సుబ్బరామిరెడ్డి కంపెనీలపై దివాళా కేసు

ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బరామిరెడ్డిపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్‌లో దివాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయనకు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బ్యాంకుల నుంచి రూ. 600 కోట్లకుపైగా రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలం కావడంతో రుణ సంస్థలు, కంపెనీ నిర్వహణకు సహకరించిన రుణ సంస్థలు (ఆపరేషనల్ రుణ దాతలు) ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. గాయత్రి ప్రాజెక్ట్స్ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 400 కోట్లకుపైగా రుణం తీసుకోగా, భారతీయ స్టేట్ బ్యాంకు నుంచి రూ. 240 కోట్లకుపైగా రుణాలు తీసుకుంది.

బ్యాంకుల నుంచి గాయత్రి కంపెనీ తీసుకున్న రుణానికి హామీదారుగా ఉన్న సుబ్బరామిరెడ్డిపై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించి రుణ చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆ పిటిషన్‌లో కోరింది. అలాగే, సుబ్బరామిరెడ్డితోపాటు ఆయన భార్య ఇందిర, బంధువులు, సన్నిహితులు అయిన జె.సుశీలరెడ్డి, టి.సరితారెడ్డి, టీవీ సందీప్‌రెడ్డి, జి.శివకుమార్‌రెడ్డి, జి. సులోచన తదితరులపై వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐ, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్‌సీఎల్‌టీ నిన్న విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

Leave a Reply