ట్రైబ్యునల్ ఆర్డర్ చూసి చంద్రబాబుకు రక్త కన్నీరు

Spread the love

– బాబు సంపాదన, రాజకీయ జీవితం అంతా అవినీతి మయమే
– పత్రికా స్వాతంత్ర్యం అంటే బాబు దృష్టిలో తన భజన చేయడమే
– మరో పత్రిక ఉండకూడదనే బాబు సాక్షిని టార్గెట్ చేశారు
– సాక్షిలోకి పెట్టుబడులు రాజమార్గంలో వచ్చాయి.. ఈరోజు ట్రైబ్యునల్ అదే చెప్పింది
– చంద్రబాబు హెరిటేజ్‌ ఎలా పుట్టింది? ఎలా పెరిగింది? అధికారంలో ఉంటేనే షేర్ ఎందుకు పెరుగుతుంది?
– జగన్ కి ఉన్న తిరుగులేని ప్రజాభిమానం చూసి తట్టుకోలేకే సోనియా, బాబు కుట్రలు పన్నారు
– పేదలకు, ప్రాజెక్టులకు తక్కువ ధరకే భారతీ సిమెంటు ఇస్తే.. హెరిటేజ్ లో బాబు ఏనాడైనా రిబేట్ ఇచ్చాడా..?

మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే, ఆయన మాటల్లోనే…
– నిన్న చంద్రబాబుకు గుండె పగిలింది. కళ్ళలో రక్తం వచ్చింది. ఏడుపు ఆపుకుని… మొహం కందగడ్డలా చేసుకుని ప్రెస్‌మీట్‌ పెట్టాడు.
– అందులో సారాంశం ఏమిటంటే… సాక్షి పత్రికలోకి వచ్చినవి పెట్టుబడులే అని సిటింగ్‌ జడ్జి, ఇతర జడ్జీలూ ఉండే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది అన్నది.
– సాక్షిలో పెట్టుబడుల గురించి చంద్రబాబుకు ఎందుకు బాధ? సాక్షి ఒక పత్రిక. అందులో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 1200 కోట్లు పెట్టుబడులు పెట్టారు.
– ఈ పెట్టుబడులు రాజమార్గంలో వచ్చాయి. పాన్‌ కార్డ్, బ్యాంక్‌ అకౌంట్, వైట్‌ మనీ ద్వారా ఇందులో పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు పెట్టారు.
– ఇదంతా 2008లో సాక్షి పత్రిక పెడుతున్న రోజుల్లో వ్యవహారం.
– దాన్ని ఆ రోజున, ఓదార్పు యాత్ర వద్దంటే, ప్రజలతో తన తండ్రికి ఉన్న అనుబంధం ముఖ్యం కాబట్టి చేస్తా అన్నందుకు… దేశంలోని అత్యంత శక్తిమంతమైన ఇన్‌కమ్‌ ట్యాక్స్, ఈడీ, సీబీఐ వంటి సంస్థల్ని జగన్‌ నేతృత్వంలోని సాక్షి మీదకు, ఇతర సంస్థలమీదకు అక్రమంగా దాడికి పంపించారు.
– లొంగ లేదని దొంగ కేసులు వేసింది ఎవరంటే కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ. ఎందుకు ఈ కేసులు వేశారంటే… ప్రజల్లో ఉన్న అభిమానం చూసి. చంద్రబాబు ఎందుకు కాంగ్రెస్‌తో కలిశాడంటే… జనంలో పోరాడటం తన వల్ల కాదు కాబట్టి.
– ఇదీ ఆ రోజు కేసులకు నేపథ్యం.
– ఆ రోజు ఏం చేశారంటే… ముందుగా ఐటీని పంపి, సాక్షిలోకి చట్టబద్ధంగా వచ్చిన పెట్టుబడుల్ని పెట్టుబడులుగా కాకుండా, ఆదాయంగా పరిగణించాలని ఒక దుర్మార్గమైన ఆర్డర్‌ ఇప్పించారు.
– దీని వెనక ఎవరున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే.

మరో పత్రిక ఉండకూడదనే సాక్షిని టార్గెట్ చేశారు
– ఎందుకు సాక్షిని టార్గెట్‌ చేశారంటే… మరో పత్రిక ఉండకూడదని.
– చంద్రబాబు దృష్టిలో పత్రికా స్వాతంత్య్రం అంటే తన వాళ్ళ పత్రికలు, తనవాళ్ళ చానళ్ళు మాత్రమే ఉండి తనకు అనుకూల భజన చేయటం, నిజాలను కప్పి పెట్టటం.
–2009లో వైయస్సార్‌ మరణించిన వెంటనే జగన్‌ ని ఎందుకు టార్గెట్‌ చేశారంటే… వైయస్సార్‌ మరణించిన తరవాత తమకు ఎదురు లేదని బాబు, సోనియా అనుకుంటుంటే… జగన్‌ కి తిరుగులేని ప్రజాభిమానం ఉండటాన్ని చూసి ఇద్దరూ తట్టుకోలేకపోయారు.
– ఇది చరిత్ర, ఇది వాస్తవం.
– పెట్టుబడిగా రాజమార్గంలో వచ్చిన డబ్బును ఐటీవారు ఆదాయంగా ఎలా ట్రీట్‌ చేస్తారని ఆ రోజే జగన్‌ తరఫున ప్రశ్నించాం.
– ఈ రోజు ట్రైబ్యునల్‌ తీర్పు అదే చెప్పింది.
– ఒక నాయకుడిని, ఒక పార్టీని జనంలో ఎదుర్కోగలం అనే నమ్మకం లేని చంద్రబాబు తన జీవితాన్ని వెన్నుపోట్ల పునాదులమీద నిర్మించుకున్నాడు.
– కాబట్టే, జగన్‌ పెట్టిన పత్రికలో పెట్టుబడులు చట్టబద్ధం అని, చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం…

ఈ దేశంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ట్రైబ్యునల్‌ చెప్పిందనేసరికి బాబు గుండెలు పగులుతున్నాయి. అందుకే ఈ సంధిప్రేలాపనలు చేశాడు.
– దాన్ని పోటీ పత్రిక ఈనాడువారు, అక్కసుతో మొదటి పేజీలో ఆనందంగా అచ్చు వేశారు.

రాజమార్గంలో జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు
– జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు రాజమార్గంలో వచ్చాయి. కానీ చంద్రబాబు కంపెనీల్లో పెట్టుబడులు ఎలా వచ్చాయన్నది మాత్రమే విచారణ జరగాల్సిన అంశం.
– చంద్రబాబు హెరిటేజ్‌ ఎలా పుట్టింది? ఎలా పెరిగింది?
– చంద్రబాబు ఆస్తులు ఆయన ఎమ్మెల్యే అయ్యేనాటికి ఎంత? ఇప్పుడు ఎంత?
– చంద్రబాబు ఏమన్నా చింతపల్లి జమిందార్‌ కొడుకా?

బాబు అధికారంలో ఉంటే హెరిటేజ్ షేర్ పెరుగుతుంది
– చంద్రబాబు అధికారంలో ఉంటే హెరిటేజ్‌ షేర్‌ పెరుగుతుంది. చంద్రబాబుకు అధికారం పోతే హెరిటేజ్‌ షేర్‌ తగ్గుతుంది. చంద్రబాబు అధికారానికీ, హెరిటేజ్‌ షేర్‌కి ఉన్న సంబంధం ఏమిటి?
– చంద్రబాబు తాను అధికారంలో ఉండగా మింగిన లంచాలను, కొంతమేరకైనా, ఏ రకంగా వైట్‌ చేసుకుంటున్నాడో అందరికీ అర్థమవుతోంది.
– 2004లో చంద్రబాబు అధికారం నుంచి దిగే నాటికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేర్‌ విలువ రూ. 13 నుంచి రూ. 15 మాత్రమే. 2009లో మళ్ళీ ఓడిన నాటికి కూడా ఆ విలువ దాదాపుగా అంతే ఉంది. వైయస్సార్‌ మరణం తరవాత, కిరణ్‌ సర్కార్‌ నుంచి పెరగటం ప్రారంభమయింది. 2014లో మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి దాని విలువ రూ. 100కు అటూ ఇటుగా ఉంది.
– అప్పటినుంచి 2018 వరకు హెరిటేజ్‌ షేర్‌ ధర ఎలా పెరిగిందో ఔత్సాహికులు ఎవరైనా ఉంటే షేర్‌ ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేసి చూడండి… అందరికీ అర్థమవుతుంది.

బాబు సంపాదన, రాజకీయ జీవితం అంతా అవినీతి మయమే
– బాబు సంపాదన, బాబు రాజకీయం, బాబును సమర్థించేవారి జీవితాలు… అన్నీ అవినీతి మయమే. వ్యవస్థల మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యాలే తప్ప ప్రజా జీవితంలో నిజాయతీ అన్నది ఆయన 40 ఏళ్ళ చరిత్రలో ఎక్కడా కనిపించవు.
– కాబట్టే ఆస్తులమీద సీబీఐ విచారణ ఎదుర్కోకుండా నానా తంటాలూ పడి బయటపడ్డాడు. ఓటుకు కోట్లు కేసును విచారణ జరగకుండా అడ్డుపడ్డాడు. ఏలేరు స్కామ్‌ నుంచి అమరావతి బినామీ కింగ్‌డమ్‌ వరకు ఏ ఒక్క స్కామ్‌ మీదా విచారణ జరగకుండా అన్ని రకాలుగా తన పలుకుబడిని ఉపయోగించగలిగాడు కానీ…. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకునేందుకు ఈ మేనేజ్‌మెంట్లు ఉపయోగపడలేదు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో తన ఓటమి ఖాయం అన్న భయం చంద్రబాబును వెంటాడుతోంది.

