Suryaa.co.in

Andhra Pradesh

కనిగిరి రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా

– పూడిక తీసి 4 TMC ల నీటి నిలువకు కృషి.
– రివీట్మెంట్ నిర్మాణం చేపట్టి కరకట్టల పటిష్టం చేయిస్తా.
– ఆయకట్టు చివరి ఎకారాకు కూడా సాగునీరందిస్తా.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

కోవూరు: నియోజకవర్గ పరిధిలో రైతాంగ ప్రయోజనాల కోసం పాటుపడతానన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కనిగిరి రిజర్వాయర్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటి విడుదల కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి బుచ్చిరెడ్డి పాళెం మండల నాయకులు రైతులు ఘన స్వాగతం పలికారు.

బుచ్చి, కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాల రైతుల విజ్ఞప్తి మేరకు నారు మళ్ల అవసరాల కోసం ఆమె సదరన్ ఛానల్ ద్వారా 100 ఈస్ట్రన్ ఛానల్ ద్వారా 80 క్యూసెక్కుల నీళ్లు విడుదల చేశారు.

అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కనిగిరి రిజర్వాయర్ లో గత కొన్నేళ్లుగా పూడిక తీయని కారణంగా పూర్తి సామర్ధ్యం మేరకు నీళ్లు నిల్వ చేయలేకపోతున్నట్లు రైతు సంఘ నాయకులు తన దృష్టికి తెచ్చారన్నారు.

LEAVE A RESPONSE