జగన్మోహన్ రెడ్డి అసమర్థత చేనేత కార్మికులకు శాపం

– చేనేత కార్మికులకు రూ.110 కోట్ల‌ మేర రుణమాఫీ చేశాం
-చేనేత కార్మికులకు 90శాతం సబ్సిడీపై పనిముట్లు అందజేశాం
-ముడిసరుకు సబ్సిడీ, సబ్సిడీ రుణాలు అందజేసి ఆదుకుంటాం
-చేనేత కార్మికులను కలిసిన యువనేత లోకేష్

ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో చేనేత కార్మికులను యువనేత లోకేష్ కలిసి వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువనేతకు చేనేత కార్మికులు త‌మ‌ సమస్యలను విన్నవించారు.
• ధర్మవరం నియోజకవర్గంలో 75శాతానికి పైగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాం.
• గత నాలుగేళ్లుగా చేనేతలు వాడే పట్టు, ముడిసరుకుల ధరలు నూరుశాతం పైగా పెరిగాయి.
• గోరుచుట్టుపై రోకటిపోటులా రెండేళ్ల కోవిడ్ కాలంలో చేనేతరంగం అతలాకుతలమైంది.
• పెరిగిన ధరల కారణంగా చేనేత వస్త్రాలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.• వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధర్మవరం నియోజకవర్గంలో 56మంది ఆకలిచావులు, బలవన్మరణాలకు పాల్పడ్డారు.
• ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికులకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి పరిహారం చెల్లించలేదు.
• ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించేలా చొరవచూపాలి.
• ప్రతి చేనేత కార్మికుడు ఎటువంటి పూచీకత్తు లేకుండా వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలి.
• చేనేత వృత్తిదారులను రుణవిముక్తులను చేయడానికి రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయాలి.
• చేనేత కార్మికులు తయారుచేసిన పట్టుచీరలను గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి.

యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ….
• రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థత చేనేత కార్మికులకు శాపంగా మారింది.
• ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు పరిహారం ఇవ్వకపోగా, కనీసం వారి కుటుంబాలను పరామర్శించేందుకు సిఎంకు మనసు రాలేదు.
• గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు రూ.110 కోట్ల‌ మేర రుణమాఫీ చేశాం.
• చేనేత కార్మికులకు ముడిసరుకుపై సబ్సిడీ, సబ్సిడీ రుణాలు అందజేసి అండగా నిలిచాం.
• ఆదరణ పథకంలో చేనేత కార్మికులకు 90శాతం సబ్సిడీపై పనిముట్లు అందజేశాం.
• చేనేతలకు ముడిసరుకు సబ్సిడీ, సబ్సిడీ రుణాలు అందజేసి ఆదుకుంటాం.
• ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు చంద్రన్న బీమాతో తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది.

Leave a Reply