Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాస్వామ్య స్ఫూర్తికి జగ్జీవన్‌రామ్‌ నిదర్శనం

-జగన్‌, వైసీపీ నేతల కళ్లు తెరిపించాలంటే జగ్జీవన్‌రామ్‌ జీవిత చరిత్ర చదివించాలి
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
-జయంతి సందర్భంగా ఘన నివాళి

పల్నాడు జిల్లా వినుకొండ:అధికార మదం తలకెక్కి దళిత, బహుజన వర్గాల బాధలు కనీసం పట్టని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, వైసీపీ నాయకుల కళ్లు తెరుచుకోవాలంటే బాబూ జగ్జీవన్‌రామ్‌ జీవిత్రచరిత్రను ఒక్కసారైనా చది వించాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్రంతో పాటే సామాజిక సమానత్వ అవసరాన్ని చాటిచెప్పిన మహనీయుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తి నేటికీ అనుసరణీయమన్నారు. శుక్రవారం బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ఆయన నివాళులర్పించారు. వినుకొండ `నరసరావుపేట రోడ్డులోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు.

అనంతరం మాట్లాడుతూ బీహార్‌లోని మారుమాల ప్రాంతం నుంచి దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన బాబూ జగ్జీవన్‌రామ్‌ జీవిత ప్రస్థా నంలో ప్రతిఘట్టం సంఘర్షణ, సమాజం పట్ల అంతులేని బాధ్యతతో సాగిందని కొనియాడారు. దళితులు, బహుజనులు ఉన్నత విద్యావంతులుగా అత్మగౌరవంతో జీవించాలని నిరంతరం కోరుకున్నారన్నారు. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందుతోన్న 100కు పైగా సంక్షేమ పథకాలు రద్దు చేసిన నిరంకుశ పాలకుడు జగన్‌ అని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ దేశానికి, దళిత, బహుజనవర్గాలకు ఎనలేని సేవలందించిన బాబూ జగ్జీవన్‌రామ్‌ అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. జీవీ ఆంజనేయులు చెప్పిన ట్లు ఆయన జీవితచరిత్రను ఒక్కసారి చదివించినా జగన్‌రెడ్డి, వైసీపీ పెత్తందార్లలో కొద్దిగైనా మార్పు వస్తుందేమో చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు మానుకొండ శివప్రసాదరావు, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నాగశ్రీను రాయల్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE