Suryaa.co.in

Telangana

కేటీఆర్ భాష..ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు

– హైదరాబాద్ గాంధీభవన్లో పిఈసి సమావేశం జరిగిన తర్వాత మీడియా తో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఆరు గ్యారంటీల అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పిఈసి అభినందించింది. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించే అంశంపై చాలా సుదీర్ఘంగా సమావేశంలో చర్చించాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 6 న తుక్కుగుడా లోని రాజీవ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభలో అఖిల్ భారత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు అందించబోతున్నాం.

ఈ సభలో తెలంగాణ మోడల్ ని దేశానికి పరిచయం చేస్తాం. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు దేశం ఆశ్చర్యపోయే విధంగా కాంగ్రెస్ శ్రేణులు కధం తొక్కుతూ పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలి.

బహిరంగ సభ విజయవంతం కోసం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించుకొని పెద్ద ఎత్తున తరలి రావాలి. ఢిల్లీలోని ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేసే విధంగా తుక్కుగూడ బహిరంగ సభ నాంది కావాలి.కేటీఆర్, బిఆర్ఎస్ నాయకులు. రైతు బంధు వేయడం లేదనడం సరికాదు. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ రైతు బంధు డబ్బులు వేశాం.

వంద రోజుల పాలనలో 65 లక్షల మంది రైతులకు 5,575 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశాం. కోటి పది లక్షల ఎకరాలకు గాను కోటి 5 లక్షల ఎకరాలకు రైతు బంధు డబ్బులు వేశాం. ఇంకా ఐదు లక్షల ఎకరాలకు మాత్రమే వేయాల్సి ఉంది. మీ పాలనలో కంటే మేము రైతు బంధు డబ్బులను రైతులకు చాలా స్పీడ్ గా వేస్తున్నాము. దీనిపై చర్చకు సిద్ధం.

రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ చేసిన విషయంలో… మీరు జమ చేసిన సమయం, మేము ఇచ్చిన సమయం పై చర్చకు సిద్ధం.రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేసిన అప్పుల పాలు చేసిన ఒకటో తారీకు నాడే ఉద్యోగులకు జీతాలు వేస్తున్నాము. 2019 నుంచి ఏనాడు కూడా బీఆర్ఎస్ పాలకులు ఒకటో తారీఖు నాడు జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు.

మూసీ నది ఆధునికరణ, త్రిబుల్ ఆర్ రోడ్డు ఏర్పాటు కు ప్రత్యేక చొరవ తీసుకొని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశాం. నిధులు విడుదల చేయాలని కోరాం.త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ కోసం నిధులు మంజూరు చేసాం భూసేకరణ ప్రక్రియ మొదలవుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన మాట్లాడటానికి చర్చకు సిద్ధం.

కాంగ్రెస్ ఏం చేయట్లేదని బిఆర్ ఎస్ నాయకులు గాలి మాటలు మాట్లాడొద్దు. బిఆర్ఎస్ పాలకుల మాదిరిగా మేము ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రం చేయలేదు. గత బిఆర్ఎస్ పాలకులు చేసిన తప్పిదాల వల్ల ప్రకృతి కూడా సహకరించకుండా వారికి బుద్ధి చెప్పింది. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలోనే వర్షాలు పడలేదు. ప్రాజెక్టులు చెరువులు కుంటలు నిండలేదు.

గత బిఆర్ఎస్ పాలకులు ప్రాజెక్టులో ఉన్న నీళ్లను జాగ్రత్తగా వాడుకుంటే ఇప్పుడు నీటి ఎద్దడి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. నీటి ఎద్దడి నివారణకు ప్రతి నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు నిధులు మంజూరు చేసి పెట్టాము. మంచినీటి ఎద్దడి నివారణకు అవసరమైతే ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని ఎక్కడికక్కడ సమీక్షలు పెట్టి సమస్యను అక్కడే పరిష్కరించే విధంగా కార్యచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టుకున్నది.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే జిల్లాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ కలెక్టర్లతో సమావేశాలు పెట్టారు. రైతులతో మాట్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా, సెక్రటేరియట్ కి రాకుండా సోషల్ మీడియా పై ఆధారపడి మేము పాలన చేయట్లేదు. జనంలోకి వెళ్లి జనంలో ఉండి పాలన చేస్తున్నాం.

కేటీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

కేటీఆర్ భాష..ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.అధికారంలో ఉండి అనేక తప్పిదాలు చేసినందుకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. కేటీఆర్ మీరు బాగా చదువుకున్నారు మంత్రిగా పనిచేశారు. పద్దతిగా మాట్లాడాలి కదా* వెంట్రుక కూడా పీకలేరు అని మాట్లాడటం ఏం భాష? దేశ భద్రత అవసరాల కోసం వాడాల్సిన ట్యాపింగ్ ను
వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం వాడి తప్పు చేయడమే కాకుండా, మా వెంట్రుక కూడా పిక లేరు అంటున్నావు నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి?

మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కీ గౌడ్ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE