గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన 14, 17 బూత్ల పరిధిలోని బీసీ, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన 30 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది శుక్రవారం గురజాల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన పులిపాడు గ్రామ సర్పంచ్ కన్నెబోయిన సైదులు (సోకు), కన్నెబోయిన కోటేశ్వరరావు, కంపసాటి మల్లయ్య, కంపసాటి శ్రీనివాసరావు, కంపసాటి కోటేశ్వరరావు, కంపసాటి సురేష్, ముడుసు సాయిలు, ముడుసు లింగయ్య, ముడుసు వెంకటేశ్వర్లు, ముడుసు సుభాష్, వడ్డెర సామాజికవర్గానికి చెందిన ఓర్సు నరసింహారావు, బత్తుల రామాంజనేయులు, ఓర్సు సాంబశివరావు, ఓర్సు నాగులు, ఓర్సు శివ, ఓర్సు లింగయ్య, తమ్మిశెట్టి పిచ్చయ్య, ఓర్సు శ్రీనివాసరావు, ఓర్సు మరియబాబు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కొలకాని అమరలింగం, కొలకాని లింగారావు తదితరులు ఉన్నారు.
వీరంతా చిన్నం అమరలింగయ్య, జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ, నాగెళ్ల పుల్లయ్య, గోళ్ల వెంకటేశ్వర్లు, చిన్నం శివరామయ్య, కొల్లూరి అమర్, నెల్లూరు సుబ్బారావు, మైలపల్లి సోమయ్యల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పులుకూరి కాంతారావు, మద్దినేని లక్ష్మీనారాయణ, బొడ్డపాటి వెంకటేశ్వర్లు, కన్నెగంటి నరసింహారావు, పోట్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.