– నారా లోకేష్
జనం కేస్ట్ సర్టిఫికెట్ల మీద, జనం ఆస్తి పత్రాల మీద, రైతుల పొలం గట్ల రాళ్ల మీద బొమ్మలు వేసుకున్న జగన్ రెడ్డి..మూడేళ్ల పాలనలో మూడుసార్లు పెంచిన ఆర్టీసీ చార్జీల టికెట్లపై మాత్రం తన బొమ్మ వేసుకోలేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతున్నప్పుడు మొలకలచెరువు వద్ద ఆర్టీసీ బస్సులో నుంచి ఓ సోదరుడు పలకరించాడు. జగన్ ఆర్టీసీ చార్జీల బాదుడుతో పెరిగిన టికెట్టు ధరని నాకు చూపించాడు. పేదలు బస్సు ప్రయాణం చేయాలన్నా భయపడేంతగా ఛార్జీలు పెంచి..నా నడక నేలమీద, నా ప్రయాణం పేదలతో అంటూ నీకు అస్సలు సూటు కాని సినిమా డైలాగులు బాగానే కొడతావు. జగన్ ప్రయాణం నిందితులతో, జగన్ యుద్ధం పేదజనం మీదేనని పెంచిన పన్నులు, ఛార్జీలే చెబుతున్నాయి.