పవనమే ప్రభంజనమై..!

మొన్న విశాఖ..
నేడు విజయనగరం..
పవనమే ప్రభంజనమై..!

ప్రశ్నించే గొంతు…
నిలదీసే ధైర్యం..
మాటాడే నైజం..
మాటాడేది నిజం..!

ఇవి మాత్రమేనా..
అపూర్వమైన జనాదరణ..
ఒకనాడు చిరంజీవిని మించి..
ఆయన కంటే బిగ్గరగా
పలికే స్వరం..
ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన..
జనం కోసం ఏం చేయడానికైనా సంసిద్ధత..
ప్రతి అడుగులో నిబద్ధత..!
అధికారంలో ఉన్న వారు ఎంతగా బెదరించినా..
కేసులే పెట్టి వేధిస్తున్నా..
కొన్ని శక్తులు తనను అంతమొందించడానికి కుట్రలు పన్నుతున్నారని
వార్తలే వినిపిస్తున్నా..
అందుకు ఆధారాలే కనిపిస్తున్నా
వెన్ను చూపని తెగువ..
అధికారం అందకపోయినా..
తొలి ప్రయత్నంలో తానే ఓటమితో నగుబాటుకు గురైనా ప్రజల మధ్యనే ఉందాం..ఆ ప్రజా సమస్యలపైనే పోరాడుదామని అడుగు వెనక్కి వేయని మొండితనం..
తాను నమ్మిన ప్రజల
ప్రశ్నించే గొంతు తానై..
నిలదీసే ధైర్యం
తానే అయి నిలబడుతున్న
మొనగాడు పవన్ కళ్యాణ్..!

అంచనాలను మించి ప్రజాబలం…
సినిమా హీరో అయినా
అంతకంటే ప్రత్యేకమైన
ఆకర్షణ..
చిరంజీవి తమ్ముడుగా
మొదలైన నటప్రస్థానం..
అదే చిరంజీవి సోదరుడిగా
రాజకీయ ప్రవేశం..
అన్న ఉపశమించినా
తాను విశ్రమించని
పోరాట పటిమ..
వెన్ను చూపని ధైర్యం..!

అక్కడ అమ్మాయి
ఇక్కడ అబ్బాయి
అంటూ మొదలైన
ఓ ప్రయాణం..
ఇప్పుడు మోడీ
పక్కన ఆసనంలో కూర్చుని
అంతటి ప్రధానితో
అశేష జనం మధ్య సభలో..
ఏకాంత సమావేశంలో
సమాలోచనలు జరిపే స్థాయికి చేరింది..
ఎంతో మంది హీరోలున్నా..
ఇంకెంతో మంది రాజకీయ నాయకులున్నా..అందరినీ మించి..తన సొంత పార్టీ వారి కంటే మిన్నగా నరేంద్ర మోడీ పెద్ద పీట వేయడం పవన్ కళ్యాణ్
తన రాజకీయ ప్రస్థానంలో సాధించిన
అతి పెద్ద విజయం.!

తానే పదవి కావాలనుకుంటే అంతటి మోడీ ఇస్తున్న ప్రాధాన్యత ఆసరాగా తన పార్టీని కమలం పార్టీలో విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వం..ఆ స్థాయిలోనో అంతకు మించో ఏదో ఒక పదవి పవన్ ముంగిట చేరదా..అయితే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి అలా సరిపెట్టుకునే టైపు కాదు..
అది ఆయన నైజం కానే కాదు..తనకు పదవి..
అనే ఒక స్థాయిని దాటి
ఏదో సాధిద్దామనే తపన..
గెలుపోటములతో
సంబంధం లేని..పదవి కోసం ఆశపడని గుణం ఆయనను ఇంకా ఏదో చెయ్యమని ప్రేరేపిస్తూనే ఉంటుంది.
అది ఆగని ప్రేరణ..
అలసిపోని ప్రయాణం..!

ఇన్నాళ్లు సాగిన గమనంలో
ఇప్పుడు జనసేనాని
అడుగుతున్నారు..తనకు ఒక్క అవకాశం ఇవ్వమని..
అధికారంలోకి వచ్చి తాను కోట్లు గడిద్దామని కాదు.
తనను..తన కుటుంబాన్ని ఇంతగా ఆదరించిన ప్రజల కోసం ఏదో చేద్దామని..వారికి నిజాయితీతో కూడిన అవినీతిరహిత పాలన అందిద్దామని..
తను పుట్టిన..ఎదిగిన..
ఇంతటి ఆదరణ పొందిన గడ్డకు మేలు చేద్దామని..
ఒక కొత్త దారి చూపిద్దామని..
తను ముందు నిలిచి
కొత్త వెలుగులోకి
తీసుకువెళ్దామని..!

ఇప్పుడు జనం ఆలోచించే పరిస్థితి వచ్చినట్టే ఉంది..
రాష్ట్ర ప్రజలు ఆయనలో హీరోని గాక నిజమైన నాయకుణ్ణి చూస్తున్నారు.
కొన్నాళ్ళ ముందు వరకు నిలకడ లేని మనిషి అని ప్రచారం జరిగిన ఒక వ్యక్తి ప్రదర్శిస్తున్న
అసాధారణ నాయకత్వ లక్షణాన్ని గమనిస్తున్నారు.
అతనిలో తమ ఆశలను..ఆలోచనలను..
తమ కలల్ని దర్శిస్తున్నారు.
ఇది మార్పు..
ఒక రకమైన కూర్పు..
ముందుగానే సంకేతిస్తున్న
ఓ సంచలన తీర్పు..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286

Leave a Reply