Suryaa.co.in

Andhra Pradesh

బీసీలకు మేలు చేయని జోగి రమేష్ బీసీ కార్డు వాడుకోవడానికి సిగ్గుండాలి

  • బీసీలకు మేలు చేయని జోగి రమేష్ బీసీ కార్డు వాడుకోవడానికి సిగ్గుండాలి

  • గత ఐదేళ్లలో బీసీలకు కాదు కదా సొంత కులస్తులైన గీత కార్మికులకు కూడా జోగి రమేష్ చేసిన మేలు ఒక్కటి లేదు

  • పెడనలో తంతె పెనమలూరు పోయాడు.. పెనమలూరు జనం జోగిని ఛీ కొట్టి ఓడించారు

  • అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొట్టేసి కొడుకు అరెస్ట్ అయితే నేడు గగ్గోలు పెడుతున్నాడు

  • మంత్రి పదవికోసం నాడు చంద్రబాబు ఇంటిపై జోగి అక్రమంగా దాడి చేశాడు

  • నేడు చట్టపరంగా జోగి కొడుకును అరెస్ట్ చేస్తే బీసీ కార్డు వాడుతున్నాడు

  • పేర్ని మతిపోయి మాట్లాడుతున్నారు

  • రెడ్ బుక్ తెరవక ముందే వైసీపీ నేతలు అండర్ గ్రౌండ్ లో దాక్కుంటోన్నారు

  • బీసీలకు ఒక్క మేలు చేయని జోగి ఇకనైనా బీసీకార్డు పై నోరు మూయాలి

  • మంత్రి వాసంశెట్టి సుభాష్

అక్రమంగా అగ్రిగోల్డ్ భూములను కొట్టేసి అమ్ముకున్న మోసగాన్ని చట్టపరంగా అరెస్ట్ చేస్తే జోగి రమేష్ గగ్గోలు పెడుతున్నాడని.. బీసీ కార్డు వాడుతున్నాడని.. గత ఐదేళ్లు గుర్తుకు రాని బీసీలు కొడుకు అరెస్ట్ అయ్యేసరికి గుర్తుకొచ్చారని మంత్రి వాసంశెట్టి అన్నారు. బీసీలకు కాదు కదా సొంత కులస్తులైన కల్లుగీత కార్మికులకు కూడా జోగి రమేష్ చేసిన మేలు ఒక్కటి లేదన్నారు. ఈమేరకు నేడు మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేడు ఆయన మాట్లడారు.

వాసం శెట్టి సుభాష్ మాట్లాడుతూ.. అవినీతి, ఫ్యాక్షనిజం, గంజాయి గురించి ప్రశ్నిస్తారననే అసెంబ్లీకి రాకుండా వైసీనీ నేతలు మొఖం చాటేశారు. కృష్ణా జిల్లాలో మరో జూనియర్ పెద్దిరెడ్డి జోగి రమేష్ అరచకాలు నేడు బయట పడ్డాయి. జోగి కొడుకు అరెస్ట్ అయ్యాడు. 2019 లో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని వైసీపీ నేతలు ఇంటింటికి తిరిగి భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఈడి పరిధిలో ఉన్న భూములను కూడా వదలకుండా కొట్టేశారు. విజయవాడ అంబాపురంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను జోగి రాజు, జోగి వెంటేశ్వరరావులు అక్రమంగా కొట్టేసి. రికార్డులు తారుమారు చేసి సర్వే నెంబర్లు, రికార్డులను మార్చారు. మళ్లీ ఆ భూములను అక్రమంగా విక్రయాలు జరిపారు. గ్రామ సర్వేయర్ సర్వే చేయకపోయినా సర్వే చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి అగ్రిగోల్డ్ భూములను కొట్టేశారు.

జోగి రమేష్ కు అసలు సిగ్గుందా? గత ఐదేళ్లలో బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏనాడైనా గళమెత్తారా? కార్పొరేషన్ లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. కూలాలను విడకొట్టి ఎటువంటి న్యాయం చేయలేదు. సొంత కులస్తులైన గీత కార్మికులకు జోగి రమేష్ చేసిన మేలు ఏమీ లేదు. కుల వృత్తి దారులకు కూడా జోగి ఏ ఉపకారం చేయలేదు. జోగి సొంత కులస్తుడు అమర్నాథ్ గౌడ్ ను పెట్రోల్ పోసి తగలబెడితే ఒక్క మాట మాట్లాడ లేదు. జోగి రమేష్ నేడు తన కొడుకు కేసుల్లో ఇరుక్కోవడంతో కులం కార్డు వాడుకుంటున్నాడు. జగన్ మెప్పుకోసం గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసి మంత్రి పదవి పొందాడు.. కులం మేలుకోసం కాదు. పేర్ని నాని, కొడాలి నానిలు లోకేష్, చంద్రబాబులను తిడతారనే వారికి మంత్రి పదవులు ఇచ్చాడు జగన్. సంబరాల రాంబాబులు సరసాలు చూసే జగన్ మంత్రి పదవి ఇచ్చాడు. దాడులు చేయడం, బూతులు తిట్టేవాళ్లకే జగన్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చాడు.

నేడు ఈ బూతుల మంత్రులందరూ అండర్ గ్రౌండ్ కు పోయారు. పెడన ప్రజలు తరిమేస్తే.. పెనమలూరుకు వచ్చిన జోగికి అక్కడ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. జోగిలాంటి నాయకులు కులం కార్డులు వాడుకోవడం సిగ్గుచేటు. వైసీపీ నేతల్లా అక్రమ కేసులు బనాయించే ప్రభుత్వం కాదు మాది.. క్షుణంగా పరిశీలించి సర్వేలు చేసే ప్రభుత్వం చట్ట పరంగా చర్యలు చేపట్టింది. రెడ్ బుక్ తెరవకుండానే వైసీపీ అవినీతి పరులు లోపలికి పోతారు. ఇప్పటికే వైసీపీ నేతలకు తిండి పోవడంలేదు. పేర్నికి మతి బ్రమించి పిచ్చివాగుడు వాగుతున్నాడు. అధికార దుర్వినియోగం చేసి అగ్రిగోల్డ్ భూములను స్వాహా చేసిన జోగి బీసీ కార్డు వాడుకోవడం మనాలి. బీసీల గౌరవాన్ని నిలబెట్టాలి.

LEAVE A RESPONSE