• జగన్ హయాంలో రాష్ట్రం వదిలిపోయిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు అంతేలేదు.
• పన్నుల పేరుతో వ్యాపారుల్ని దోచుకుంటున్న జగన్, కేంద్రప్రభుత్వ పథకాన్ని తాను అమలుచేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు.
• చిరువ్యాపారులకు కేంద్రం రూ.15.17కోట్లు ఇస్తే, దానిలో జగన్ ప్రభుత్వ వాటా కేవలం రూ.5కోట్లు మాత్రమే.
• ఆ 5 కోట్లలో తనభార్య నిర్వహించే సాక్షి ప్రకటనలకే సగం దోచిపెట్టాడు.
• నాలుగేళ్ల పాలనలో ఎందరు వ్యాపారులకు ఎలాంటి ఆర్థికసాయం చేశాడో జగన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయగలడా?
– టీడీపీ వాణిజ్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్
జగనన్న తోడు పథకం కేంద్రప్రభుత్వం బ్యాంకులతో కలిసి అమలుచేసే సంయుక్త పథకమని, చిన్నాచితకా వ్యాపారులకు బ్యాంకులు రుణాలిస్తే, దానికి కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు హామీగా ఉంటాయని, ఇవేవీ వ్యాపారులకు తెలియనట్టు, తానే ఏపీలోని చిరువ్యాపారుల్ని ఉద్ధరిస్తున్నట్టు జగన్ రెడ్డి కలరింగ్ ఇస్తున్నాడని టీడీపీ వాణిజ్యవిభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“జగనన్న తోడు-జగన్ వ్యాపారులకు చేస్తున్నాడు కీడు.చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం పేరుతో జగన్ రెడ్డి తనమీడియాను బాగుచేస్తున్నాడు. వ్యాపారులకు ఈ నాలుగేళ్లలో జగన్ చేసిన మేలు కంటే కీడే ఎక్కువ. జగన్ చెబుతున్న జగనన్న తోడు పథకం కేంద్రప్రభుత్వం బ్యాంక్ గ్యారెంటీతో అమలుచేస్తున్న పథకం.
దేశంలోని చిరువ్యాపారులకు బ్యాంకులు డబ్బులిస్తే, ప్రభుత్వాలు ష్యూరిటీగా ఉంటాయి. తన హయాంలో ఎందరు చిరువ్యాపారులకు జగన్ రెడ్డి హామీగా ఉండి రుణాలు ఇచ్చాడో చెప్పగలడా? చిరువ్యాపారులకు తానుచేసిన మేలుపై పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయగలడా? టీడీపీ ప్రభుత్వం రెండు కార్పొరేషన్ల ద్వారా 22 లక్షల వ్యాపారులకు, సబ్సిడీ రుణాలు ఇచ్చింది.వ్యాపారులు రూ.2లక్షల రుణం తీసుకుంటే, రూ.లక్ష చంద్రబాబుకట్టారు. రూ.3లక్షల రుణం తీసుకుంటే, రూ.లక్ష టీడీపీప్రభుత్వం చెల్లించింది. వ్యాపారుల పిల్లల ఉన్నతచదువులకోసం చంద్రబాబు ఆర్థికసాయం చేశారు. జగన్ వచ్చాక వ్యాపారులు అన్నీసర్దుకొని తమకొడుకులవద్ద బతుకుతున్నారు. జగనన్న తోడు కింద సంవత్సరంలో రూ.10వేలకోట్లను బ్యాంకులకు రీయింబర్స్ చేయాలి. వ్యాపారులకు ఇచ్చిన వడ్డీ రీయింబర్స్ మెంట్ 15.17కోట్లలో 5కోట్లు మాత్రమే జగన్ రెడ్డి ప్రభుత్వానివి.వ్యాపారులకు పిసరంత సాయం చేసిన జగన్, తన సాక్షి పత్రికకు మాత్రం కొండంత దోచిపెడుతున్నాడు. జగన్ వచ్చాక ఉన్న పరిశ్రమలెన్ని, రాష్ట్రం వదిలిపోయినవెన్ని?
జగన్ రెడ్డి అరాచకంతో కొన్నివందల వ్యాపారులు ఆత్మహత్యలుచేసుకున్నారు.కరోనా సమయంలో నష్టపోయిన వ్యాపారులకు రీస్టార్ట్ ప్యాకేజీ ఇస్తున్నానంటూ ఉత్తుత్తి బటన్ నొక్కాడు. రాష్ట్రంలోని వ్యాపారులు, వైసీపీకి చెందిన వ్యాపారులు కూడా ఏడుస్తున్నారు. జగన్ రెడ్డి అనే బడా వ్యాపారి మాత్రమే బాగున్నాడు. వ్యాపారులు ట్యాక్స్ కట్టడం లేటయితే అధికారులతో దాడులు చేయిస్తారా? ప్లెక్సీల యాజమాన్యాలు, వస్త్రదుకాణాలు, ఐరన్ షాపులు, గ్రానైట్ సంస్థలపై చేసిన దాడులతో ఎందరు రోడ్డునపడ్డారో జగన్ కు తెలియదా? జగన్ రెడ్డి ప్రభుత్వం నడపడం లేదు. ఇష్టమొచ్చినట్టు వ్యాపారులతో, పారిశ్రామికవేత్తలతో ఆడుకుంటున్నాడు. ఇదేంఖర్మ-వ్యాపారులకు అని వారిముందుకు వెళ్తే, వారి బాధన వర్ణనాతీతం.తనభార్య నడిపే జగతి పబ్లికేషన్స్ కోసమే జగన్ ప్రజలపేరుతో ప్రకటనలిస్తున్నాడు. ప్రకటనల్లో తప్ప, జగన్ పాలనలో ఏవర్గవారికి సంతోషం లేదు. వ్యాపారులపై జగన్ కు వివక్ష ఉండబట్టే, తాను బయటకు వచ్చినప్పుడల్లా, దుకాణాలు మూయిస్తున్నాడు. ఇసుక ఆపి, కార్మికులతో పాటు, వ్యాపారుల్ని రోడ్డుకీడ్చాడు.లిక్కర్, రెస్టారెంట్లపై మోయలేనంత పన్నులభారం మోపాడు.జగన్ కు ఇష్టమైన వారే రాష్ట్రంలో ఉండాలి. ఆయన చెప్పినట్టే వినాలి. వ్యాపార, వాణిజ్య వర్గాల్ని ఒకతాటిపైకి తెచ్చి, జగన్ రెడ్డిని గద్దెదింపుతాం.టీడీపీప్రభుత్వం వస్తేనే వ్యాపారులకు స్వర్ణయుగం వస్తుంది.”