– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు
కొత్తరెడ్డి పాలెం: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం ప్రచారం నిర్వహించారు. బుధవారం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు.
విద్యావంతులు బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ధాన్యం కొన్న 24 గంటల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటమి ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. ధాన్యం సేకరణ, చెల్లింపుల్లో గత వైసీపీ రైతులను ఇబ్బంది పెట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు పెండింగ్ పెట్టిన రూ.1,674 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినందుకే రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు.
జగన్ హయాంలో మిర్చి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. రేపు చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రిని కలుస్తారని, మిర్చి రైతుల సమస్యలు గురించి చంద్రబాబు వివరిస్తారని వివరించారు. 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజేంద్రప్రసాద్ కు పొన్నూరు నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడు ధూళిపాల నరేంద్ర నేతృత్వంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.