పేదల సంక్షేమానికి చంద్రబాబునాయుడు మొనగాడైతే జగన్ రెడ్డి పచ్చి మోసగాడు

పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు

తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి మారపేరు. తెలుగదేశం పేద, బడుగు, బలహీన వర్గాలపార్టీ అని పేరుంది. స్వర్గీయ ఎన్టీరామారావు గొప్ప ఆశయంతో సంక్షేమ శ్రేయో రాజ్యాన్ని తెలుగు నేలపై స్థాపించాలని గొప్ప సదాశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమానికి పెద్దపీట వేశాం. 2 రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు టీడీపీ ఇచ్చింది. పేదవాడికి పక్కా ఇల్లు కలను సాకారం చేశాం. సంక్షేమానికి పేటెంట్ హక్కు ఒక్క టీడీపీకే ఉంది. రేషన్ కార్డులు, పెన్షన్ లు, ఇల్లు ఇచ్చాం. దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయని విధంగా 2014-19 మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల కింద 13 లక్షల ఇళ్లను, పట్టణ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాల రూపంలో మరో 6,25,000 ఇళ్ల నిర్మాణాల్ని మనం చేపట్టాం. దాదాపు రెండున్నర లక్షల ఇళ్లను పూర్తి చేశాం. గృహ ప్రవేశాలను ఒక పండగలాగ చేశాం. గాంధీ మహాత్ముడి జయంతి నాడు ఒకేసారి లక్ష గృహ ప్రవేశాలు చేశాం. ప్రపంచ ఆవాస్ దినం సందర్భంగా 3 లక్షల గృహ ప్రవేశాలు ఒక పండగలా చేశాం. గృహ ప్రవేశాల్లో దేశంలోనే ఒక గొప్ప పేరు తెచ్చుకున్నాం. అది చంద్రబాబునాయుడు దార్శనికత, తెలుగుదేశం పార్టీ గొప్పతనం.

ఎన్టీరామారావు, చంద్రబాబునాయుడు గార్లకు పేదలపట్ల ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం. జగన్ అధికారంలోకి రాక ముందు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్కో కుటుంబాలకు పది నుంచి 15 లక్షల రూపాయలు వచ్చే విధంగా నవరత్నాలను అమలు చేస్తానన్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నా అమ్మ ఒడి ఇస్తామని చెప్పి ఒకే పిల్లవాడికి పరిమితం చేశారు. కోటీ 20 లక్షల మంది డ్వాక్రా సంఘాల్లో మహిళలు ఉంటే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు చేయూత కేవలం 24 లక్షల మందికి మాత్రమే ఇస్తు్న్నారు. చంద్రబాబునాయుడు చేసిన సంక్షేమంలో కనీసం సగం డబ్బులు కూడా ఖర్చు చేయలేదు. 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో రాష్ట్ర విభజన జరిగింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నా మూడు సంవత్సరాల కాలంలో లక్షా 75 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశాం.

జగన్ అధికారంలోకి వచ్చాక లక్షా 25 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. అతి తక్కువగా ఖర్చు చేశారు. విద్యార్థులను బాగుచేస్తామని చెప్పి మోసం చేశారు. టీడీపీ ఫీజు రీయంబర్స్ మెంట్ కింద 16 లక్షల మందికి ఇస్తే జగన్ నేడు ఇస్తన్నది 11 లక్షలే. సంక్షేమం చంద్రబాబునాయుడుతోనే సాధ్యం. పేద రహిత సమాజం కోసం అహోరాత్రులు చంద్రబాబు శ్రమించారు. నిత్యం ఎక్కడ దోచుకుందాం? ఎక్కడ దాచుకుందామని జగన్ చూస్తుంటాడు. పేదల కార్పొరేషన్లన్నీ నిర్వీర్యమయ్యాయి. గ్రామ పంచాయతీలలో ఛైర్మన్లకు కూర్చోవడానికి కనీసం కుర్చీలు, ఆఫీసు, చేయడానికి పనులు కూడా లేవు. ఈ విషయాలను ఊరూ వాడా చాటాలి. కేంద్రం నుంచి వచ్చే డబ్బులను దుర్వినియోగం చేశారు. అణగారిన వర్గాలను దారుణంగా అణచివేస్తున్నారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి.

Leave a Reply