Suryaa.co.in

Telangana

మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్

– ధర్మ ప్రసార రాష్ట్ర కో కన్వీనర్ సుభాష్ చందర్

జేఎన్టీయూ సుల్తాన్ పూర్ ఇంజనీరింగ్ కాలేజీలో మతతత్వపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ సుల్తాన్ పూర్ ఇంజనీరింగ్ కాలేజీలో తన ముస్లిం మతస్తులను పెట్టుకుని, తన చెప్పుచేతల్లో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పెట్టుకొని రాజకీయాలు చేస్తూ కళాశాలలో ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న హిందువులను మానసికంగా చాలా ఒత్తిడికి గురి చేయడంతో, కళాశాలకు రావడం కూడా భయపడుతున్నారు హిందూ యువకులు.

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని జేఎన్టీయూ సుల్తాన్ పూర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న నాగరాజు అనే యువకుడిపై, మీద లేనిపోనివి కల్పించి ముస్లింల సంబంధించిన రహ్మన్ మరియు ఇర్ఫాన్ అనే వ్యక్తులు యూనివర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ డైరెక్షన్ లో పని చేస్తూ, ప్రిన్సిపాల్ కు ఇన్ఫర్మేషన్ ఇస్తూ నాగరాజు ను మానసికంగా వేదించడం మొదలు పెట్టారు.

ఈ విషయం పై కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కు కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకునే స్థితిలో లేరని పైగా నువ్వే సరిగా పని చేయడం లేదని నాగరాజు ను వేదించడం మొదలు పెట్టారు అని సుభాష్ చందర్ అన్నారు.

కళాశాలలో జరిగిన గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఘోరంగా అవమానించారు.. కాలేజీలో మసీదు ఏర్పాటు చేసినారు. ముస్లిం మతానికి సంబంధించిన వారికి ఎంప్లాయ్ మెంట్ పెంచుతున్నారు జేఎన్టీయూ రిజిస్టర్ హుస్సేన్.

maznoor-husain
maznoor-husain

ముస్లిం ఉద్యోగులను, విద్యార్థులను మతతత్వపు సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థను ముస్లింలకు అడ్డాగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తయారుచేశారు. నాగరాజు ను మాససికంగా వేదిసున్న ముస్లింలు రహ్మన్ మరియు ఇర్ఫాన్ లను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని. అలాగే కళాశాలలో ఉన్న మసిద్ ను వెంటనే తొలగించాలని అలాగే ఇలాంటి మతతత్వపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న.. యూనివర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ ని వెంటనే రిజిస్ట్రార్ పదవి నుంచి తొలగించాలని, విశ్వహిందూ పరిషత్ ధర్మ ప్రచార రాష్ట్ర కో కన్వీనర్ సుభాష్ చందర్ డిమాండ్ చేశారు.

జి ఎన్ టి లో లోకల్ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు .వేరే జిల్లాలకు సంబంధించిన .వేరే రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది ఉద్యోగం చేస్తున్నారు .ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వాళ్ళు లోకల్ వాళ్ళు సెక్యూరిటీ సంబంధించిన. గార్డెన్ సంబంధించిన .హౌస్ కీపింగ్ లో పనిచేస్తున్నారు ఇది చాలా నిర్లక్ష్యం. ఈ లోకల్ మండలంలో లో ఉన్నతమైన స్థాయిలో చదువుకున్నవారు అనేకమంది యువతీ యువకులు ఉన్నారు. వారికి ఈ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం.

LEAVE A RESPONSE