రాష్ట్ర విద్యుత్ ఖాతా తీరుతో ప్రజల జేబులకు చిల్లు
జగన్మోహన్ రెడ్డి అస్మదీయులకు అన్ని రకాల విద్యుత్ ప్రాజెక్టులను దోచిపెట్టి వారి జేబులు నింపుతున్నారు
పట్టించుకోని ప్రభుత్వం
విద్యుత్ పంపిణీ అస్థవ్యస్ధం
బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్
రాష్ట్రప్రభుత్వం అవకాశం ఉండి సరైన ప్రణాళిక లేక అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేయడంలో విఫలమైంది. గడచిన నాలుగు సంవత్సరాలలో 2 నుండి ౩రేట్లు విద్యుత్ ఛార్జీ ల పోటు ప్రజల పైన పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల నుండి విద్యుత్ వినియోగదారుల పైనా వేస్తున్నఅదనపు భారం దాదాపు 700 కోట్లకు పైమాటే. జగన్మోహన్ రెడ్డి అస్మదీయులకు అన్ని రకాల విద్యుత్ ప్రాజెక్టులను దోచిపెట్టి వారి జేబులు నింపుతున్నారు.
వానకాలంలో కూడా కరెంటు కోతల కష్టాలు సృష్టించబడ్డాయి. రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల్లో 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు.2019 లో జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చేసమయానికి ఉన్న విద్యుత్ ఛార్జీలు నేడు రెండు నుండి మూడు రేట్లు పెరిగాయి.
ఈరోజు ఒక్కోయూనిట్నిమార్కెట్లో 26 రూపాయిల చొప్పున కొనుగోలుచేస్తు ప్రజలజేబులకు చిల్లువేస్తున్నారు, ఇందులో వేలాదికోట్ల రూపాయిల అవినీతి ఉంది.
నేటి జగనన్న విద్యుత్ వాతలకు కారణాలు :
2022 – 23 సంవత్సరానికి రాష్ట్ర విద్యుత్ వినియోగం : దాదాపు 65,830 మిలియన్ యూనిట్లు – సగటున రోజుకు వినియోగం 180 యూనిట్లు.
2023 – 24 సంవత్సరానికి ప్రస్తుతం సగటున ప్రతిరోజు రాష్ట్ర విద్యుత్ వినియోగం : 258 యూనిట్లువాస్తవ ఉత్పత్తి మరియు ఇన్స్టాల్ కెపాసిటీ వినియోగించిన ఉత్పత్తి శాతం (PLF – పవర్లోడింగ్ ఫ్యాక్టర్ )
ఏపీజెన్కో: ఆగస్ట్ 1 నుండిఆగస్ట్ 31 వరకు
ఇన్స్టాల్ డ్ కెపాసిటీ జనరేషన్ పీఎల్ఎఫ్ మెగావాట్లు
థర్మల్విద్యుత్ 3,410.00 1,710.85 67.43%
జలవిద్యుత్ 1,773.60 211.54 10.00%
సౌరవిద్యుత్ 405.40 65.30 21.65%
మొత్తంఉత్పత్తి : 5,589.00 1,987.69
1 ఏప్రిల్ నుంచి 31 ఆగస్టువరకు
జెనరేషన్ పీయెల్ఎఫ్ మెగావాట్లు
థర్మల్ విద్యుత్ 9,395.50 75.03%
జల విద్యుత్ 843.71 8.00%
సౌరవిద్యుత్ 323.26 21.71%
మొత్తం ఉత్పత్తి : 10,562.27
థర్మల్ విద్యుత్:
ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఇన్స్టాల్ కెపాసిటీ లో వినియోగించిన ఉత్పత్తి శాతం (PLF – పవర్లోడింగ్ఫ్యాక్టర్ ) 75.03% అయితే, ఆగస్టు నెలలో 67.43% కు తగ్గింది.
ముఖ్యాంశాలు :
వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా విద్యుత్వినియోగంపెరిగి డిమాండ్పెరుగుతుంది. ఈ పరిస్థితులలో థర్మల్ పవర్ ఉత్పత్తిపెంచాల్సిన సమయంలో అవసరమైన మేరకు బొగ్గు నిల్వలు ఉంచకపోవడం వల్ల ఆగస్టు మాసం ఉత్పత్తి 67.43% కుతగ్గింది.
