– వారిఅభివృద్ధి, సంక్షేమం విషయంలో అంతా షో చేస్తున్నాడు
– చంద్రబాబుహయాంలో ముస్లింలకు అమలైన సంక్షేమపథకాలన్నింటినీ, జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే తొలగించాడు
– ఆఖరికి టీడీపీప్రభుత్వం నిర్మించిన షాదీఖానాలు, ఈద్గాలు,ఖబరిస్తాన్ ల వద్ద ఉన్న శిలాఫలకాలు తొలగించి, సిగ్గులేకుండా వైసీపీనేతలు వారిపేర్లు వేసుకుంటున్నారు
– మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలతో చెలగాటమాడుతూ, పెద్దతప్పుచేస్తోందని, ఏవో రెండు, మూడు ఛైర్మన్ పదవులు ఇచ్చేసి, ముస్లిం మైనారిటీలను ఉద్ధరించినట్లుగా ప్రభు త్వపెద్దలు వ్యవహరిస్తున్నారని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలిపారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో విజయవాడలో పాడుపడిపోయిన ముసాఫిర్ షాదీఖానాను పునర్నిర్మించడకోసం రూ.15కోట్లు నిధులు కేటాయించారు. నిధులు కేటాయించడమే కాకుండా, షాదీఖానా ఇరుకుగా ఉందని భావించి, విశాలంగా, సుందరంగా నిర్మించండి అంటూ 450గజాలుగా ఉన్న స్థలాన్ని 1500గజాలకుపెంచారు. 99శాతం వరకు టీడీపీప్రభుత్వంలోనే షాదీఖానా నిర్మాణపనులన్నీ పూర్తయ్యాయి. ఇంతలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.
వైసీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులుగానీ, ప్రభు త్వపెద్దలు గానీ ఏనాడూ షాదీఖానా నిర్మాణంగురించి ఆలోచించలేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంనుంచి గెలిచి, నిన్నటివరకు మంత్రిగా పనిచేసిన పనికిమాలినవ్యక్తి, ఎందుకూ పనికిరాని ప్రబుద్ధుడు, షాదీఖానా నిర్మాణానికి టీడీపీప్రభుత్వంలో కేవలం శంఖుస్థాపన మాత్రమేజరిగిందని, మిగిలిననిర్మాణమంతా వైసీపీప్రభుత్వంలోనే జరిగిందంటూ సిగ్గులేకుం డా పచ్చి అబద్ధాలుచెబుతున్నాడు. అతనుచెప్పేది నిజమే అయితే ఈప్రభుత్వంలోఎప్పుడు షాదీఖానా నిర్మాణానికి నిధులిచ్చారో, ఎంతమొత్తం ఇచ్చారో, దానికి సంబంధిం చిన జీవోలు, ఇతర ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
నియోజకవర్గానికి, తనను నమ్మిఓట్లేసిన ప్రజలకు ఏనాడు వీసమెత్తుసాయం చేయని వెల్లంపల్లి షాదీఖానానిర్మాణం ఈ ప్రభుత్వఘనతగా చెప్పడం అతనిలోని నీతిమాలిన తనానికి పరాకాష్ట. షాదీఖానాకునిజంగా ఈప్రభుత్వంలో నిధులువిడుదలచేసుంటే, ఎప్పుడు,ఎంతమొత్తంఇచ్చారో వెల్లంపల్లి చెప్పాలి. అవసరమైతే విజయవాడ పశ్చిమనియోజకవర్గంలో వెల్లంపల్లి తనహాయాంలోచేసిన అభివృద్ధిపై ముస్లిం మైనారిటీలకు చేసినసాయంపై బహిరంగచర్చకుసిద్ధం. వెల్లంపల్లి నాతో చర్చకు వస్తాడా? ముస్లిం, మైనారిటీ విద్యార్థుల కోసం చంద్రబాబు హయాంలో రూ.7కోట్లతో జూనియర్ కాలేజీని కూడా నిర్మించాము.