పేదలకు, ప్రాజెక్టులకు తక్కువ ధరకే భారతీ సిమెంటు ఇస్తే.. హెరిటేజ్ లో బాబు ఏనాడైనా రిబేట్ ఇచ్చాడా..?
– ఇక చివరిగా, భారతీ సిమెంట్‌మీద పదేపదే ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు గురించి రెండు మాటలు చెప్పాలి.
– భారతీ సిమెంట్‌ కంపెనీ నుంచి, ఈ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, గవర్నమెంటు బడుల నిర్మాణానికి, గవర్నమెంట్‌ ఆసుపత్రుల నిర్మాణానికి, పేదల ఇళ్ళ నిర్మాణానికి, టిడ్కో ఇళ్ళ నిర్మాణానికి, బస్‌ స్టాండ్ల నిర్మాణం–మరమ్మతులకు… ఇలా 28 ప్రభుత్వ సంస్థలకు కావాల్సిన సిమెంట్‌ అవసరాలకు భారతీ సిమెంట్, మిగతా సంస్థల సిమెంట్‌ను ఒక్కో బ్యాగ్‌ రూ. 230కే ఇస్తున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 28 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ను రిబేటుమీద సిమెంట్‌ కంపెనీలు ప్రభుత్వ నిర్మాణాల కోసం ఇచ్చాయి.
– మరి హెరిటేజ్‌ కంపెనీ ద్వారా చంద్రబాబు కనీసం గవర్నమెంట్‌ స్కూళ్ళలో పిల్లలకు పాలనైనా రిబేట్‌లో ఇప్పించాడా? పేదలకు ఏనాడైనా తక్కువకు అమ్మాడా? పైగా హెరిటేజ్‌ మార్కెట్లలో ఏ నిత్యావసర వస్తువుల రేట్లు తీసుకున్నా మార్కెట్‌ కంటే ఎక్కువే.
– చివరికి ఎండాకాలంలో మజ్జిగ పేరిట; చంద్రన్న సంచిలో నెయ్యి పేరిట కూడా లూటీ చేసిన చరిత్ర చంద్రబాబు కంపెనీలది.

అధికారం ప్రజల నుంచి కాకుండా.. ఎల్లో మీడియా నుంచి వస్తుందన్నది బాబు ఆశ
– ఇలాంటి చంద్రబాబు ప్రెస్‌మీట్లు పెట్టి, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సంబంధించిన ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఆర్డర్లు తప్పంటాడు.
– నిజాలతో నిమిత్తం లేకుండా, తన ప్రత్యర్థి అయిన జగన్‌ కి వ్యతిరేకంగా ఏ కోర్టు తీర్పు వచ్చినా బాబు 13 ఏళ్ళుగా జై కొడుతూనే ఉన్నాడు.
– చట్టబద్ధంగా ఒక తీర్పు వస్తే బాబు చివరికి కోర్టులమీద, ట్రిబ్యునళ్ళమీద మండిపడుతున్నాడు.
– రాజకీయ ప్రత్యర్థిని ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి కాదని ఎవరు చెప్పినా బాబు వినడు. ప్రజల్లో ఉండడు. ప్రజల్ని నమ్మడు. ప్రజలకు మంచి చేయడు. ప్రజలనుంచి అధికారం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ద్వారా వస్తాయనుకుంటాడు.
– బాబు సమస్యలకు ప్రజలే మరోసారి సమాధానం చెపుతారు.

కరోనా కన్నా ప్రమాదకరంగా బాబు
– కరోనా కన్నా ప్రమాదకరంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. నిరంతరం అధికారం లేకపోతే ప్రజల్ని తప్పుదారి పట్టించి, అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పట్ల చాలా చులకన భావాన్ని ఆయన తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.

– అది మంచి పథకం అయినా, ఎలాంటి గొప్ప కార్యక్రమం అయినా.. దాని గురించి చంద్రబాబు చాలా చెడుగా ప్రచారం చేస్తున్నారు. తాను చెప్పింది, తన అనుకూల మీడియాలో చూపిస్తే.. ప్రజలు నమ్ముతారన్నది ఆయన భావన. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల పాత విషయాలు మర్చిపోయి, ఇదే నిజం అనుకుంటారనేది చంద్రబాబు సిద్దాంతం.

– ఏమాత్రం కొంచెం కూడా తన గురించి తాను ఆలోచించుకోకుండా, ఇలా చెప్పడం వల్ల ప్రజలు తన గురించి నవ్వుతాన్న ఇంగిత జ్ఞానం కూడా బాబుకు లేదు. నోరుతెరిస్తే అబద్ధాలు వల్లె వేయడం, నిరసనలకు దిగటం అన్నది టీడీపీకి ఒక ప్రహసనంగా మారింది. ఈ ప్రభుత్వం రైతులకు న్యాయం చేసినట్టు ఈ రాష్ట్ర చరిత్రలో అయినా, దేశ చరిత్రలో అయినా ఎవరైనా చేశారా..?

– చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక నాయుకుడినిగానీ, పార్టీని కానీ ఎదుర్కొని గెలవాలని ఎప్పుడూ అనుకోరు. తన చుట్టూ ఉన్న శక్తులను ప్రయోగించి వ్యవస్థలను బలహీనపరిచిన తర్వాత… ఆ బలహీనత కన్నా తాను గొప్పోడిని అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఎప్పుడూ నేరుగా పోరాటం చేయరు. ఆయనదంతా అడ్డదారే.

Leave a Reply