కన్నా లక్ష్మీనారాయణను భారీ మెజారిటీతో గెలిపిస్తాం

– వైసీపీనేతలు, మైనారిటీలు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడి సమక్షంలో, సత్తైనపల్లి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కన్నాలక్ష్మీనారాయణ నేత్రత్వంలో టీడీపీలో చేరికలు

– సత్తైనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీలో చేరిన పలువురు వైసీపీనేతలు, మైనారిటీలు

ప్రముఖ వైద్యులు శింగరాజు సాయికృష్ణ, ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు సయ్యద్ మహబూబ్, వైసీపీ యువజన విభాగం పల్నాడు జిల్లాకార్యదర్శి అంకాళ్ల రాంబాబు, వైసీపీ కౌన్సిలర్ గుజ్జర్ల పూడి సతీశ్ మాజీ ఎంపీటీసీ మిరియాల వెంకటేశ్వర్లు, వైసీపీ సీనియర్ నాయకులు రాయ చంద్రశేఖర్ రెడ్డి, గలబా సత్యనారాయణ, కాళహస్తి ఆదామ్, మర్రి శ్రీలక్ష్మి సహా 200 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు శనివారం మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీతీర్థం పుచ్చుకున్నారు. అచ్చెన్నా యుడు వైసీపీనేతలకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం మైనారిటీ నాయకులు అచ్చెన్నాయుడిని సత్కరించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వైసీపీ నాయకులు మాట్లాడుతూ…
తెలుగుదేశం-జనసేన కలయికతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పునాదులు కదులుతు న్నాయని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి, ప్రజలకు మంచి భవిష్యత్ ఉంటుందని, ఆయన నాయకత్వం కోసం ప్రజలు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సత్తైనపల్లి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని, కన్నా లక్ష్మీనారాయణ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు.

 

Leave a Reply