ప్రస్తుతం థర్మల్విద్యుత్కేంద్రాలవద్ద 2 నుండి౩రోజులుమాత్రమే బొగ్గునిల్వలు ఉండడం బాధాకరం. వాస్తవానికి సాధారణంగా థర్మల్విద్యుత్కేంద్రంవద్ద 17 రోజుల ( బొగ్గుగనులకు 1500 కిలోమీటర్లలోపుథర్మల్విద్యుత్కేంద్రంఉంటే ) మేరకు బొగ్గునిల్వలు ఉంచాలి, అదే 27 రోజుల ( బొగ్గుగనులకు 1500 కిలోమీటర్లపైన థర్మల్విద్యుత్కేంద్రంఉంటే ) మేరకుబొగ్గునిల్వలుఉంచాలి.
జలవిద్యుత్ :
ముఖ్యాంశాలు :
జల విద్యుత్ ఉత్పత్తి దాదాపు అత్యల్పం.అవకాశాలు ఉన్న, ప్రాజెక్టుల కేటాయింపులో NHPC కిఅందించాల్సిన ప్రాజెక్టులను పక్కకు మల్లించి, స్వంత వారికి కట్టబెట్టే ప్రయత్నంలో సకాలంలో 6,600 మెగావాట్ల 7 ప్రాజెక్టులు ఉత్పత్తికి రాకుండా ఆగిపోయాయి.
సౌరవిద్యుత్ :
ముఖ్యాంశాలు :
ఒక్కొక్క యూనిట్విద్యుత్ కొనుగోలు 4 రూపాయిలుగా గతంలో ప్రైవేట్కంపెనిల అగ్రిమెంట్లు ( పీపీఏ) లను జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానేరద్దుచేసి, మరల ఆవే కంపెనిలకు మూడుసంవత్సరాల అనంతరం ఇవ్వడం అనేకఅవినీతి, అక్రమాలకు తెరలేపినట్లుఎవరికైనా ఇట్టే అర్ధంఅవుతున్నది.
దీనివల్లఎప్పుడో ఉత్పత్తిలోకి రావాల్సిన ప్రైవేట్సంస్థల విద్యుత్ఉత్పత్తి పీపీఏల రద్దుతో ఆలస్యం కావటం వల్ల కూడా నేడు పెరిగిన విద్యుత్వినియోగ డిమాండ్కు దెబ్బ తగిలి విద్యుత్కోరత నేడు రాష్ట్రం ఏదుర్కోవడం జరుగుతున్నది.
దీనివల్ల అందుబాటులోకి రావాల్సిన సోలార్రాకపోవటంవల్ల దాదాపు 10 వేలపైగా మెగావాట్ల విద్యుత్యూనిట్ 4 రూపాయిలు చప్పున అందుబాటులోకి రాకుండా పోయింది
ప్రభావం:
రాష్ట్రప్రభుత్వ ప్రణాళిక లోపంవల్ల, అసమర్థనిర్వహణవల్ల నేడు యూనిట్ 26 రూపాయిలచొప్పున కొనుగోలు చేసి ప్రజలపైన అదనపుభారంమోపారు.
ఈరోజు ఒక్కోయూనిట్నిమార్కెట్లో 26 రూపాయిల చొప్పున కొనుగోలు చేస్తు ప్రజల జేబులకు చిల్లు వేస్తున్నారు,ఇందులో వేలాది కోట్ల రూపాయల అవినీతి ఉంది.
రాష్ట్రంలో వినియోగదారులకు వస్తున్న విద్యుత్ బిల్లు తప్పుల తడకగా ఉన్నాయి. ఒకే తరహా కనెక్షన్ ఉన్నప్పటికీ మరియు ఒకమాసంలో వినియోగించిన యూనిట్లు ఒకటే అయినా కూడా వారికి వస్తున్న బిల్లులు మధ్య భారీ అంతరాల ఉండడం ఆందోళన కలిగిస్తున్నది.
రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల్లో 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు.2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే సమయానికి ఉన్న విద్యుత్ చార్జీలు నేడు రెండునుండి మూడురేట్లు పెరిగాయి.
పెరిగిన విద్యుత్ ఛార్జీలు – సిఫార్సు చేసిన తేదీ సంవత్సరం :
25 మార్చి 2023 2023 – 24 (కొత్త ఛార్జీల కోసం సాధారణ టారిఫ్)
30 మార్చి 2022 (వాల్యూమ్ 2) 2022 – 23 (20 15 నుండి 2019 వరకు ట్రూఅప్ఛార్జీలురూ. సాధారణ టారిఫ్కు అదనంగా 1,057 రికవరీ చేయబడింది)
30 మార్చి 2022 (వాల్యూమ్ 1) 2022 – 23 – (కొత్త ఛార్జీల కోసం సాధారణ టారిఫ్)
25 మార్చి 2021 2021 – 22 – (కొత్త ఛార్జీల కోసం సాధారణ టారిఫ్)
10 ఫిబ్రవరి 2020 2020 – 21 – (కొత్త ఛార్జీల కోసం సాధారణ టారిఫ్)
22 ఫిబ్రవరి 2019 2019 – 20 – (కొత్త ఛార్జీల కోసం సాధారణ టారిఫ్)
స్మార్ట్మీటర్ల వ్యయభారాన్ని24నెలలవాయిదాలలో ఈఎంఐని వినియోగదారుల పైన వేసి వసూళ్లు చేయడం దుర్మార్గం.
దీనికితోడు ట్రూఅప్ ఛార్జి ల విద్యుత్ సంస్థ లు ఆశించిన రెవిన్యూ వసూళ్లు 2015 నుండి 2019 మధ్య 529 కోట్లరూపాయిలుమాత్రమే (రాష్ట్రప్రభుత్వ లెక్కల ప్రకారం), వినియోగదారుల వద్దనుండి 1,500 కోట్లుపైగా వసూళ్లు చేయడం శోచనీయం. FPPCA (ఇంధనం మరియు విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు) క్రింద 2021 – 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాని 1 ఏప్రిల్ 2023 నుండివసూళ్లు చేస్తున్నారు, ఇది మూలిగే నక్క మీద తాటికాయలాంటిది. ఇవికాక విద్యుత్తు డ్యూటీ, సర్ ఛార్జీలు, కస్టమర్ఛార్జీలు, ఇతరఛార్జీలు అంటూ వినియోగదారులకు గోరిచుట్టుమీదరోకలిపోటులాగా రాష్ట్రప్రభుత్వంచేసింది.
సిఫార్సుచేయబడినటారిఫ్ప్రకారంగృహవినియోగంపైన :
యూనిట్ల వినియోగం : 50 150250 350 450
ఒకనెలకి
విద్యుత్ ఛార్జీలు:
2023 – 24 నెలకు 150/-900/- 2,187/- 3,062/- 4,387/-
(ఈఛార్జీలకు అదనంగా ట్రూఅప్ఛార్జీలు మరియు అదనపు డిపాజిట్లు)
2019 52/- 440/- 1,114/- 1,953/- 2,406/-
ఒక నెలకు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే సమయానికి
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నవిధానాలవల్ల విద్యుత్ సంస్థల అప్పులు మరియు నష్టాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ లోపం వల్ల రూ. 84,183 కోట్లరూపాయిలకుపైగా అప్పులుమరియురూ. 29,928 కోట్ల రూపాయల పైగా నష్టాలు రాష్ట్ర విద్యుత్ సంస్థ మూటగట్టుకుంది. రాష్ట్రంలో విద్యుత్డిమాండ్మరియూ సప్లై అంచనావేయడంలో దారుణంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం వానకాలంలో కూడా కరెంటు కోతల కష్టాలు సృష్టించబడ్డాయి. జగన్. అస్మదీయుల జేబులు నిండుతున్నాయి. ప్రభుత్వ విద్యుత్ సంస్థ అప్పులు మరియు నష్టాలు మిగులుతున్నాయి.