-టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీ
హైదరాబాద్: దాదాపు మూడు దశాబ్దాలు ఈనాడు పత్రికలో జర్నలిస్టుగా పనిచేసి, నిజాయితీకి మారుపేరుగా నిలిచి, మీడియా రంగానికి దత్తాత్రి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ కొనియాడారు. బుధవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన దత్తాత్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరై నివాళి అర్పించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి, తోటి జర్నలిస్టులకు దత్తాత్రి స్ఫూర్తిగా నిలిచారని విరాహత్ తెలిపారు. దత్తాత్రి కుటుంబానికి మీడియా అకాడమీ ద్వారా సహకారం అందించేందుకు తమ సంఘం చర్యలు చేపడుతుందని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ) అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం రాష్ట్ర నాయకుడు బాలకృష్ణ, దత్తాత్రి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.