Suryaa.co.in

Telangana

ఖజానా నింపుకునేందుకు విద్యార్థులే దొరికారా ?

– బస్సు పాస్ ల చార్జీలు పెంచడం దారుణం
– బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: బస్సు పాస్ ల చార్జీలు పెంచడం దారుణం. దాదాపు పదిహేను లక్షల మంది పై భారం పడేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి విద్యార్ధి పై నెలకు 350 రూపాయల అదనపు భారం మోపారు. సంవత్సరానికి విద్యార్థుల పై దాదాపు 650 కోట్ల భారం మోపుతున్నారు.

విద్యార్ధి రాజకీయాల నుంచి వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థుల పై భారం మోపడం సరికాదు. ఒకవైపు మహిళలకు ఉచిత బస్ అంటూనే వారి కుటుంబసభ్యులకు పెంచడం ఏ మేరకు సమంజసం? నిరుద్యోగులకు భృతి ఇస్తామని ఇవ్వలేదు. ఖజానా నింపుకునేందుకు విద్యార్థులే దొరికారా ?

మద్యం చార్జీలు పెంచారు .గ్యారంటీలు అమలు చేయడం లేదు. బస్సు చార్జీల పెంపు తో ఆదాయాన్ని సమకూర్చుకుని గ్యారంటీలు అమలు చేస్తారా ? ప్రజల జీవన ప్రమాణాలు ఏం పెరిగాయనీ చార్జీలు పెంచారు? చార్జీల పెంపును ఎవ్వరూ సమర్ధించడం లేదు.

వెంటనే పెంచిన బస్సు పాస్ చార్జీలను ఉపసంహరించుకోవాలి. ఈ రోజు బస్సు భవన్ ముట్టడించాం .చార్జీలు తగ్గించక పోతే ఆందోళన ఉధృతం చేస్తాం. ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ వి ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్ ,బీ ఆర్ ఎస్ వి నేతలు నర్సింగ్ ,జంగయ్య ,నితీష్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE