Suryaa.co.in

Features

ఆయన కలం పరితాపమే పుష్పవిలాపం!

నేనొక పూలమొక్క కడ నిల్చి
చివాలున కొమ్మవంచి
గోరానెడునంతలోన విరులన్నియు జాలిగ
నోళ్ళు విప్పి మా ప్రాణము
తీతువాయనుచు బావురుమన్నవి
కృంగిపోతి
నా మానసమందెదో తళుకుమన్నది
పుష్పవిలాప కావ్యమే..

మొక్కలకూ ప్రాణముందని
శాస్త్రీయంగా
రుజువు చేసిన బోసు..
అవీ విలపిస్తాయని
అక్షరాలా వివరించిన జంధ్యాల..
పూవు కోస్తుంటే మొక్క పడే బాధను చూసి కరిగే కరుణ
ఎవరికుంటుంది
కరుణశ్రీకి గాక..
ప్రతి మొక్క కన్నీటి చుక్క
ఆయన కంట్లో నలక..!

ఊలు దారాలతో
గొంతుకురి బిగించి..
గుండెలో నుండి సూదులు
గ్రుచ్చి కూర్చి ముడుచు
కొందరు ముచ్చట
ముడుల మమ్ము అకట!
దయలేని వారు
మీ యాడువారు..

ముదితలు ముచ్చటగా
ముడిన ముడిచేందుకు
అల్లుకునే పూలమాల
వెనక ఇంత వ్యధుందా..
ఇంతటి కధుందా!
కవి గాక వీటిని కనేదెవ్వరు..
ఆ కవి కలం కాక
అంత వ్యాకులం
చెందేదేమిటి..!
అందరూ ఇష్టపడే
పూలలోని కష్టం చూసి
కన్నీరే సిరాగా
కరుణశ్రీ అందించిన
కవితా ధార..
పుష్పవిలాపం..!
ఘంటసాల స్వరంలో
మరింత శోకసాగరమై
తెలుగింట మధురసుధాసారమై..!!

బాణభట్టుని
సంస్కృత కాదంబరి..
తెలుగులో కరుణశ్రీ
అనువాద ఝరి..
ప్రాకృతము సులభాకృతమై!

జంధ్యాల వారి
కవితాత్రయము
ఉదయశ్రీ..విజయశ్రీ..కరుణశ్రీ
శాస్త్రి గారి
సున్నిత హృదయం..
తర్క మస్తిష్కం..
జీవిత సారమట..
అవే సత్యం..శివం..
సుందరానికి ప
రూపాంతరాలై..
తరతరాలై..
నిరంతరాలై..!

ఇ.సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE