Suryaa.co.in

Telangana

హైదరాబాద్ కు మూసీ ఒక పెద్ద ఎస్సెట్

– దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో బిల్డర్స్ పా
– ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో బిల్డర్స్ పాత్ర ఉంది..
ఈ ప్రభుత్వం మీతో ఉందని చెప్పడానికే మేం ఇక్కడికి వచ్చాం..
ఆర్ధికంగా మీరు బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం బిల్డర్స్ సమస్యలకు తప్పకుండా పరిష్కారం చూపుతుంది.

ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులతో హైదరాబాద్ నగరం లేక్ సిటీగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ కు మూసీ ఒక పెద్ద ఎస్సెట్. మూసీని పునరుద్ధరించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకొస్తోంది.

తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ 2050ని తీసుకు రాబోతున్నాం. ఇందుకు మీ సహకారం ఎంతో అవసరం. మీ అనుభవాన్ని తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించండి. విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించేందుకు మీ అందరి సహకారం ఉండాలి.

LEAVE A RESPONSE