– కాంగ్రెస్ చేసిన సర్వేలో బీసీల జనాభా ఎట్లా తగ్గింది?
– 60 లక్షల మందికి లెక్కలు లేవు
– బీసీలకు అసెంబ్లీలో చట్టం చేసి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
– కులగణన రీసర్వే చేయాలి
– మాజీ మంత్రి,ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ చిట్ చాట్
హైదరాబాద్: బీసీల్లో అవేర్ నెస్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని తెలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హామీ ఇచ్చింది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీపై 17 వ తేదీపై నిర్ణయం తీసుకుంటాము. మేయర్,డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై కేటీఆర్ ఆధ్వర్యంలో వచ్చే వారం మీటింగ్ ఉంటుంది.
పరిస్థితులకు అనుగుణంగామేయర్,డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై నిర్ణయం ఉంటుంది. బీసీ మూవ్ మెంట్రాష్ట్రంలో బలంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన కులగణన సర్వేలో చాలా తప్పులు ఉన్నాయి.కేసీఆర్ చేసిన సర్వేలో బీసీలు 51 శాతం మంది ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో బీసీల జనాభా ఎట్లా తగ్గింది?
తెలంగాణలో బీసీ,ఎస్సి,ఎస్టీ, మైనారిటీలు 90 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా పిల్లలు ఉన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి లెక్కలు లేవు. బీసీ ముస్లింల జనాభా పెరగలేదు,ఓసీ ముస్లింల జనాభా పెరిగింది అని అంటున్నారు ప్రభుత్వం కులగణన రీసర్వే చేయాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అసెంబ్లీలో చట్టం చేసి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.
పార్టీ పరంగా ఇస్తే బీసీలు ఒప్పుకోరు. పార్లమెంట్ లో బిల్లు పెట్టి ప్రధాని ఆమోదించాలి జనాభా తక్కువ చూపిస్తే నిధులు తక్కువ వస్తాయి. పునర్విభజన జరిగితే అసెంబ్లీ,పార్లమెంట్ సీట్లు తెలంగాణకు తగ్గుతాయి. ప్రభుత్వం రీసర్వే చేస్తే కేసీఆర్,కేటీఆర్,బిఆర్ఎస్ నేతలు సర్వేలో పాల్గొంటారు.
జీహెచ్ఎంసీ కార్పోరేటర్లతో కేసీఆర్,కేటీఆర్ మీటింగ్ ఉంటుంది. నెంబర్ గేమ్ ను బట్టి మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం ఉంటుంది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేశాక స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేస్తాము పార్టీ పరంగా పోరాటం చేస్తాము.కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.