చూడండి రెడ్డి గారు…… మాకు ఏదో పోయింది అని మీరు అనుకుంటున్నారు, లేదా కొంత మంది అనుకుంటున్నారు. మేం అలా అనుకోవడం లేదు. కష్టాన్ని నమ్ముకుని ఇక్కడ దాక వచ్చిన వాళ్ళం. నిజానికి మాది అగ్ర కులం కాదు. మేం కూడా శూద్రులమే. దాదాపు మూడు వేల సంవత్సరాలపాటు, బ్రాహ్మణ ఆధిపత్యం లో చదువుకి, అభివృద్ధికి దూరంగా బతికాం.
మాకంటూ ఒక చేతివృత్తి లేకపోవడం వల్ల, బతకడానికి అన్ని పనులు చేసాం. సైన్యంలో చేరాం,వ్యవసాయం చేసాం, వ్యాపారం చేశాం, ఉద్యోగాలు చేశాం… అవకాశం దొరికిన ప్రతి చోట ముందుకెళ్లాము.
ఉపాధి కోసం ఊళ్లు వదిలేశాం. అందుకే ఎక్కడ చూసినా మా వాళ్ళు ఉంటారు.
మట్టి పిసికే రైతు దగ్గర నుంచి, మైక్రోసాఫ్ట్ సీఈఓ వరకు మా వాళ్ళు ఉంటారు.
మేము నీళ్ల లాంటి వాళ్ళం. నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్దాం. మా దృష్టిలో నీళ్లు అంటే అభివృద్ధి… అందుకే నాగార్జునసాగర్ ఆయకట్టు లో మేముంటాం, శ్రీరాంసాగర్ ఆయకట్టులో మేముంటాం, గోదావరి ఆయకట్టులో మేముంటాం, తుంగభద్రా ఆయకట్టులో… రాయచూర్ లో సైతం మేముంటాం. బహుశా మాకు కూడా, ఒక కుల వృత్తి ఉన్నట్లయితే… అక్కడే ఆగిపోయి ఉండేవాళ్ళం. అది లేకపోవడం వల్ల, పాల వ్యాపారం, పచ్చళ్ల వ్యాపారం దగ్గర్నుంచి…… పరిపాలనలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవి వరకు…
మా వాళ్ళు ఉన్నారు.
అప్పుడెప్పుడో కాకతీయుల చరిత్ర వదిలేస్తే….
ఆధునిక యుగంలో,
దాదాపు వందేళ్ల క్రితం వరకు… మేం కూడా, రాజకీయంగా, ఆర్థికంగా, వెనుకబడే ఉన్నాం.
కానీ…..
బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఆధునిక చదువులు, మాకు హేతువాదాన్ని అందించాయి. సంప్రదాయాన్ని అనుసరిస్తూనే…. అన్ని రంగాల్లో ప్రయోగాలు చేశాం. శ్రమ మా పెట్టుబడి కాబట్టి, దూసుకుపోయే తత్వం ఉంది కాబట్టి, అవసరమైన చోట తగ్గే, సరళ స్వభావం ఉంది కాబట్టి, దాదాపు అన్ని రంగాల్లో మా వాళ్ళు ముందున్నారు.
ఆర్థికంగా, సామాజికంగా, ఈరోజు మేమున్న స్థాయిని అర్థం చేసుకోవాలంటే… గత వంద సంవత్సరాల దక్షిణ భారతదేశ చరిత్ర చదువు కోవాలి.
మాస్ హీరో కాబట్టి మా తాత, పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుంటే పొరపాటు. (అలా అయితే చిరంజీవి అంకుల్ కూడా ముఖ్యమంత్రి అయి ఉండాల్సింది)
మా తాత పార్టీ పెట్టే నాటికే, మా వాళ్లు శాసనసభలో దాదాపు 47 మంది ఉన్నారు. అంటే అప్పటికే తెలుగు సమాజంలో….. అన్ని రంగాల్లో మా వాళ్ళు ముందున్నారు.
రైతులు గా పదిమందికి అన్నం పెట్టాం. పాఠశాలలు, కళాశాలలు పెట్టి, ఒక ఉద్యమంలా అందరికీ విద్యనందించాం. వేలాది ఎకరాల భూములను విద్యాలయాలకు ఇచ్చాం.
వైద్య రంగంలో కూడా తెలుగోడి పేరును ప్రపంచానికి పరిచయం చేశాం.
బహుశా…
అభివృద్ధి మా DNA లో ఉంది కాబోలు, మద్రాసు పునాదుల్లో చూసినా, కోయంబత్తూరు వీధుల్లో చూసినా, బెంగళూరులో చూసినా, రాయచూర్ లో చూసినా, హైదరాబాదులో అడుగడుగున చూసినా…. మా కష్టం కనిపిస్తుంది.
మాకు తెలియకుండానే, మేం సంపద సృస్టిస్తాం, పదిమందికి పంచుతాం.
ఇప్పుడు మీరు దేవుడిగా కొలుస్తున్న రెడ్డి గారు….. 20ఏళ్ల క్రితం మా చౌదరి గారిని అడిగారట….”నెలకు లక్ష రూపాయల ఆదాయం వచ్చే ఏదైనా పని మా వాడికి చూపించండి” అని.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రెడ్డిగారు……..
క్యాబినెట్ లో ఒక మంత్రి పదవి వల్ల…….. మాకు వచ్చేది ఏమీ లేదు.
మీకు ఒక విషయం చెపుతా….. రాజకీయాల్లోకి రాక పోయిఉంటే… మా నామా నాగేశ్వరరావు అంబానీ ల స్థాయికి ఎదిగే వాడు.(20 ఏళ్ల క్రితం నామా అపాయింట్మెంట్ కోసం అధాని ఎదురుచూడటం… ఇప్పుడు చరిత్ర)
ఇప్పటికీ…. ఈ రాష్ట్రంలో, హైయెస్ట్ టాక్స్ పేయర్ ఎవరో తెలుసా?
మా గల్లా జయదేవ్.(పాపం వ్యాపారంలో సంపాదించి….. సమాజం పట్ల ప్రేమతో, రాజకీయాల్లో ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు)
ఇంకో కాపీ చెప్పండి రెడ్డిగారు……..
ఇన్ని మాటలు చెప్పావు…..
మీ వాళ్ళు ఏం తప్పు చేయలేదా? అని… మీరు అడగొచ్చు.
నిజమే……
అక్కడక్కడ…. కొంతమంది వ్యక్తులు, చేసిన కొన్ని పనుల వల్ల, మా వాళ్ళందరిని దోషులుగా నిలబెట్టారు. అలాంటి వాటికి… వంగవీటి రాధా లాంటివాళ్ళు, స్వయంగా సమాధానం చెప్పినా….. మీరు నమ్మరు. మిమ్మల్ని నమ్మించాల్చిన అవసరం మాకు లేదు.
చివరిగా……
అధికారం ఉన్నా లేకపోయినా….
పదవులు ఉన్నా లేకపోయినా….
మేం సాగుతాం ముందుకు….
ప్రపంచం మా వెంట వస్తుంది.
ఎందుకంటే?
మేము క ని నమ్ముకున్నాం.
క.. అంటే …
కమ్మ కాదు.
క… అంటే…
కష్టం.
చరిత్ర చదువుకున్న ఒక విద్యార్థిగా…
– డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు