-తధాస్తు పలికిన తిరుమలేశుడు
-హమ్మయ్య… ఎట్టకేలకు మంత్రి సుభాష్ వీరాభిమాని మొక్కు తీరింది
-సుమారు 700 కిలోమీటర్లు దూరం ..17 రోజులు పాదయాత్ర
-మంత్రి సుభాష్ పదికాలాలు పాటు చల్లగా ఉండాలి..ఇదే స్వామిని కోరుకున్న వీరాభిమాని మణికంఠ
రామచంద్రపురం : ఇదో ఇంట్రెస్టింగ్ స్టోరీ..మారుమూల సుందరపల్లి గ్రామం నుంచి తిరుమల తిరుపతి మధ్య జరిగిన సంఘటన. సుమారు 700 కిలోమీటర్ల దూరం..కాలి నడకన 17 రోజులు యాత్ర.. ఎట్టకేలకు ఆ వీరాభిమాని తిరుమల శ్రీవారు, ఆపదమొక్కులవారి సన్నిధిలో తన అభిమాన నాయకుడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో తిరుమలేశుని సన్నిధిలో మొక్కు చెల్లించుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఏంటా విషయం అనుకుంటున్నారా..పూర్తి వివరాల్లోకి వెళితే.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం నియోజవర్గం కె.గంగవరం మండలం సుందరపల్లి గ్రామంకు చెందిన రంకిరెడ్డి మణికంఠ గత సార్వత్రిక ఎన్నికల్లో రామచంద్రపురం నియోజవర్గం నుంచి తన అభిమాన రాజకీయ నాయకుడు ( ప్రస్తుత మన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ) అత్యధిక మెజార్టీతో గెలవాలని తిరుమలేశుని మొక్కుకున్నాడు. న్యాయమైన కోరిక కోరుకున్న తన భక్తుని మొర ఆలకించిన తిరుమల వెంకటేశ్వర స్వామి తన భక్తుని కోరిక మన్నించి, కరుణించి తధాస్తు అన్నారు.
ఇంకేముంది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ద్వారా సుమారు 28 వేల ఓట్ల మెజారిటీతో వాసంశెట్టి సుభాష్ గెలుపొంది రికార్డు సృష్టించారు. తన మొక్కు కోర్కెను తీర్చిన స్వామివారి ముక్కు చెల్లించేందుకు ఫిబ్రవరి 3న మంత్రి సుభాష్ సమక్షంలో ఆంజనేయస్వామికి పూజలు చేసి సుందరపల్లి నుంచి తిరుమలకు నడక యాత్ర ప్రారంభించారు.
ఈ యాత్ర 17 రోజులపాటు సాగి ఈరోజు తిరుమల చేరుకుంది. అనుకోని రీతిగా మంత్రి సుభాష్ తిరుపతి వెళ్లడం, తన వీరాభిమాని రంకిరెడ్డి మణికంఠ, వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందుకున్నారు. తన నడక యాత్ర ప్రారంభించిన మంత్రి సుభాష్ సమక్షంలోనే మొక్కు చెల్లించుకోవడంతో మణికంఠ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మణికంఠ పాదయాత్ర పై రాష్ట్రంలో విస్తృతమైన చర్చకు దారి తీసింది. ఇలాంటి వీరాభి మానులు కూడా ఉంటారా.. అంటూ అటు రామచంద్రపురం నియోజవర్గంలోనూ,ఇటు రాష్ట్రంలోనూ చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ముక్కు చెల్లించుకున్న రంకిరెడ్డి మణికంఠ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాజకీయాల్లోకి రాకముందు నుంచే మంత్రి సుభాష్ మానవత్వంతో ఎంతోమంది నిరుపేదలకు, నిరుద్యోగులకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఆర్థికంగా ఆదుకున్నారని, అలాంటి మంచి మనసున్న మనిషి అధికారంలో ఉంటే లక్షలాది మందికి సహాయపడతారని దేవునికి మొక్కుకున్నట్టు తెలిపారు.
నా కోరిక ప్రకారం మంత్రి సుభాష్ ఊహించిన దానికంటే కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలతో సంబంధం లేకుండా ఆపన్నులకు సహాయం చేస్తూ ముందుకు వెళుతున్నారని ఆనంద వ్యక్తం చేశారు. మంత్రి సుభాష్ అభిమానిగా ఉండడం తన అదృష్టమని మణికంఠ పేర్కొన్నారు. తనపై ఇంతటి అభిమానం చూపించిన మణికంఠను మంత్రి సుభాష్ ప్రత్యేకంగా అభినందించారు.