కవితపై చర్యలు తీసుకుండా బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం న్యాయమా కేసీఅర్?

*లిక్కర్ మాఫియాలో కవిత పై చర్యలు తీసుకుండా బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం న్యాయమా కేసీఅర్ ?
* త్యాగాల ఫలితంపై ఏర్పడ్డ తెలంగాణని తెరాస తాగుబోతుల తెలంగాణగా మార్చింది గాక, ఆఖరికి దేశ రాజధాని ఢిల్లీని కూడా తాగుబోతులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు
*టీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత వ్యవహార శైలి ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే అన్నట్లుగా వుంది
* గాంధేయ మార్గంలో దీక్షలో బండి సంజయ్ ని అరెస్ట్ చేసి భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇదే న్యాయం ? పోలీసులు ఏం పోయికాలం వచ్చింది ?
*టీఆర్ఎస్ పెద్దలకు ఈవాళ వందల కోట్ల రూపాయిల ఫార్మ్ హౌస్, బంగ్లాలు ఎక్కడి నుండి వచ్చాయి.?
* టీఆర్ఎస్ అవినీతి పాపం పడింది. ఈరోజు కాకపోయినా రేపైనా సరే జైల్లో కూర్చుని ఊచలు లెక్కపెట్టక తప్పదు
* భారతీయ జనతా పార్టీ నేత డా. దాసోజు శ్రవణ్ సూటి ప్రశ్న

”టీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత వ్యవహార శైలి ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే అన్నట్లుగా వుంది” అని విమర్శించారు భారతీయ జనతా పార్టీ నేత డా దాసోజు శ్రవణ్. లిక్కర్ మాఫియా ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోపోగా.. నిరసన తెలపడానికి వెళ్ళిన భారతీయ జనతాపార్టీ కార్యకర్తలపైన విచక్షణ రాహితంగా దాడి చేయడం, దీక్ష చేస్తున్న భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేయడాన్ని ఖండించారు దాసోజు.

ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ.. ఏమాత్రం, నీతి, నిజాయితీ, కనీస బాధ్యత లేకుండా తెలంగాణని తాగుబోతుల తెలంగాణగా మార్చారు. పట్టణాల్లో ప్రతి గల్లీకో బీర్ , బార్ షాపులు పెట్టారు. ప్రతి పల్లెలో పది బెల్ట్ షాపులు పెట్టి జలగల మాదిరి పేదల ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఖాజనా నింపుకుంటున్న కేసీఆర్ సర్కార్, దేశ రాజధాని ఢిల్లీని కూడా తాగుబోతుల మయంగా మార్చే లిక్కర్ పాలసీని అక్కడికి తీసుకెళ్ళి దాంట్లో వేలకోట్ల రూపాయిలు దండుకున్నారని ఆరోపణలు వచ్చిన తర్వాత నీతి నిజాయితీ వున్న వాళ్ళు అయితే వెంటనే కవిత పై పార్టీ, చట్టపరమైన చర్యలు తీసుకోపోగా, శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్ళిన భారతీయ జనతాపార్టీ కార్యకర్తలపైన విచక్షణ రాహితంగా దాడి చేశారు.

అంతేకాకుండా ప్రజాస్వామ్యం బద్దంగా గాంధేయ మార్గంలో ధర్మదీక్షలో కూర్చున్న భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన పోలీసులు విచ్చలవిడిగా దాడి చేసి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆయనతో పాటు కార్యకర్తలని అరెస్ట్ చేసి భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇదే న్యాయం ? పోలీసులు ఏం పోయికాలం వచ్చింది ? అని ధ్వజమెత్తారు దాసోజు.

”తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇది న్యాయమా ? విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణని తాగుబోతుల తెలంగాణగా మార్చింది గాక, ఆఖరికి ఢిల్లీని కూడా తాగుబోతుల మయంగా చేయాలని కవిత భావిస్తుంటే, కవిత తప్పిదాన్ని కట్టడి చేసేదిపోయి, సిగ్గులేకుండా టీఆర్ఎస్ నాయకులు కవితకి మద్దతుగా ఉంటామని ప్రధాని మోడీ, అమిత్ షా లని విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులకు అసలు సిగ్గుందా ? టీఆర్ఎస్ నాయకులు ప్రజల చెవిలో పువ్వులు పెడతామని భావిస్తున్నారా ? అని ప్రశ్నించారు.

కిరాయి ఇంట్లో వున్న టీఆర్ఎస్ పెద్దలకు ఈవాళ వందల కోట్ల రూపాయిల ఫార్మ్ హౌస్, బంగ్లాలు ఎక్కడి నుండి వచ్చాయి.? విదేశాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్న క్రమంలో వాటికి సమాధానం చెప్పకుండా బండి సంజయ్ ని అరెస్ట్ అరెస్ట్ చేసి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుండ్రు.

టీఆర్ఎస్ పాపం పడింది. ఈరోజు కాకపోయినా రేపైనా సరే జైల్లో కూర్చుని ఊచలు లెక్కపెట్టక తప్పదు. ఈ భయం నుండి బయటపడటానికి ప్రజలకు బ్రాంతి కలగజేయడం కోసం బండి సంజయ్ ని, బిజెపి నాయకులు,. కార్యకర్తలని అరెస్ట్ చేస్తామంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.” అని హెచ్చరించారు.

మంచి పరిపాలన అందించమని అధికారం కట్టబెడితే, విచ్చల దోపిడీ, అవినీతి, లిక్కర్, డ్రగ్ మాఫియా గ మారిన తెరాస కు తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ సమాజంకు దాసోజు విజ్ఞప్తి చేసిండ్రు.

Leave a Reply