Suryaa.co.in

Andhra Pradesh

పల్నాడు గడ్డపై టీడీపీ జెండా ఎగురవేద్దాం

ప్రచారంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు
లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు

నరసరావుపేట:  కలిసికట్టుగా పనిచేసి నరసరావుపేట గడ్డపై టీడీపీ జెండు ఎగురవేద్దామని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు పిలుపునిచ్చారు. నరసరావుపేట మండల పరిధిలోని దొండపాడు, పెదరెడ్డిపాలెం, ఇస్సపాలెం గ్రామాల్లో శుక్రవారం వారు పర్యటిం చారు. నాయకులు, కార్యకర్తలు వద్దకు నేరుగా వెళ్లి కలిశారు. నరసరావుపేట గడ్డ మీద తెలుగు దేశం పార్టీ జెండా ఎగరవేసే సమయం ఆసన్నమైందని, ప్రతిఒక్కరూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల వారిని, ఎదుటి పార్టీలను కలుపుకుని వెళ్లినప్పుడే మంచి విజయం సాధించగలగమని సూచించారు.

రోజుకు రెండు గంటలు పనికట్టుకుని గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించాలని సూచించారు. అలా ప్రచారం చేసినప్పుడే మనం అధికారంలోకి వచ్చాక చేసే సంక్షేమం, అభివృద్ధి జనాల్లోకి బలంగా వెళుతుందని, అప్పుడే మెజారిటీ విజయం సాధించగలమని ఉత్తేజాన్ని నింపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇస్తామని, గ్రామాల్లో నెరవేర్చాల్సిన అభివృద్ధిని నేరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE