-2 తెలుగు రాష్ట్రాల 9కోట్ల ప్రజల భవిష్యత్తు
– అక్కడ జగన్ పీడ, ఇక్కడ కేసిఆర్ చీడ
– టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న ఎద్దేవా
అక్కడ 9లక్షల కోట్ల అప్పు, ఇక్కడ 5లక్షల కోట్ల అప్పు.అప్పుల ఊబిలోకి 2తెలుగు రాష్ట్రాలను నెట్టారు.మద్యం స్కామ్ లో కేసిఆర్ కూతురు, జగన్ బినామీలు.అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలుతున్నారు.పరిపాలన చేతగాక జగన్, కేసిఆర్ చేతులెత్తేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ.కేసిఆర్ స్విచ్ వేస్తే జగన్ దగ్గర బల్బు వెలుగుద్ది.జగన్ బటన్ నొక్కితే సజ్జల నోరు తెరుస్తాడు. అక్కడ జగన్ పీడ, ఇక్కడ కేసిఆర్ చీడ. వదిలిస్తేనే 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడ్తాయి. అక్కడ జగన్నాటకం, ఇక్కడ కేసిఆర్ అంతర్నాటకం. రెండు డ్రామాలకు తెరపడే రోజు దగ్గర్లోనే ఉంది.