అట్లుంటది.. మన జాణ లిస్ట్ ల ‘నెరజాణతనం’..

Spread the love

‘బషీర్బాగ్ కాల్పులు’ గుర్తున్నంతగా….
‘సోంపేట మారణ కాండ’ గుర్తుండదు!Jorn‘కారంచేడు’ గుర్తున్నంతగా ‘చుండూరు’ గుర్తుకురాదు!
‘పదిరి కుప్పం’ గుర్తున్నంతగా ‘లక్ష్మీపురం’ గుర్తుకురాదు!
‘నీరుకొండ’ గుర్తున్నంతగా ‘కంబాలపల్లి’ గుర్తుకురాదు!!

‘ఈనాడు, ఆంధ్రజ్యోతి’ యాజమాన్యాలు ఎవరివో గుర్తుకు వచ్చినంతగా ‘ఆంధ్రప్రభ, ఉదయం, DC’ ఓనర్స్ ఎవరో గుర్తుకు తెచ్చుకోరు!
‘ఈటీవీ, ABN, TV5’ ప్రమోటర్స్ గుర్తుకు వచ్చినంతగా
‘యాక్చీ, టీవీ9, 99టీవీ’ ప్రమోటర్స్ గుర్తుకురారు!!

..గుర్తుకు రాకపోవడం కాదు! జనానికి గుర్తుకు రానీకుండా చెయ్యడంలో ఈ సో కాల్డ్ ‘సకల కళా కోవిదులైన’ యర్నలిస్ట్, జాణలిస్ట్ బ్యాచ్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటది! ఆయా సంఘటనలు జరిగినపుడు తాము వండి వార్చిన మసాలా గుభాళింపులు మాసిపోనీయకుండా, అవకాశం దొరకబుచ్చుకుని మరీ ఇప్పటికీ నెమర వేసుకోడానికి ఇరగబడుతుంటారు!కానీ రాయాల్సింది చుండూరు ఘటనలో ‘బాధితులు,కారకులు’ ఒకే పార్టీ లో ఇప్పుడు హాయుగా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు అనీ! కారకులు మీద, బాధితుల తరపున ఉద్యమాలు చేసిన ప్రొఫెసర్ అదే కులపార్టీ తరపున MLA ఇప్పుడు!!

ఇంతా చేసి వీళ్ళ ఓనమాలు దిద్దుకుని, ఉద్యోగ ఆరంగ్రేటాలు, చేసింది, బుర్ర, బొర్ర పెంచుకుని, పెళ్లిళ్లు చేసుకున్నది, పిల్లల్ని కన్నది అవే యాజమాన్యాలు ఇచ్చిన జీతం రాళ్ళతో అన్న కృతజ్ఞత ఉండదు!! అంతా తమ ప్రతిభే అని, తమ రాతలు, గీతల మీదే ఆ కాపీటలిస్ట్స్ బతికారనేది ఈ ఆలోచనల్లో సోషలిస్ట్, కమ్యూనిస్ట్, ఎర్నలిస్ట్ అనార్కిక్ దండు పాళ్యం బ్యాచ్ ప్రగాఢ నమ్మకం!!

కారంచేడు ఘటన మీద ఆర్టికల్స్ రాయించి, సొంత పేపర్లో న్యూస్ లానే వేసుకున్న పేపర్ ఓనర్ వున్నాడు గానీ, చుండూరు మీద సొంత పేపర్లో రాయించి వేసుకున్న రెడ్డి ఓనర్ గానీ, లక్ష్మీoపేట మీద ఓ ప్రోగ్రాం ఇప్పటిదాకా రన్ చేసిన కాపు ఛానల్ ఓనర్ గానీ, ఎందెందు వెదికినా అందందు మాత్రం కనబడడు.!!
అట్లుంటది!! మన జాణ లిస్ట్ ల ‘నెరజాణతనం’…. మోహనా!! ఓ! మోహనా!

– జీఎన్‌ఆర్

Leave a Reply