నేడు ఆ కళాశాలలో కనీసంతాగడానికి మంచినీళ్లుకూడాలేవు. అదీ ఈప్రభుత్వపనితీరు షాదీఖానా, కాలేజ్ లో గతంలో టీడీపీహాయాంలో ఏర్పాటుచేసిన శంఖుస్థాపనఫలకాలను వెల్లంపల్లి తిరిగి ఏర్పాటుచేయాల ని డిమాండ్ చేస్తున్నాను. మాప్రభుత్వంలో జరిగిన పనులను సిగ్గులేకుండా తన హాయాంలో జరిగాయని చెప్పుకుంటున్న వెల్లంపల్లి, తనమాటలు పచ్చిఅబద్ధాలని నిరూపించే సాక్ష్యాలను కూడా లేకుండా చేయడం దుర్మార్గం.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం అంతా షోగా మారింది.టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుగారు రంజాన్ తోఫా కింద ప్రతిపేద ముస్లింకుటుంబానికి మోయలేనంత సరుకులసంచి ఇచ్చారు. ఆ సంచిలో ముస్లింలు సంతోషంగా రంజాన్ పండుగజరుపుకోవడానికి అవసరమైన అన్నిసరుకులుఉండేలా చేశారు.
చంద్రబాబు హయాంలో రూ.140కోట్లతో హజ్ హౌస్ నిర్మాణానికి శంఖుస్థాపనచేస్తే, జగన్ రెడ్డి వచ్చాక దానినిర్మాణం ఎక్కడిదక్కడే నిలిచిపోయింది. టీడీపీప్రభుత్వంలో ముస్లింలకు అమలైన అనేకసంక్షేమపథకాలను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొత్తం ఆపేశాడు. రంజానో తోఫా, హజ్ యాత్రకు వెళ్లేవారికిఆర్థికసాయం.. షాదీఖానాలు, ఖబరిస్తాన్ లనిర్మాణం, మసీదులమరమ్మతులకు నిధులు, షాదీముబారక్ కింద పెళ్లిచేసుకునే ముస్లింయువతులకు ఆర్థికసాయం.. దుకాన్-మకాన్ కింద ముస్లిం యువతకుస్వయంఉపాధికల్పించడం.. మాజమ్.. ఇమామ్ లకు నెలనెలాజీతభత్యాలు ఇవ్వడం వంటి అనేకపథకాలు అమలుచేసిన ఘనత చంద్రబాబుగారికే దక్కింది.ఇన్నేళ్ల రాష్ట్రచరిత్రలో ఏముఖ్యమంత్రి ముస్లింమైనారిటీలకు చేయనంతసాయం చంద్రబాబు చేశారని ఘంటాపథంగాచెప్పగలను.
గత ప్రభుత్వాల హాయాంలో చాలాప్రాంతాల్లో వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైతే, వాటిని తిరిగిస్వాధీనంచేయించే ప్రక్రియకు చంద్రబాబుగారు శ్రీకారం చుట్టారు. వాటిని ఎక్కడకక్కడ ఆక్రమణలచెరనుంచి విడిపించి,వాటిచుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేయడం..ప్రహారీలు నిర్మించడం లాంటివిచేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఏనాడు జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలగురించిఆలోచించలేదు. జగన్ రెడ్డి జమానాలో అనేకముస్లిం కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అబ్దుల్ సత్తార్.. అబ్దుల్ సలాం కుటుంబాలు బలవన్మరణాలకు పాల్పడటానికి ఈ ప్రభుత్వం అహంకారపూరిత ధోరణికారణం కాదా అనిప్రశ్నిస్తున్నా?
పేద ముస్లింల కడుపునింపలేని వైసీపీనేతలు, జగన్మోహన్ రెడ్డి రాజకీయస్వలాభంకోసం, స్వార్థంతో రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఇఫ్తార్ విందులు ఏర్పాటుచేస్తున్నారు. కడుపునింపే కార్యక్రమాన్ని కూడా తమరాజకీయాలకు వేదికలుగా మార్చుకోవడం ఈ ముఖ్యమంత్రికే చెల్లింది. ప్రభుత్వ, వైసీపీనేతల ఇప్తార్ విందుల్లో ఎక్కడా పేదముస్లింలు కనిపించడంలేదు. అందరూ వైసీపీనేతలే.. అన్ని రాజకీయప్రసంగాలే కనిపిస్తున్నాయి. చంద్రబాబుగారు ముస్లింలకు అందించిన సంక్షేమపథకాలన్నింటినీ తీసేసిన జగన్మోహన్ రెడ్డి ఊరికే షోచేస్తూ, మైనారిటీలను ఉద్ధరిస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నాడు.
