Suryaa.co.in

Andhra Pradesh

14 రోజుల పాటు యజ్ఞంలా ‘జగనన్నే మా భవిష్యత్’ క్యాంపెయిన్

-రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది పార్టీ గృహ సారథులు, కన్వీనర్లతో కార్యక్రమం
-మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది.. ఏ రాజకీయ పార్టీ చేయని అతి పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం

ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా వైయస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత విస్తృతంగా, క్షేత్రస్థాయిలో ప్రచారం చేయనుంది. సీఎం జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఏప్రిల్ 7న ‘జగనన్నే మా భవిష్యత్’ ప్రారంభించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరులు సమావేశంలో సజ్జల రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం కలిసి ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార పోస్టర్‌ ను ఆవిష్కరించనున్నారు.

“ఈ ప్రచారం చారిత్రాత్మకమైనదిగా మరియు అసాధారణమైనది. వైయస్సార్సీపీ కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ది ఫలాలను ప్రజలకు తెలియజేస్తాం. 2 వారాల వ్యవధిలో (ఏప్రిల్ 7-ఏప్రిల్ 20వ తేది) వరకు రాష్ట్రంలో మొత్తం 1.6 కోట్ల కుటుంబాలకు 7 లక్షల మంది పార్టీ కార్యకర్తలతో విసృతంగా ప్రచారం చేయనున్నాం,” అని సజ్జల ప్రకటించారు. గత 3-4 నెలలుగా ప్రతి కార్యకర్తతో నేరుగా సంప్రదింపులు జరుపి దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. అత్యంత వేగంగా, సమర్థవంతంగా ప్రజలకు ఎలా చేరువ అవ్వాలనే అంశాల పై మండలాల వారీగా శిక్షణ అందించామని అన్నారు. ఈ ప్రచార ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి చేరుకుని గత టీడీపీ ప్రభుత్వం హయాంలోని ప్రజలకు అందించిన సంక్షేమం, పాలన విధి విధానాల తేడాను ప్రస్తుత వైయస్సార్సీపీ ప్రభుత్వంతో పోల్చిచూపి ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతోనే ముందుకు సాగనుందని అయన వివరించారు.

14 రోజుల్లో రాష్ట్రంలోని 1.6 కోట్ల కుటుంబాలను చేరుకోవటమే ముఖ్య లక్ష్యం
” ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే ప్రచార నినాదం ప్రజల నుంచి వచ్చినదే. 12,000 గ్రామ, వార్డు సచివాలయాల్లో అట్టడుగు స్థాయి ప్రజలతో అనేక చర్చలు నిర్వహించగా వీటిలో తెలిసిన విషయమేమిటంటే ప్రజలు సీఎం జగన్ ను తమ నాయకుడిగా నమ్మటమే ఈ విధంగా ప్రచారం నినాదం వచ్చింది,” సజ్జల అన్నారు. ఏప్రిల్ 7న జరగబోయే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమ ప్రారంభోత్సవంలో వైయస్సార్సీపీ ఏకకాలంలో ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు 175 నియోజకవర్గాల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించనున్నారని సజ్జల తెలిపారు. గడప గడపకు వెళ్లి సీఎం జగన్ ఎలా పనిచేశారో నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుని, ప్రజా సంక్షేమం అనే సందేశాన్ని చివరి మైలు వరకు ప్రతి కార్యకర్త తీసుకెళ్లనున్నారని సజ్జల అన్నారు.

LEAVE A RESPONSE