– పోలీసులు, వైకాపా నేతల కుట్ర
– ఒక్క రోజు లోనే విచారణ.. సాక్ష్యాల సేకరణ ఎలా సాధ్యం?
– జెత్వాని కేసులో సమగ్ర విచారణ జరిపితే పెద్ద తలకాయలు బయటకు వస్తారు?
– పోలీసు ఉన్నాతాధికారుల పాత్ర పైనా లోతైన విచారణ జరపాలి
– సినీ నటీ జెత్వాని పై పెట్టిన అక్రమ కేసు రద్దు చేయాలని హైకోర్టు లో న్యాయవాది నర్రా శ్రీనివాస్ పిటిషన్ దాఖలు
అమరావతి: ముంబై సినీనటి జెత్వానిని అక్రమ కేసులో ఇరికించిన వ్యవహారంలో అప్పటి పోలీసులు, వైకాపా నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారని హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాస్ అన్నారు. మార్చి 2వ తేదిన కేసు నమోదు చేసి… మార్చి 3న ముంబై వెళ్లి అరెస్టు చేశారని… ఒక్కరోజులోనే విచారణ, సాక్ష్యాల సేకరణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఫోర్జరీ కేసులో సంబంధం లేకున్నా హీరోయిన్ తల్లిదండ్రులను వృద్ధులని చూడకుండా అరెస్టు చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే పెద్ద తలకాయలు బయటకు వస్తాయన్నారు. పోలీసు ఉన్నతాధికారుల పాత్రపై లోతైన దర్యాప్తు జరపాలన్నారు.