ముస్లింనేతలు ఇద్దరో, ముగ్గురికో పనికిరాని ఛైర్మన్ పదవులు, కార్పొరేషన్ పదవులు ఇస్తే, ముస్లింసమాజం మొత్తం బాగుపడినట్టేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. టీడీపీహాయాంలో చంద్రబాబుగారిపాలనలో ముస్లింలకు ఎంతమేలుజరిగింది..ఎంత మొత్తం నిధులుఖర్చుపెట్టి, వారిసంక్షేమానికి పాటుపడింది ఆధారాలతో సహానిరూపించడానికి తాను సిద్ధం.. అలానే ఈప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గానీ, తానుగానీ ముస్లిం మైనారిటీలకు ఏంచేశారో వెల్లంపల్లి చెప్పగలడా? వెల్లంపల్లిని మించిన పైరవీకారుడు ఈ రాష్ట్రలోనే లేడు. మంత్రిపదవిపోయినాకూడా తన పైరవీలు ఆగలేదు. వెల్లంపల్లి దేవాదాయమంత్రిగా ఉండి అవినీతికిపాల్పడ్డాడని కొత్తగా ఆశాఖ బాధ్యతలుచేపట్టినవ్యక్తే చెప్పారు.
వెల్లంపల్లి అవినీతి ఏ స్థాయిలో సాగిందంటే, ఆఖరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మట్టిని కూడా నాకేసేంతలా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంనుంచి మైనారిటీ ఓట్లతో గెలిచిన వెల్లంపల్లి, మంత్రిగా,ఎమ్మెల్యేగా ఉండికూడా ఏనాడు ముస్లిం మైనారిటీలకు పిసరంతసాయంకూడా చేయలేదు. టీడీపీహాయాంలో 99శాతం పూర్తయిన షాదీఖానా నిర్మాణపనులను విస్మరించిన వెల్లంపల్లి, చివరకు దాన్నికూడా తనఅవినీతికి వాడుకోవాలని చూస్తున్నాడు. ముస్లిం మైనారిటీలుఎంతో కష్టపడి వారికష్టార్జితంతో హజ్ యాత్రకు వెళుతుంటే, ఈ వైసీపీనేతలు జెండాలు ఊపి వారిని సాగనంపుతున్నారు.
హజ్ యాత్రకు వెళ్లేవారికోసం చంద్రబాబు ఏటాఆర్థికసాయం చేస్తే, ఈ ప్రభుత్వం ఊరికేజెండాలు ఊపిసరిపెడుతోంది. అదీ ఈముఖ్యమంత్రికి ముస్లింసమాజంపై ఉన్న ప్రేమ. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ముస్లిం మైనారిటీలు కేవలం ఓట్లువేసేయంత్రాలు మాత్ర్రమే. అది ఆయన మాటల్లో చేతల్లో నిత్యంకనిపిస్తూనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి హంగుఆర్భాటాలు లేకుండా, ఒక్కపోలీస్ కూడాలేకుండా జనంలోకి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక గడపదాటి బయటకురావడానికే ఎందుకంతలా భయపడుతున్నాడు?
పోలీసులు, ఇనుపకంచెలు, అడ్డుతెరలు లేకుండా ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ఈ మూడేళ్లలో బయటకువచ్చాడా? ప్రజలంటే ఆయనకుభయం.. ఎందుకంటే వారికిచెప్పిందొకటి..ముఖ్యమంత్రి అయ్యాక చేస్తున్నది ఒకటి. అందుకే ఆయనకు ముఖం చెల్లడంలేదు.