Suryaa.co.in

Andhra Pradesh

కాంతితో క్రాంతి” నిరసన కార్యక్రమంతో నినదించిన తెలుగుదేశం

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండించిన పార్టీ నేతలు, కార్యకర్తలు

ఇళ్లలో లైట్లు ఆపి కొవ్వొత్తులు, సెల్ ఫోన్ లైట్లతో నిరసన

గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున “కాంతితో క్రాంతి” కార్యక్రమం చేపట్టడం జరిగింది. వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు “గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం” అంటూ ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులు, కాగడాలు, సెల్ ఫోన్ లైట్లతో నిరసన వ్యక్తం చేశారు. ఇళ్ల బయట, వాకిళ్లు, వీధుల్లో దీపాలు వెలిగించారు. రోడ్లపై వాహనాల లైట్లు బ్లింక్ చేసి తమ నిరసన తెలిపారు.

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో “కాంతితో క్రాంతి” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. “గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం” అంటూ సాయంత్రం 7 గంటల నుంచి 7.05 గంటల వరకు లైట్లు ఆపి కొవ్వొత్తులు, కాగడాలు, సెల్ ఫోన్ లైట్లను బ్లింక్ చేస్తూ ద్విచక్ర వాహనాలు, బైక్ లపై ఉన్నవారు తమ హెడ్ లైట్స్ ను ఆన్, ఆఫ్ చేసి నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పంచుమర్తి అనూరాధ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావ పీతల సుజాత, నర్సరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురాం, అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, విభిన్న ప్రతిభావంతుల విభాగం అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావుతోపాటు పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఢిల్లీలో దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ.. అంటూ నినాదాలు చేశారు.

రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ‘కాంత్రితో క్రాంతి’ పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున చంద్రబాబు అభిమానులు పాల్గొన్నారు. రోడ్లపై వాహనాల లైట్లు బ్లింక్ చేస్తూ నిరసన తెలిపారు. ఇళ్ల బయట, వాకిళ్లు, వీధుల్లో దీపాలు వెలిగించి ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.

 

LEAVE A RESPONSE