బీజేపీలో చేరిన మహేశ్వరం, కల్వకుర్తి టీడీపీ నేతలు

-పలువురు సర్పంచులు, ఉప సర్పంచులుసహా వందలాది మంది నేతలు బీజేపీలో చేరిక
-బండి సంజయ్ కు బ్రహ్మరథం పట్టిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో ఈరోజు మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. కందుకూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు యెగ్గిడి సత్తయ్య, కల్వకుర్తి సీనియర్ నేత సురేందర్ గౌడ్ తోపాటు మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, వందలాది మంది నాయకులకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నిర్శహించిన సభకు బండి సంజయ్ కుమార్ తోపాటు బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్.విఠల్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జిల్లా ఇంఛార్జ్ శోభారాణి, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి టి.వీరేందర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, కందుకూరు మండలాధ్యక్షులు అశోక్ గౌడ్ తదితరులు హాజరై టీఆర్ఎస్ పాలనను ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఇంఛార్జీ బి.శోభారాణి మాట్లాడుతూ… ‘‘బండి సంజయ్ రథం కదులుతుంటే ఇతర పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరిగేడుతున్నాయి. రాష్ట్రంలో హిందువులు సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా బ్రతుకుతున్నారు. కేసీఆర్ నడిపేది బారు.. దర్బార్ మాత్రమే. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలను ఘోరీ కట్టేందుకు సిద్దం గా ఉన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ కు మంచి రోజులు రాబోతున్నాయి. తెలంగాణ కు అన్యాయం చేసే కేసీఆర్ జైలు కూడు తినడం ఖాయం. బీజేపీ అధికారంలోకి వచ్చాక తిన్నదంతా కక్కిస్తాం. విద్యుత్ చార్జీలు పెంచిన కేసీఆర్ ను పదవి నుంచి తప్పించాలి. మోదీ, సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టుకుందాం.’’అని పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి మాట్లాడుతూ… ’’ప్రపంచంలో అతిపెద్ద పార్టీ గా బీజేపీ చరిత్ర సృష్టించింది. దేశంలో 19రాష్ట్రాల్లో అధికారం లో ఉన్నాం. మోదీ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక నిధులు నియోజకవర్గానికి వస్తున్నాయి. పార్టీ మారి మంత్రి సంపాదించిన సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గ ప్రజలను మోసం చేసింది. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం. ఎంపీ గా రంజిత్ రెడ్డి చేసిందేమీ లేదు… సొమ్ము ఒకడిది సోకు ఒకడిదిగా టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు. భూముల ధరలు.. కరెంట్ చార్జీలు పెంచారు. బీజేపీ ని అధికారంలోకి తీసుకురావడానికి అంతా కలిసి కృషి చేద్దాం’’ అని పిలుపునిచ్చారు.

జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ… ‘‘ఈ ప్రభుత్వం ను కూల్చడానికి సంవత్సరం పెట్టవచ్చు.. ఇంకా ఎక్కువైనా పెట్టవచ్చు. నెలకు 5మందిని బీజేపీ లో చేర్పించేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలి. బీజేపీ అధికారంలోకి రావాలని గత నాలుగైదు దశాబ్దాలుగా కార్యకర్తలెందరో ఉన్నరు. ప్రొఫెసర్ జయశంకర్ ఒకవేళ నేడు బతికి ఉంటే కేసీఆర్ ఫాలన చూసి ఉరేసుకుని చనిపోయేవాడు. రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు పండించే వేలాది ఎకరాల భూమిని ఫార్మాసిటీకి ధారదత్తం చేసి కోట్లు దండుకుంటున్న ఘనుడు కేసీఆర్. ప్రపంచమంతా ప్రధాని నరేంద్రమోదీ పాలనను కీర్తిస్తుంటే… కేసీఆర్ మోదీని తిడుతుంటే మా రక్తం మరుగుతోంది. బంగారు తెలంగాణను బరిబత్తెల తెలంగాణాకు మార్చిన మూర్ఖుడు కేసీఆర్. కేసీఆర్ పాలనలో ప్రజలంతా అల్లాడుతుంటే… ఈ దుర్మార్గుడి పాలనను అంతమొందించేందుకు బండి సంజయ్ అనేక ఉద్యమాలు చేస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు భగభగమండే సూర్యులం. నీ ప్రభుత్వాన్ని కూలుస్తాం. అందుకోసం ఒక్కొక్కరం ఒక్కో బండి సంజయ్ లా మారి కదనరంగంలో దూకాలి. ఇప్పుడు జరుగుతున్న కురుక్షేత్రంలో విజయం బీజేపీదే.

బండి సంజయ్ కు బ్రహ్మరథం
మహేశ్వరం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరిన బండి సంజయ్ కు అడుగడుగునా కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. తొలుత భాగ్యనగర్ జిల్లా మలక్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చావ్నీ డివిజన్ లోని వరసిద్ధి వినాయకుడిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుండి ప్రతిచోటా

కార్యకర్తలు ఎదురై స్వాగతం పలికారు. కర్మన్ ఘాట్ వద్దకు చేరుకోగానే వేలాది మంది నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

పెద్ద ఎత్తున బైకులు, కార్లతో ర్యాలీగా వేలాది మంది నాయకులు బండి సంజయ్ తో కలిసి మహేశ్వరం వెళ్లారు. అక్కడ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన బండి సంజయ్ అనంతరం ర్యాలీగా బయలుదేరి కందుకూరు చేరుకుని బీజేపీలో చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply