ప్రకృతి విపత్తులను అరికట్టడంలో జగన్ వైఫల్యం

– ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇంచార్జి మంత్రి , స్థానిక ప్రజా ప్రతినిధులు పర్యటించలేదు
– బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు

అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్ పరిధిలో పండ్ల తోటలను బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ , రైతు విభాగం నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పంట నష్టాన్ని అంచనా , క్షేత్ర స్థాయి పరిశీలన సరిగ్గా జరగడం లేదని , పంటల పరిశీలనలో కూడా పార్టీలను చూడడం బాధాకరమన్నారు.

కరువు ఒక వైపు వుండగా వున్న నీటితో పండించిన పంట తీరా చేతికి వచ్చేటప్పటికి , పకృతి దెబ్బ కొట్టిందని , మంచి మార్కెట్ వున్న సమయంలో పెట్టుబడి కూడా రాకుండా నష్టపోయారని , జగన్ ఎంతసేపటికి ఎన్నికల మేనేజ్మెంట్ తప్ప డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయలేడని ఈ నాలుగు సంవత్సరాలలో విపత్తు సందర్భంలో బయటపడిందని అన్నారు , విపత్తుల నిర్వహణ క్రింద కేంద్ర ఎంత నిధులిచ్చినా వృధా అవుతున్నది. రైతులకు చేరడంలేదన్నారు

Leave a Reply