-కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారంటీలు పూటకొకటి ఎగిరిపోతున్నాయి
– ఆరునెలలకే కర్ణాటక అతలాకుతలం
– హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారంటీలు పూటకొకటి ఎగిరిపోతున్నాయి.ఆరునెలలకే కర్ణాటక అతలాకుతలం అవుతున్నది.అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని పోరాడి తెలంగాణ సాధించుకున్నాం.తెచ్చుకున్న తెలంగాణలో కృష్ణ, గోదావరి జలాలను తెలంగాణ బీళ్లకు మళ్లించుకున్నాం.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం .. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం.విద్య, వైద్యం, తాగునీళ్లు, సాగునీళ్లు, విద్యుత్ రంగాలను గణనీయంగా అభివృద్ది చేసుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత వేగంగా అభివృద్ది చెందిన రాష్ట్రం లేదు.ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ది వదిలేసి కాంగ్రెస్ మాటలు ప్రజలు నమ్మరు.
తెలంగాణ గురించి అడిగితే ఇడ్లీనా, దోశనా అని అధికార మదంతో అవమానకరంగా మాట్లాడి తెలంగాణ ప్రజలకు చేసిన గుండె కోత మిగిల్చారు. కాంగ్రెస్ చేసిన గాయాలను ప్రజలు అప్పుడే మరిచిపోరు.కాంగ్రెస్ పాలనలో అనుభవించిన బాధలు, కష్టాలు ప్రజలకు తెలుసు. అప్పుడే వాటిని మరిచిపోయి ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తారనుకోవడం అత్యాశ.
38 రోజుల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్.మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి.గత తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజలతో ఉన్నాం . వారికి ఏం చేయాలో చేశాం .. ఏమి చేయాలో తెలుసు.చేసేది మేమే కాబట్టి .. చేయాల్సినవాటి గురించి ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. కేసీఆర్ బహిరంగసభల్లో ప్రజల ఆదరణ దీనిని వెల్లడిస్తున్నది.