వేమూరు మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

వేమూరు మండలం కుచెళ్లపాడు గ్రామం నుంచి సర్పంచ్‌తో పాటు 10 కుటుంబాలు, అబ్బనగూడవల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుచెళ్ళపాడు సర్పంచ్‌ గాజుల వెంకట సుబ్బయ్యతో పాటు తాడికొండ రామకృష్ణరావు, తాడికొండ రవి కిషోర్‌, తాడికొండ సుబ్బారావు, పెనుమూడి వెంకట సుబ్బారావు, పెనుమూడి సురేష్‌, కొల్లూరు గోపికృష్ణ, పెరికల విజయేంద్ర, బూసే నరేష్‌, పెరికల బాబురావు, తాడికొండ రంగారావు, తాడికొండ విశ్వేశ్వరరావు, పెరికల బుజ్జి, అబ్బనగూడవల్లి మాజీ సర్పంచ్‌ కొండిశెట్టి వెంకట సుబ్బారావు చేరిన వారిలో ఉన్నారు. పార్టీలో చేరిన వారిక మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల జనసేన పార్టీ సమన్వయ కర్త ఊసా రాజేష్‌, వేమూరు మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ జొన్నల గడ్డ విజయబాబు, టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply