Suryaa.co.in

Telangana

కేసీఆర్ గారూ.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి

-మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి పొన్నం ఆహ్వానం
-కేసీఆర్‌తో కలసి భోజనం చేసిన పొన్నం

హైదరాబాద్: ఈనెల 9న ప్రభుత్వం తలపెట్టిన తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని, మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఆ మేరకు ఆయన ఫార్మ్‌హౌస్‌కు వెళ్లిన పొన్నం, ఆహ్వానపత్రిక అందించారు. ఆయనతో కలసి భోజనం చేశారు.

అనంతరం మీడియాతో పొన్నం ఏమన్నారంటే..ప్రభుత్వ పక్షాన ఉదయం గవర్నర్ ని కలిసి 9 వ తేది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కు రావాలని ఆహ్వానించాం. తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలిసి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి నాతో పాటు మా ప్రోటోకాల్ చైర్మన్ హార్కర వేణుగోపాల్ ,ప్రోటోకాల్ డెరైక్టర్ వెంకట్ రావు ని కలిసి అహ్వానించాం. ప్రభుత్వ పక్షాన మర్యాదగా అందరినీ గౌరవించుకుంటాం. విగ్రహ ఏర్పాటు పై ఎలాంటి చర్చ జరగలేదు. రాజకీయాలు వేరు. ఆహ్వానించాం. వారు ప్రతిపక్ష నాయకులుగా, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా ఆహ్వానించా. భోజన సమయంలో రావడం వల్ల వారి ఆహ్వానం మేరకు భోజనం చేశాం.

LEAVE A RESPONSE