తులు పెట్టుకున్నారో, తన సహచరుల మాదిరిగానే ఆలోచన కంటే ఆవేశం ఎక్కు ఉన్నట్టే.. ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఇది కేంద్రం సాయంతో జరుగుతున్న కార్యక్రమం కాదు. నూటికి నూరు శాతం ప్రజల నుంచి వసూలు చేస్తున్న యూజర్ ఛార్జీల ద్వారా వచ్చిన డబ్బులతోనే వాహనాలు కొనుగోలు చేశాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం ఒక్క పైసా లేదు. రూరల్ ఏరియాల్లో ఇంకా యూజర్ ఛార్జీలను నిర్ణయించలేదు. ఇంకా సరిపోకపోతే రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్‌గా విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెయ్యి కోట్ల వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కేంద్రం ఇస్తుంది, కానీ ఈ కార్యక్రమానికి కాదు.