– కేసీఆర్ చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరవుతున్నారు
– కేసీఆర్ ను డైరెక్ట్ గా ఎదుర్కోలేక నోటీసుల పేరుతో ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్,బిజెపి కూడబలుక్కొని కుట్రలు
– మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: సబ్బండ వర్గాలను కలుపుకొని సుదీర్ఘ పోరాటం చేసి తెచ్చిన తెలంగాణ ను దేశంలో అగ్రగామిగా నిలపడానికి గత 10 ఎండ్లు అహోరాత్రులు కృషి చేశారు. తెలంగాణ బాగు ను కాంక్షించిన కేసీఆర్ పై విచారణ పేరిట వేధింపులకు గురి చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. కేసీఆర్ వెంట తెలంగాణ సమాజం ఉంది.
మీ కుట్రలను ఛేదించి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడుతాం..ప్రజా కోర్టులో శిక్ష వేస్తాం. నేను టిడిపి స్కూల్ లో ,బిజెపి కాలేజ్ లో చదివాను,రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్న అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో,రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగ ధర్మం నిర్వర్తించడంలో రేవంత్ రెడ్డి విఫలం అవ్వడం వల్లనే, 45 సార్లు ఢిల్లీ కి చక్కర్లు కొట్టిన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.
మొన్నటి వరకు విద్యుత్ పై కమిషన్ వేసి కేసీఆర్ ను ,ఫార్ములా 1 లో విచారణ పేరిట కేటీఆర్ ను అలాగే పార్టీ నాయకులను ఏ అవకాశం దొరికిన కక్ష్య సాధింపుతో ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూసింది. 18 నెలలకే కాంగ్రెస్ పరిపాలన తెలంగాణ కు శాపం అని ప్రజలందరూ అనుకుంటున్నారు.
కేసులకు, విచారణలకు భయపడం.ధైర్యంగా ఎదుర్కొన్నాం ..ఇక ముందు ఎదుర్కొంటాం. మీ కుట్రలను చేదిస్తూనే మీరు ఇచ్చిన హామీల అమలు అయ్యేవరకు పోరాడుతాం