పేదవారికి ఆసరాగా ఉండాల్సిన ఆరోగ్యశ్రీని జగన్ అనారోగ్యశ్రీగా మార్చారు

– టీడీపీ అధికార ప్రతినిధి పాలడుగు వినీల

పేదవారికి ఆసరాగా ఉండాల్సిన ఆరోగ్యశ్రీ ని జగన్ అనారోగ్యశ్రీగా మార్చాని టీడీపీ అధికార ప్రతినిధి పాలడుగు వినీల పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడిన మాటలు …

జగన్ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లల్లో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. సకాలంలో వైద్యం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సీఎం సొంత జిల్లాలోనే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని అమలు చేయకపోవడం దారుణం. విడుదల చేయాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయకుండా లైసెన్సులు రద్దు చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులపై బెదిరింపులకు దిగుతోంది.

రోజుల తరబడి ఆసుప్రతుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు దాపురించాయి. చేతితో ఆరోగ్య శ్రీ కార్డు చూడగానే ముందుగా మీరు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది, లేదు అంటే రోజుల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. మాటల్లో మాత్రం వెయ్యి రూపాయలు దాటితే ప్రతిదీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని చెప్పి ఆఖరికి ఓపీ కూడా ప్రైవేటుగానే రాయించుకోవాల్సివస్తోంది. ఆచరణలో ఓపీకి కూడా దిక్కులేదు. జగన్ మాత్రం సాక్షి పత్రికలో ఆరోగ్యశ్రీపై అబద్ధపు ప్రకటనలు ఇవ్వడానికి, బ్యానర్ వార్తలివ్వటానికి ఉన్న శ్రద్ధ పేదలకు సరైన వైద్యం అందించాలనే చిత్తశుద్ధి లేదు.

ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక కోటి నలభై లక్షల మందికి ఆరోగ్యశ్రీ విస్తరించిందంటున్నారు. 40 లక్షల మందికి మేము కార్పొరేట్ వైద్యం అందించాము అని ఫేక్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఫైనాన్స్ మినిష్టర్ బుగ్గన ఇటీవల ప్రెస్ మీట్ లలో మేం 9 వేల కోట్ల రూపాయలు ఆరోగ్య శ్రీకి ఖర్చు పెట్టామంటున్నారు. నిజంగానే మీరు ఆరోగ్యశ్రీకి అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టివుంటే 12వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పి నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వారు పదే పదే మీకు నోటీసులు ఎందుకిస్తున్నారు? చర్చలు జరిపి ఎంతో కొంత అమౌంటు వారికి రిలీజ్ చేయడం జరుగుతోంది.

మళ్లీ సర్వీసులు కొనసాగిస్తు వస్తున్నారు. నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వారు వారికి రావాల్సిన బకాయిల మీద సర్వీసులు అన్నీ కూడా రద్దు చేశాయి. దీనికి వైసీపీ గవర్నమెంట్ ఏం సమాధానం చెబుతుంది. సంవత్సరాదాయం 5 లక్షల వరకు ఉంటుందో వారికి ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్న అన్ని సదుపాయాలు వారికి కూడా అమలు జరుగుతాయని చెబుతున్నారు. కానీ అమలు చేయడంలేదు. అత్యవసర సమయాల్లో మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగికి ఇబ్బంది అవుతోందని చెప్పి బయట అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితికి జగన్ తీసుకొచ్చారు. 3,255 జబ్బుల ఆరోగ్యశ్రీ కిందికి వస్తాయని అబద్ధాలు చెబుతున్నారు.

మెడికల్ ప్రొసీజర్ లు కూడా జత చేశారు. ఆరోగ్యశ్రీకి కేంద్రం ఇస్తున్న నిధులను కూడా దారి మళ్లించారు. అంబులెన్స్ సర్వీసుల్లో రూ.370 కోట్లు అవినీతి జరిగింది. ప్రైమరి హెల్త్ సెంటర్లను నిర్వీర్యం చేసి ఫ్యామలీ డాక్టర్ లు ఆరోగ్య సురక్ష అని పేరు మార్చి తూట్లు పొడుస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పేదవారికి మెరుగైన వైద్యం కోసం 33 పథకాలను అమలు చేస్తే జగన్ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. గవర్నమెంటు హాస్పిటల్స్ నిర్వహణలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. నీతి అయోగ్ హెల్త్ ఇండెక్స్ గత చంద్రబాబు హయాంలో ఏపీ 4వ స్థానంలో ఉండగా.. జగన్ ప్రభుత్వ హయాంలో అది కాస్త 10 వస్థానానికి పడిపోయింది.

సోషియల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం పేదలకు ప్రాథమిక వైద్యం అందించటంలో జగన్ పాలనలో ఏపీ 23వ స్థానికి పడిపోయింది. 15వ ఆర్థిక సంఘం 2023-24 సంవత్సరానికిగాను 514 కోట్లు ఆరోగ్యశ్రీ కింద రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం రూ. 25 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. జగన్ కు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ వుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకానికి కూడా తన ముఖ చిత్రం ప్రచురించడం జగన్ కు ఉన్న పబ్లిసిటీ పిచ్చి అర్థమౌతోంది. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా వైద్య ఆరోగ్య శాఖకు రావాల్సిన రూ.15 వందల కోట్లు ఆపేస్తామని హెచ్చరించినా జగన్ లో చలనం లేదు. 104, 108 సర్వీసులను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారు.

కేంద్రం పీఎంజేవై కింద ఇచ్చే 60 శాతం నిధులును కూడా జగన్ రెడ్డి దారి మళ్లించాడు. చంద్రబాబునాయుడు గారి హయాంలో బాలింతలకు, గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించేందుకు తీసుకొచ్చిన తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, బాలామృతం, గోరుముద్ద, అన్నా అమృత హస్తం, మహాప్రస్థానం వంటి బృహత్తర పథకాలను జగన్ రద్దు చేశాడు. జగన్ అధికారంలోకి వచ్చాక కరెంటు కోతలు అధికమయ్యాయి. వీటి వల్ల సెల్ ఫోన్ లైట్లతో, టార్చ్ లైట్ల వెలుగుల్లో సర్జరీలు చేసిన సంఘటనలు జగన్ హయాంలోనే జరిగాయి. ఆసుపత్రుల్లో సరైన మౌలిక వసతులు, సదుపాయాలు అందించడంలో జగన్ విఫలమయ్యడనడానికి డెలివరి వార్డుల్లో ఒకే బెడ్ మీద ఇద్దరు బాలింతలకు కేటాయించడం బాధాకరం.

గవర్నమెంటు ఆసుప్రతుల్లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఐసీయూ వార్డుల్లో ఎలుకలు చేరి ఒక బిడ్డ మృతికి కారణమయ్యాయి. ఇందతా వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత కారణంగా స్వీపర్లతో, హెల్పర్లతో రోగులకు వైద్యం చేయించడం బాధాకరం. కిడ్నీలు, హార్ట్, లివర్ ట్రాన్స్పిలెంటేషన్ లాంటి సర్జరీలను నిర్వీర్యం చేస్తున్నారు. న్యూరో ఆసుపత్రుల్లో న్యూరాలజీకి సంబంధించిన రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారు. టీడీపీ హయాంలో వీటికి ప్రాధాన్యత ఇచ్చేవారు. వీటితోపాటు టీడీపీ హయాంలో 6 లక్షలయ్యే కాంప్లియర్ ఇన్ ప్లాంటేషన్, 3.5 లక్షలయ్యే కిడ్నీ ట్రాన్స్ ప్లంటేషన్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద వర్తింపజేశారు. క్లయిమ్ అయిన వెంటనే 70 శాతం నిధులు విడుదల చేసేవారు.

కానీ ఇప్పుడు నిధుల లేమి కారణంగా ఈ సేవలు రోగులకు అందక ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజనీ ఏనాడైనా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆసుపత్రులను సందర్శించారా? ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన సమయానికి నాణ్యమైన వైద్యం అందక, కనీస మౌలిక సదుపాయాలు లేక అనేకమంది రోగులు ప్రాణాలు వదులుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను తెచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో మాత్రం పేదల వైద్యాన్ని గాలికి వదిలేశారు. ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. అప్పుడే ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుందని వినీల వివరించారు.

Leave a Reply